Richest People: ఐశ్వర్యం అంటే కేవలం డబ్బు మాత్రమే ఉంటే సరిపోతుందా? డబ్బు ఉన్నవారు అందరూ ఐశ్వర్యవంతులేనా? మనిషి పుట్టింది కేవలం డబ్బు సంపాదించడానికి మాత్రమేనా? ఇంతకీ ఐశ్వర్యవంతులు, అదృష్టవంతులు అంటే ఎవరంటే మీరు ఏమని సమాధానం చెబుతారు. కానీ నేను మాత్రం మరొక ఈక్వేషన్ చెప్పబోతున్నాను? ఇంతకీ ఏంటి అనుకుంటున్నారా? ఇది చదివిన తర్వాత కాస్త అయినా మీ మనసు మారుతుంది కావచ్చు. మరి చూసేయండి.
ఐశ్వర్యవంతులు అంటే ఎవరో కాదు తిన్న ఆహారం ఆరోగ్యంగా అరుగుతుందా? పడుకోగానే నిద్ర పడుతుందా? ఇదిగో ఈ రెండు ఉంటే చాలు మీరు ఐశ్వర్యవంతులే.. ఈ రెండు ఉంటే లక్ష కోట్లు ఉన్న వారి కంటే మీరే అదృష్టవంతులు కూడా. కోట్ల డబ్బు ఉన్నవారికి తినడానికి సరైన సమయం ఉండదు. కంటి నిండా నిద్ర ఉండదు. మరింత డబ్బు ఎలా సంపాదించాలి? ఆ డబ్బులు ఎలా దాచి పెట్టాలి? అని సతమతమవుతూ ఉంటారు. అందుకే ఎక్కువ ఆశించకుండా తృప్తి పడ్డప్పుడు మాత్రమే జీవితం సంతోషంగా ఉంటుంది.
మనిషి పుట్టిన దగ్గర నుంచి డబ్బు వెంటనే వేట మొదలు పెడితే సంతోషానికి సమయం ఎక్కడ ఉంటుంది?ఇంతకీ సంతోషం అంటే ఏంటి? ఎక్కడ కొనుక్కుంటే దొరుకుతుంది ఈ సంతోషం? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? డబ్బు కేవలం అవసరాలకు మాత్రమే సరిపోతుంది. రెండు తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తుల వెనుక పరిగెత్తే వారికి సంతోషం ఉండదు. కుటుంబ సభ్యులు కలిసి కూర్చొని, కష్ట సుఖాలు మాట్లాడుకొని చేదోడు వాదోడుగా ఉన్న కుటుంబంలోనే సంతోషం ఉంటుంది.
నవ్వును మర్చిపోతూ టెన్షన్ లకు దగ్గర అవుతూ, ఏడుపును హగ్ చేసుకుంటూ ఉంటే ఇక సంతోషానికి సందేది? అందుకే డబ్బు ఉంటేనే ఐశ్వర్య వంతులు అనుకోకూడదు. హాయిగా నిద్ర పోతే, మీరు తిన్న ఆహారం తృప్తిగా జీర్ణం అవుతే మీరు చాలా అదృష్టవంతులు అని గుర్తు పెట్టుకోండి. మీకంటే రిచ్ ఎవరు లేరు అనుకోండి. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఫుల్ టెన్షన్ తో ఉన్నవారు చాలా మంది ఉంటారు. అందుకే అలాంటి సమస్యలు మీకు లేవంటే మీరు అదృష్టవంతులు అన్నట్టే.