
Liver Health: మన శరీరంలో అతి ముఖ్యమైన భాగాల్లో కాలేయం ఒకటి. మనం తిన్న ఆహారాలు జీర్ణం చేయడంలో లివర్ ఎన్నో విధాలుగా కష్టపడుతుంది. దీంతో మనం తినే ఆహారాలు అరిగించడంలో కాలేయ పాత్ర ప్రముఖమైనది. అలాంటి లివర్ డ్యామేజ్ అయితే కొన్ని లక్షణాలు మనకు కనిపిస్తాయి. అప్పుడు మనం వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. లేకపోతే కాలేయం పూర్తిగా చెడిపోతే అనర్థాలు వస్తాయి. జీర్ణం కాకుండా ఆహార పదార్థాలు మనకు అరగకుండా పోతాయి. దీంతో మనకు ఇబ్బందులు తప్పవు. అందుకే కాలేయంపై భారం పడకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాలేయ సమస్యలు ఉంటే కచ్చితంగా ట్రీట్ మెంట్ తీసుకోవాల్సిందే.
అలసటగా ఉంటోందా?
మన కాలేయం పని చేయకుండా పోయిందనడానికి కూడా కొన్ని లక్షణాలు మనకు కనిపించడంతో జాగ్రత్తలు వహించాలి. నిత్యం అలసటగా ఉంటే లివర్ ఆరోగ్యంపై దృష్టి సారించాల్సిందే. చిన్న చిన్న పనులు చేసినా సరే అలసిపోతుంటే లివర్ డ్యామేజీ అయిందని గుర్తుంచుకోవాలి. నోరు దుర్వాసన వస్తే కూడా లివర్ కు ముప్పు ఏర్పడినట్లే. అకస్మాత్తుగా బరువు పెరగడం కూడా కాలేయ సమస్యనే సూచిస్తుంది. కాలేయం అనారోగ్యానికి గురైందంటే ఈ సంకేతాలు రావడం సహజమే.
కొవ్వు పేరకుపోతోందా?
పొట్టకు రెండు వైపుల కొవ్వు పేరుకుపోతే కూడా కాలేయ సమస్య ఉన్నట్లు భావించాలి. కాలేయం చుట్టు కొవ్వు పేరుకుపోవడం వల్ల లివర్ మనకు సంకేతాలు తెలియజేస్తుంది. ఈ నేపథ్యంలో తరచుగా తలనొప్పి కూడా వస్తుంది. లివర్ లో టాక్సిన్లు ఉండిపోవడంతో తలనొప్పి వస్తుంది. కాలేయం పాడైపోయిందనడానికి మరో కారణం మనకు తీపి వస్తువుల మీద ఎక్కువ శ్రద్ధ పుడుతుంది. అప్పుడు కూడా మనం కాలేయం సమస్యల్లో ఉన్నట్లు గుర్తించుకోవాలి. తగిన చికిత్సలు చేయించుకోవాలి.
ఇంకా పలు రకాల..
లివర్ చెడిపోతే జీర్ణక్రియ కూడా దెబ్బతింటుంది. శరీరానికి కావాల్సిన పోషకాలు అందవు. కడుపు నొప్పిగా అనిపిస్తుంది. నాలుక పొడిబారినట్లు అవుతుంది. వికారం కూడా వస్తుంది. ఇలా లివర్ పాడు కావడానికి అనేక కారణాలు ఉంటాయి. ఈ లక్షణాలు కనిపించినట్లయితే తక్షణమే వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకుంటే మంచిది. లేదంటే జబ్బు ముదిరితే లివర్ పనిచేయకుండా పోతే ప్రాణాలే పోతాయి. అందుకే మనం లివర్ ను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

కాలేయం దెబ్బతినకుండా..
కాలేయ వ్యాధి ఉన్నట్లయితే ఆరోగ్యం దెబ్బతింటుంది. అన్ని అవయవాలపై ప్రభావం పడుతుంది. లివర్ డ్యామేజ్ తో శరీరంలో పలు మార్పులు కూడా చోటుచేసుకుంటాయి. దీంతో లివర్ దెబ్బతినకుండా ఉండాలంటే నూనె పదార్థాలు ఎక్కువగా తీసుకోకూడదు. ఇంకా ఉదయం పూట అల్పాహారంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా పూరీ, వడ, పరోటా లాంటి నూనె పదార్థాలను తీసుకోవడం మంచిది కాదు. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులే ఎదురవుతాయి. అందుకే కాలేయాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడింది.