Girl Names: పిల్లలు పుట్టగానే వారికి ఏం పేర్లు పెట్టాలా అని తర్జన భర్జన పడుతుంటారు తల్లిదండ్రులు. ఇందుకోసం సంఖ్యాశాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం ఫాలో అవుతుంటారు. అంకెలు, అక్షరాల ఆధారంగా పేర్లు పెడుతుంటారు. వాటి ఆధారంగా వారి భవిష్యత్ ఉన్నతంగా ఉంటుందని, అదృష్టవంతులవుతారని భావిస్తుంటారు. పండితులు కూడా ఇదే చెబుతుంటారు. అయితే అమ్మాయిలకు పెట్టే పేరుతో ఆ ఇంట్లోకి లక్ష్మి నడిచొస్తుందట. ఈ ఆరు అక్షరాలతో ఉండే పేర్లు చాలా శక్తివంతమైనవని, ఈ అక్షరాల పేర్లు ఉన్న అమ్మాయి ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని అంటున్నారు. వారి జీవితంలో ఎప్పుడూ సుఖాలకు లోటు ఉండదు.
అ అక్షరం..
అ అక్షరంతో మొదలయ్యే అమ్మాయిలు చాలా అదృష్టవంతులు అని భావిస్తారు. వీరికి మంచి నాయకత్వ లక్షణాలు ఉంటాయట. తన స్వభావంతో ఎవరి మనసునైనా గెలుచుకుంటారు. కుటుంబ సభ్యులకు చాలా అదృష్టవంతులుగా నిరూపిస్తారు. కెరీర్‌లో ఉన్నత స్థితిని సాధిస్తారు.
ఇ అక్షరంతో..
ఇ అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిలు చాలా ధైర్యంగా ఉంటారు. వారు ఏది అనుకుంటే అది సాధిస్తారు. వారి జీవితంలో దేనికీ లోటు ఉండదు. వారితోపాటు వారి చుట్టూ ఉన్నవారు కూడా అదృష్టవంతులు అవుతారు.
ఔ అక్షరంతో..
ఔ అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిలు క్షణంలో ఎవరినైనా తమ వైపుగా మలుచుకుంటారు. వారికి భిన్నమైన ఆకర్షణ ఉంది. ఇతరులకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. లక్ష్మి దేవి ప్రత్యేక అనుగ్రహం వారిపై ఉంటుంది. వారు జీవితంలో ఎప్పుడూ ఆర్థిక కష్టాలు రావు.
ఎ అక్షరంతో..
ఎ అక్షరంతో ప్రారంభమయ్యే అమ్మాయిలను అదృష్టవంతులుగా పరిగణిస్తారు. వారు చేయాలనుకున్న పనిని పూర్తి చేసేవరకు పట్టు వదలరు. ఆర్థిక పరిస్థితి సాధారణంగా బాగుంటుంది. చాలా శ్రద్ధగలవారు. లక్ష్మి దేవి వీరికి ప్రత్యేక అనుగ్రహాన్ని ఇస్తుంది.
సి అక్షరంతో..
ఈ అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిలు నిజాయితీ పరులు. చాలా అదృష్టవంతులు. కష్టపడి పనిచేస్తారు. భర్తకు ఆమె లక్ష్మీజీ అవతారం. ఎవరిని పెళ్లి చేసుకున్నా జీవితంలో డబ్బుకు, సంపదకు లోటుండదు.
ఎల్ అక్షరంతో..
ఈ అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిల కష్టపడి జీవితంలో మంచి స్థానాన్ని పొందుతారు. వీరికారణంగా కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది.. డబ్బు విషయంలో వారిని చాలా అదృష్టవంతులుగా భావిస్తారు.