https://oktelugu.com/

Read And Write: చదవడం.. రాయడం వస్తే చాలు గ్రామంలోనే ఉద్యోగం.. త్వరపడండి

మంచి జీతంతో ఉద్యోగం చేయాలని చాలా మందికి కోరిక ఉంటుంది. కానీ కొందరు ఊరును విడిచి బయటకు వెళ్లలేరు. అందులోనూ కుటుంబ బాధ్యతలు ఉన్న వారు ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి ఇష్టపడరు. మరికొందరు తాము అనుగుణంగా చదువుకోలేదని, అందువల్ల ఉద్యోగాలకు పనికిరామని మథనపడుతూ ఊర్లోనే ఉండిపోయేవారు చాలా మంది ఉన్నారు.

Written By:
  • Srinivas
  • , Updated On : October 26, 2024 / 11:33 AM IST

    Job-Offers

    Follow us on

    Read And Write: మంచి జీతంతో ఉద్యోగం చేయాలని చాలా మందికి కోరిక ఉంటుంది. కానీ కొందరు ఊరును విడిచి బయటకు వెళ్లలేరు. అందులోనూ కుటుంబ బాధ్యతలు ఉన్న వారు ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి ఇష్టపడరు. మరికొందరు తాము అనుగుణంగా చదువుకోలేదని, అందువల్ల ఉద్యోగాలకు పనికిరామని మథనపడుతూ ఊర్లోనే ఉండిపోయేవారు చాలా మంది ఉన్నారు. ఇలాంటి వారి కోసం తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉన్న ఊర్లోనే ఉంటూ.. ఇతర పనులు చేసుకుంటూ ఇతర ఉద్యోగాలు చేసే అవకాశాన్ని కల్పించింది. ఈ ఉద్యోగం చేసిన వారికి రూ.15,600 జీతం కూడా నిర్ణయించింది. మరి ఈ ఉద్యోగం ఏంటి? ఇందులో ఎలాంటి పనులు చేయాలి? ఆ వివరాల్ోలకి వెళితె..
    తెలంగాణలో సాగు భూములకు కాలువే ప్రధానం. ప్రాజెక్టుల నుంచి గ్రామాల్లోని పొలాలకు నీరు రావాలంటే కాలువలు ఎంతో ఉపయోగపడుతాయి. అయితే ఒక్కోసారి ప్రాజెక్టు నుంచి విడుదలయిన నీరు చివరి పంటలకు చేరడం కష్టమవుతోంది. ఇందుకు కారణం కాలవులగకు గండ్లు పడడం లేదా.. కొందరు కావాలని గండ్లు ఏర్పాటు చేయడం. కొందరు తమ పొలాల్లోకి నీరు రావాలనే ఉద్దేశంతో కాలువలకు గండ్లు పెడుతూ ఉంటారు. దీంతో ఇందులోని నీరు చివరి వరకు చేరకుండా మధ్యలోనే ఆగిపోతుంది. దీంతో చివరిక ఆయకట్టు  ప్రాంతాల్లోని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి ఎప్టపి నుంచో ఉంది. కానీ ప్రభుత్వాలు పట్టించుకోలేదు.
    అయితే తాజాగా  తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సమస్యకు చెక్ పెట్టాలని చూస్తోంది. కాలువలోని నీరు పక్కదోవ పట్టకుండా.. అనుకోని కారణాల వల్ల కాలువలకు గండ్లు పడినా గుర్తించడానికి కొందరు వ్యక్తులను నియమించుకోనుంది. వీరినే లష్కర్లు అంటారు. వీరు కాలువల వెంబడి తిరుగుతూ గస్తీ కాస్తారు. కాలువలోని నీరు సక్రమంగా చివరి వరకు చేరేలా చూసుకుంటారు. ఎక్కడైగా గండ్లు పడితే వెంటనే గుర్తించి వాటిని పూడ్చేందుకు చర్యలు తీసుకుంటారు.
    తాజాగా ప్రభుత్వం లష్కర్లు, వారికి హెల్పర్లను నియమించుకోవాలని నిర్ణయించింది. చదవడం, రాయడం వచ్చి కాస్త విద్యార్హత ఉన్న వారిని లష్కర్లుగా నియమించుకుంటారు. అయితే వీరు 45 ఏళ్లలోపు ఉండి.. కాస్త ఫిట్ గా ఉండాల్సిన అవసరం ఉంది. ఆయా గ్రామాల్లోని కాలువలను, ప్రాజెక్టులను నిత్యంపరిశీలిస్తూ వాటిని పర్యవేక్షిస్తూ ఉండాలి. వీరిని ఔట్ సోర్సింగ్ ద్వారా నియమించుకుంటారు. వీరికి రూ. 15,600 జీతం చెల్లించనున్నారు. అయితే ఈ నియామకంపై అధికారికంగా ఉత్తర్వులు రావాల్సి ఉంది.
    అధికారికంగా ఉత్తర్వులు వస్తే గ్రామాల్లో నిరుద్యోగులుగా ఉంటున్న వారికి ఇది మంచి అవకాశం అని చెప్పొచ్చు. కొంత మంది విద్యార్హత లేకపోవడంతో తాము ఏ ఉద్యోగానికి అర్హులం కామని భావిస్తారు. అంతకాకుండా పట్టణాలకు వెళ్లడానికి ఇష్టపడని వారు ఉంటారు. ఇలాంటి వారు ఈ ఉద్యోగం చేసుకోవచ్చు. సొంత ఊర్లోనే ఉంటూ మిగతా పనులు చేసుకుంటూ ఈ ఉద్యోగం చేయొచ్చు. అయితే కాలువలు ఉన్న గ్రామాల్లోని వారికి మాత్రమే ఈ అవకాశం ఉండనుంది. అయితే పూర్తి డీటేయిల్స్ తో ప్రభుత్వం ప్రకటన వెలువరించే అవకాశం ఉంది.