Anasuya: దుమ్మురేపిందిగా.. అనసూయ న్యూఇయర్ సెలబ్రేషన్స్ ఫొటోలు వైరల్…

ఇప్పుడు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వేడుకల్ని కూడా తన ఫ్యామిలీతో పంచుకుంటూ తమదైన రీతిలో ఫోటోలను షేర్ చేసి తన ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంది.

Written By: Gopi, Updated On : January 1, 2024 11:40 am
Follow us on

Anasuya: 2023వ సంవత్సరం ముగిసిన సందర్భంలో డిసెంబర్ 31వ తేదీన సెలబ్రిటీలు తమదైన రీతిలో గడిచిన సంవత్సరానికి స్వస్తి పలుకుతూ కొత్త సంవత్సరానికి నాంది పలుకుతు భారీ ఎత్తున సెలబ్రేషన్స్ అనేవి చేసుకున్నారు. ముఖ్యంగా స్టార్ హీరోలు అందరూ విదేశాలలో ఉండి డిసెంబర్ 31ని భారీ ఎత్తున సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక ఇదిలా ఉంటే జబర్దస్త్ షో తో మంచి పాపులారిటీని సంపాదించుకున్న యాంకర్ అనసూయ తన ఫ్యామిలీతో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని భారీ ఎత్తున జరుపుకుంటుంది. ఇక తను ఏ విషయాన్ని అయినా సరే ఇలా సోషల్ మీడియా వేదికగా తన ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటుంది.

ఇక అందులో భాగంగానే ఇప్పుడు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వేడుకల్ని కూడా తన ఫ్యామిలీతో పంచుకుంటూ తమదైన రీతిలో ఫోటోలను షేర్ చేసి తన ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంది. ఏదేమైనా 2023వ సంవత్సరం అనసూయ కి బాగా కలిసి వచ్చింది.తను వరుసగా సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను అయితే ఏర్పాటు చేసుకుంది.ఇక అందులో భాగంగానే 2024వ సంవత్సరంలో కూడా తనకు భారీగా కలిసి రాబోతున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఆమె పుష్ప 2 వంటి పాన్ ఇండియా సినిమాలో నటిస్తూనే మరికొన్ని పాన్ ఇండియా సినిమాల్లో కూడా అవకాశాలను అందుకుంది.

ఇక పుష్ప 2 సినిమా 2024 ఆగస్టు 11వ తేదీన రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాతో మరొకసారి భారీ సక్సెస్ కొట్టబోతున్నట్టుగా అర్థమవుతుంది. అలాగే ఇతర భాషలలోని భారీ సినిమాల్లో కూడా తను నటించడమే కాకుండా మంచి పాత్రలను పోషిస్తున్నట్టుగా తను ఇంతకు ముందే తెలియజేసింది. ఇక ఈ ఇయర్ అంతా తనకు అనుకూలంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఫస్ట్ డే ని చాలా ఘనంగా జరుపుకోవడానికి ఆమె ఉత్సాహాన్ని చూపిస్తూ తన ఫ్యామిలీతో కలిసి భారీ ఎత్తున సెలబ్రేషన్స్ అయితే నిర్వహిస్తుంది.

ఇలా అనసూయ చేసిన ప్రతి పనిని కూడా సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకోవడం అనేది మంచి విషయమనే చెప్పాలి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈమె షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి దానిమీద చాలా మంది చాలా రకాల కామెంట్లు కూడా చేస్తున్నారు…