
Wife: ఆడవారికి మంగళసూత్రం ఐదో తనానికి గుర్తు. సమాజంలో ఆడవారి గౌరవానికి ప్రతీకగా నిలిచేది మంగళసూత్రమే. మంగళసూత్రాన్ని ధరించడం వల్ల వైవాహిక జీవితంలో ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. మెడలో మంగళసూత్రం, నుదుటిపై బొట్టు, కాళ్లకు మెట్టెలు పెట్టుకోవడం ఆమెకు మరింత ఆభరణంలా కనిపిస్తుంది. సమాజంలో గౌరవప్రదమైన బాధ్యత ఇచ్చేది మంగళసూత్రమే కావడం గమనార్హం. సముచితమైన ఆడదానిగా స్థానం ఇచ్చేది కూడా ఇదే. వివాహిత అని సంకేతాలు తెలియజేసేది కూడా మంగళసూత్రమే.
మంగళసూత్రం అంటే మంగళకరమైన బంధం. పెళ్లి రోజు వరుడు వధువు మెడలో కట్టే తాళినే మంగళసూత్రం అని పిలుస్తాం. నిబద్ధత, ప్రేమ, నమ్మకం అన్నింటికి మంగళసూత్రమే ఆధారం. ఒకసారి తాళి కడితే చాలు జీవితాంతం వారిద్దరు ఒకటిగా చేసేది మంగళసూత్రమే. జీవిత కాలంలో భార్య బతికున్నంత కాలం మగాడి ఆలిగానే ఆమెకు స్థానం ఉంటుంది. కుటుంబ సభ్యుల సమేతంగా అందరి ఆశీర్వాదాలతో కట్టే మంగళసూత్రం విషయంలో మహిళలు జాగ్రత్తలు తీసుకోవాలి.
మంగళసూత్రాన్ని మెడ నుంచి ఎప్పుడు తీయకూడదు. అందులో గుచ్చే నల్లపూసల్లో కూడా దైవత్వం ఉంటుంది. భర్త ఆయుష్షుకు కూడా పరిపూర్ణమైన భరోసా ఇస్తుందని నమ్ముతారు. భర్త చనిపోతేనే తాళిని తీస్తారు. కానీ అంతవరకు కూడా మహిళ మెడలోనే ఉంటుంది మంగళసూత్రం. భర్త పోయిన వారినే తాళి, బొట్టు, గాజులు తీసేసి విధవగా చెబుతారు. మంగళసూత్రాన్ని మెడలో ఉంచుకోవడమే శ్రేయస్కరం. మంగళసూత్రం విరిగిపోయిన, పోయిన అరిష్టంగా భావిస్తారు.
మంగళసూత్రం విషయంలో మహిళలు నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు. ఎప్పుడు కూడా దానికి పిన్నులు, పిన్నీసులు లాంటివి పెట్టకూడదు. వేదమంత్రాలతో కట్టిన తాళిని ఎగతాళి చేసే పనులు చేయడం సమంజసం కాదు. మంగళసూత్రానికి ఎలాంటి ఇతర వస్తువులు పెట్టడం మంచిది కాదు. అలా చేసినట్లయితే భర్త ఆయుష్షుకు నష్టం కలుగుతుంది. మంగళసూత్రానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతర ఏవి కూడా తగిలించకూడదు. అలా చేస్తే దుష్ఫలితాలు ఏర్పడతాయని తెలుసుకోవాలి.
