Sleeping Tips: ఇలా చేస్తే హాయిగా నిద్రపోతారు..

మంచి పుస్తకం మంచి స్నేహితుడి లాంటివాడు అని అంటారు. పుస్తకం చదవడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. మంచి కథల పుస్తకం చదవడం వల్ల ఎంతో హాయిగా ఉంటుంది. దీంతో ఇష్టమైన బుక్ ను ప్రతి రాత్రి పడుకునే ముందు చదువుకునే అలవాటు చేసుకోండి. ఇలా చేయడం వల్ల హాయిగా నిద్ర పడుతుంది.

Written By: Gopi, Updated On : November 16, 2023 10:49 am

Sleeping Tips

Follow us on

Sleeping Tips: ఉద్యోగాలు, వ్యాపారాల కారణంగా చాలా మంది ఒత్తిడికి గురవున్నారు. ఇంట్లో ఉండే గృహిణులు సైతం మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. మెదడులో జరిగే ఆందోళనతో ఇలాంటి వారికి రాత్రి అనుకూలంగా నిద్ర పట్టదు. దీంతో నిద్రపట్టేవరకు టీవీ చూడడం లేదా ఫోన్ తో కలాక్షేపం చేయడం చేస్తారు. కానీ ఇలా చేయడం వల్ల కలత నిద్ర మాత్రమే వస్తుంది. సుఖంగా నిద్రపోలేదు. అయితే హాయిగా నిద్రపోవడానికి కొన్ని మార్గాలున్నాయి. వాటిని పాటించడం ద్వారా ఎలాంటి ఆందోళనలు లేకుండా నిద్రపోగలుగుతారు. మరి హాయి నిద్ర కోసం ఏం చేయాలి?

పుస్తకం చదవడం:
మంచి పుస్తకం మంచి స్నేహితుడి లాంటివాడు అని అంటారు. పుస్తకం చదవడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. మంచి కథల పుస్తకం చదవడం వల్ల ఎంతో హాయిగా ఉంటుంది. దీంతో ఇష్టమైన బుక్ ను ప్రతి రాత్రి పడుకునే ముందు చదువుకునే అలవాటు చేసుకోండి. ఇలా చేయడం వల్ల హాయిగా నిద్ర పడుతుంది.

మూడు నిమిషాలు శ్వాసాయానం:
నిద్రపోయే ముందు 3 నిమిషాల పాటు శ్వాస పీలుస్తూ వదలండి. ఇలా చేయడం ద్వారా అప్పటి వరకు ఎన్ని ఆందోళనలు ఉన్నా వాటిని మరిచిపోగలుగుతారు. అంతేకాకుండా ఇలా ప్రతి రోజు చేయడం వల్ల కానసంట్రేషన్ పెరుగుతుంది. దీంతో ఎటువంటి చెడు ఆలోచనలు రాకుండా నిద్రపోగలుగుతారు.

ఇష్టమైన మ్యూజిక్ వినడం:
కొందరికి సంగీతం అంటే చాలా ఇష్టం. కానీ అది వినేంత సమయం ఉండదు. అయితే పడుకునే 5 నిమిషాల మందు ఇష్టమైన సంగీతం వినడం ద్వారా మనసు ఉల్లాసంగా మారుతుంది. దీంతో ఆటోమేటిక్ గా నిద్ర పడుతుంది. ఉదయం లేచిన తరువాత కూడా యాక్టివ్ గా ఉంటారు.

కుటుంబ సభ్యులతో మాట్లాడండి:
ఉదయం ఎంతో ఒత్తిడితో ఉంటారు. సాయంత్రం పడుకునే కాసేపటి వరకు కుటంబ సభ్యులతో కబుర్లు చెప్పండి. అవసరమైతే వారితో జోకులు వేయండి. పిల్లలతో ఆడుకోండి. అలా చేయడం వల్ల శరీరం రిలాక్స్ గా మారుతుంది. దీంతో ఎటువంటి ఒత్తిడి లేకుండా హాయిగా నిద్రపోతారు.