Lok Sabha Elections 2024 : లోక్‌సభ ఎన్నికలకు అన్ని పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలవాలని బీజేపీ, కాంగ్రెస్ వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో జోష్‌లో ఉన్న కాంగ్రెస్ పార్లీమెంటు ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు రిపీట్ చేయాలని భావిస్తోంది. ఈమేరకు ఇప్పటికే 17 లోక సభ స్థానాలయు మంత్రులు, సీనియర్ నాయకులను ఇన్‌చార్జీలుగా నియమించింది. పార్లమెంట్ ఎన్నికల కమిటీని కూడా ఏర్పాటు చేసింది. బీజేపీ కూడా తెలంగాణలో ఈసారి 10 స్థానాలు గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈమేరకు కసరత్తు మొదలు పెట్టింది. ఈమేరకు హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో పారీ‍్ట రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అధ్యక్షతన కీలక భేటీ నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఈనెలలోనే ప్రధాని మోదీ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. అనంతరం పార్లమెంట్ పొలిటికల్ ఇన్‌చార్జీలను ప్రకటించారు. రాజధానిలోని హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గాలకు ఎమ్మెల్యే రాజాసింగ్, ఎంపీ లక్ష్మణ్‌ను ఇన్‌చార్జీలుగా నియమించారు. కరీంనగర్ ఇన్‌చార్జిగా ఎమ్మెల్యే ధనపాల్‌ను ప్రకటించారు.
ఇన్‌చార్జీలు వీరే..
►హైదరాబాద్ రాజసింగ్(ఎమ్మెల్యే)
►సికింద్రాబాద్- డాక్టర్ లక్ష్మణ్
►చేవెళ్ల- ఎమ్మెల్సీ వెంకట్ నారాయణరెడ్డి
►మల్కాజిగిరి- పైడి రాకేశ్‌రెడ్డి(ఎమ్మెల్యే)
►అదిలాబాద్- పాయాల్ శంకర్(ఎమ్మెల్యే)
►పెద్దపల్లి- రామారావు పటేల్(ఎమ్మెల్యే)
►కరీంనగర్- ధన్‌పాల్ సూర్యనారాయణ(ఎమ్మెల్యే)
►నిజామాబాద్- ఏలేటి మహేశ్వర్‌రెడ్డి(ఎమ్మెల్యే)
►జహీరాబాద్- వెంకటరమణారెడ్డి(ఎమ్మెల్యే)
►మెదక్- పాల్వాయి హరీశ్(ఎమ్మెల్యే)
►మహబూబ్ నగర్- రామచందర్‌రావు
►నాగర్ కర్నూలు- మాగం రంగారెడ్డి
►నల్గొండ- చింతల రామచంద్రారెడ్డి
►భువనగిరి – ఎన్‌వీఎస్‌ఎస్.ప్రభాకర్
►వరంగల్ – మర్రి శశిధర్‌రెడ్డి
►మహబూబాబాద్ – గరికపాటి మోహన్‌రావు
►ఖమ్మం- పొంగులేటి సుధాకర్‌రెడ్డి