https://oktelugu.com/

Tea: వీటిని తాగితే టీ జోలికి వెళ్లరు.. పైగా ఆరోగ్యం కూడా.. అవేంటంటే?

అంతేకాకుండా టీ లో ఉండే కెఫిన్ ఎక్కువగా శరీరంలోకి వెళితే జీర్ణక్రియపై ప్రభావం పడి కొలెస్ట్రాల్ పెరిగే ప్రమాదం ఉంది. అందువల్ల టీ ని సాధ్యమైనంత వరకు తక్కువగా తీసుకోవాలి.

Written By:
  • Srinivas
  • , Updated On : January 8, 2024 5:10 pm
    How to leave habit of drinking tea
    Follow us on

    Tea: ఉదయం నిద్రలేవగానే చాలా మందికి టీ తాగే అలవాటు ఉంటుంది. టీ స్విప్ చేయనిదే దినచర్య ప్రారంభం కాదు. టీ తాగడం వల్ల ప్రయోజనాలు, నష్టాలు రెండూ ఉన్నాయి. ఉదయం టీ ని తీసుకుంటే మనసు ఉల్లాసంగా మారుతుంది. కానీ కొందరు అతిగా టీ తాగుతారు. అన్నం తినాల్సిన సమయంలో కూడా టీ తాగి భోజనానికి దూరంగా ఉంటారు. ఇలా చేయడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి.

    అంతేకాకుండా టీ లో ఉండే కెఫిన్ ఎక్కువగా శరీరంలోకి వెళితే జీర్ణక్రియపై ప్రభావం పడి కొలెస్ట్రాల్ పెరిగే ప్రమాదం ఉంది. అందువల్ల టీ ని సాధ్యమైనంత వరకు తక్కువగా తీసుకోవాలి. కానీ కొందరు టీ కి ఇప్పటికే చాలా మంది బానిసలయ్యారు. వారు టీ తాగడాన్ని మానుకోవాలని ఎంత ప్రయత్నించినా సాధ్యం కావడం లేదు. కానీ టీ కి బదులు ఇవి తాగితే టీ జోలికి వెళ్లకుండా ఉంటారు.

    టీ తాగడం చాలా మంది వ్యసనం లా మారింది. రోజులో కనీసం 5 నుంచి 10 సార్లు టీ తాగేవారు ఉన్నారు. వీరికి ఇప్పటికే అనారోగ్య సమస్యలు ఎదురైనా టీ ని వదలకుండా ఉండడం లేదు. అయితే దానికి దూరంగా ఉండాలని ఎంత ప్రయత్నించినా సాధ్యం కావడం లేదు. పైగా టీ తాగకపోతే మనసు బాగోదు. టీ తాగకుండా ఉండాలంటే వాటికి ప్రత్యామ్నాయమైన మార్గాలు ఉన్నాయి. వాటిని తీసుకోవడం ద్వారా టీ తాగకుండా ఉండగలుగుతారు. అంతేకాకుండా టీ కి మించిన ఆరోగ్యం వస్తుంది.

    రోజూ ఉదయం టీ తాగితే పర్వాలేదు. కానీ మరోసారి టీ తాగాలని అనిపించినప్పుడు బ్రేక్ ఫాస్ట్ కు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇలా చేస్తే కడుపు నిండినట్లయి టీ తాగాని అనిపించదు. మధ్యాహ్నం బయటకు వెళ్లినప్పుడు టీ తాగాలని అనిపిస్తే గ్రీన్ టీ లేదా లెమన్ టీని తీసుకోండి. ఇవి తాగడం వల్ల ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఉదయం కూడా టీ కి బదులు లెమన్ టీ లాంటివి తీసుకోవడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటారు. సాయంత్రం టీ తాలని అనిపించినప్పుడు దానికి బదులు ఏదైనా ఇష్టమైన పదార్థం తీసుకోండి. దీంతో టీ గురించి మరిచిపోతారు.