
Mango – Romance: పండ్లలో రారాజుగా మామిడిని చెబుతారు. దాని రుచే వేరు. ఆకారంచూస్తే కూడా నోరూరుతుంది. తినాలనే కోరిక పుడుతుంది. బంగారు వర్ణంలో నిగనిగలాడే మామిడిని ఎవరు కూడా వదిలిపెట్టరు. కడుపార తినాల్సిందే. మామిడి మనకు ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది. ఇందులో ఉండే ఔషధ గుణాలు మనకు ఎన్నో రకాలుగా ప్రయోజనాలు కలిగిస్తాయి. మామిడి పండ్లలో ఒక రకమైన ఫైటిక్ ఆమ్లం ఉంటుంది. ఇది శరీరానికి ఎలర్జీ రాకుండా చేస్తుంది. దురద పుట్టకుండా కూడా సాయపడుతుంది. మామిడిని తినే ముందు శుభ్రంగా కడుక్కోవడం కూడా మరిచిపోవద్దు.
సొనను తీసేయాలి
మామిడి తొడిమ దగ్గర అంటుకునే సొన ఉంటుంది. దీన్ని పూర్తిగా తొలగించాలి. లేకపోతే సొనతో ఇబ్బంది ఏర్పడుతుంది. కాయను నీళ్లలో కడగడం ద్వారా ఫైటిక్ ఆమ్లం పోతుంది. ఆయుర్వేదం ప్రకారం భోజనం చేసే సమయంలో పండ్లను తీసుకోకూడదు. కానీ మామిడికి మినహాయింపు ఉంటుంది. పాలతో కలిపి తీసుకోవడం వల్ల బలమైన ఆహారంగా పనిచేస్తుంది. ఇది శృంగార కోరికలను పెంచుతుంది. శృంగారం పట్ల ఆసక్తిని పెరిగేలా చేస్తుంది. దీంతో కొత్తగా పెళ్లయిన దంపతులు వీటిని తీసుకోవడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది.

వాత, పిత్త దోషాలను..
వాత, పిత్త దోషాలను నివారించడంలో ఇది ప్రముఖ పాత్ర పోషిస్తుంది. జీర్ణ సమస్యలు లేకుండా చేస్తుంది. రుమటాయిడ్, ఆర్థరైటిస్, ల్యూషన్, సోరియాసిస్, ఎర్తియోసిన్ వంటి సమస్యలు రాకుండా నిరోధిస్తుంది. మామిడి పంట్లను పాలతో కలిపి తీసుకోవడం మంచిది కాదు. చర్మ సంబంధమైన సమస్యలు ఉన్న వారు మామిడి పండ్లను పాలతో కలిపి తీసుకోకూడదు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటంతో పాటు గ్యాలటానిన్లు, మ్యాంగిఫెరిన్ వంటి వృక్స రసాయనాలు అధికంగా ఉన్నట్లు చెబుతున్నారు.
తొక్కతోపాటే..
మామొడిని తొక్కతోపాటు తింటేనే పోషకాలు అందుతాయి. మలవిసర్జన సాఫీగా జరిగేందుకు దోహదపడుతుంది. ఇందులో విటమిన్ సి, ఎ దండిగా ఉండటంతో కొలాజెన్ ఏర్పడటానికి కారణమవుతుంది. మనుషుల్లో వృద్ధాప్య చాయలను దూరం చేసేందుకు కొలాజెన్ ఉపయోగపడుతుంది. మామిడి రసం వేడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఎండాకాలంలో వడదెబ్బ నివారణకు ఇది ఎంతో సాయపడుతుంది. అందుకే మామిడి పండును ఎండాకాలంలో విరివిగా తీసుకోవడం మంచిది.
రక్తహీనతను..
శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచేదిగా ఉంటుంది. ఇందులో ఉండే బీటా కెరోటిన్ పదార్థం ఉండటంతో మన శారీరక వ్యవస్థ బలోపేతమవుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రక్తహీనతను దూరం చేస్తుంది. రక్త హీనతతో బాధపడే వారు మామిడి పండ్లను ఆహారంగా చేసుకుంటే ఎంతో మేలు కలుగుతుంది. ఇది కూడా సీజనల్ గా దొరికే పండు కావడంతో ఎండాకాలంలో బాగా తినేందుకే ఇష్టపడతారు. దీంతో మన శక్తి పెరిగేందుకు దోహదపడుతుందని వైద్యులు చెబుతున్నారు.