Poor vs Rich: ధనవంతులను చూసి పేదవాళ్లు ఆ స్థాయికి వెళ్లాలని కోరుకుంటారు. కానీ ధనవంతులు ఎప్పుడూ పేదవారీగా మారాలని అస్సలు కోరుకోరు. ఎందుకంటే ధనవంతులకు ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. వారి ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. వారిలా ఆలోచిస్తే పేదవారు ధనవంతులుగా మారుతారు. అలా ఆలోచించకపోతే పేదవారిగానే ఉండిపోతారు. అసలు ధనవంతులు ఎలా ఆలోచిస్తారు? పేదవారికి ఏ విధమైన ఆలోచనలు ఉంటాయి? ఏం చేస్తే ధనవంతులుగా మారిపోతారు?
జీవితంలో ప్రతి ఒక్కరికి డబ్బు సంపాదించాలన్న తపన కచ్చితంగా ఉంటుంది. ఇందుకోసం అందరూ కష్టపడతారు. కానీ కొంతమంది వద్దే డబ్బు ఎక్కువగా ఉంటుంది. మరికొందరి మధ్య తక్కువగా ఉంటుంది. ఇద్దరు వ్యక్తులు ఒకే సంస్థలో పనిచేసినప్పుడు ఒక వ్యక్తి దగ్గర ఎక్కువగా.. మరో వ్యక్తి దగ్గర తక్కువగా ఉంటుంది. అందుకు కారణం వారి అదృష్టం కాదు.. బ్యాక్ గ్రౌండ్ కాదు.. వారి ఆలోచనలే అని అనుకోవాలి. ఎందుకంటే డబ్బు సంపాదించడం ముఖ్యం కాదు.. దానిని సరైన మార్గంలో పెట్టడం ఇంపార్టెంట్ అని ఆర్థిక నిపుణులు తెలుపుతున్నారు. ఇద్దరు వ్యక్తులలో ఒకరికి డబ్బు ఎక్కువగా.. ఒకరికి తక్కువగా ఉండడానికి వారికి ఉండే విభిన్న ఆలోచనలే కారణం. వీరిలో ఒకరు ధనవంతుల లాగా.. మరొకరు పేదవారి లాగా ఆలోచిస్తారు.
ధనవంతులు లాగా ఆలోచించేవారు ఎప్పుడు సమయాన్ని వృథా చేయరు.. కానీ పేదవారి లాగా ఆలోచించేవారు తమ సమయాన్ని ఇతరులకు అమ్ముకుంటారు. ధనవంతులు కావాలని అనుకునేవారు కామం, ఇతర వ్యసనాలపై ఎక్కువగా దృష్టి పెట్టరు. పేదవారి లాగా ఆలోచించేవారు ఎప్పుడూ వీటి గురించి ఆలోచిస్తూ ఉంటారు. ముఖ్యంగా అమ్మాయిల గురించి ఎక్కువగా ఆలోచించేవారు పేదవారిగానే ఉండిపోతారు.
ధనవంతుల ఆలోచన ఎలా ఉంటుందంటే.. వారు సౌకర్యాల గురించి ఎప్పుడూ ఆలోచించరు.. ఏం చేస్తే డబ్బు సంపాదించాలో.. దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇతరులతో ఎక్కువగా కలిసిమెలిసి ఉండరు.. ఎప్పుడు చేసే పని పైనే దృష్టి పెడతారు. ఒక్కోసారి స్నేహితులు పిలిచినా వారి దగ్గరికి వెళ్లరు. అయితే తాము అనుకున్నది చేసిన తర్వాత మాత్రం కలుస్తూ ఉంటారు.
పేదవారీగా మారే ఆలోచన ఎలా ఉంటుందంటే.. ప్రతిరోజు వచ్చే సంపాదనను లెక్కిస్తూ ఉంటారు. ఆరోజు ఎలా ఎంజాయ్ చేయాలని అనుకుంటారు. ఎప్పుడు స్నేహితులను కలుస్తూ ఉంటారు. సొంతంగా వ్యాపారం చేయాలని అనుకోరు.. మరొకరి వద్ద పనిచేయాలని అనుకుంటారు. తమకు జీతం వస్తే చాలు.. ఎలాంటి రిస్కు ఉండకూడదని భావిస్తారు.
ఇలా ఇద్దరి వ్యక్తుల మధ్య విభిన్నమైన ఆలోచనలు ఉండబట్టే.. ఒకరు ధనవంతులుగా.. మరొకరు పేదవారీగా ఉండిపోతారు. అయితే పేదవారీగా ఉండేవారు ధనవంతుల మాదిరిగా ఆలోచిస్తే కచ్చితంగా విజయం సాధించే అవకాశం ఉంటుంది. వారితో స్నేహం చేసినా.. వారి ఆలోచనలకు తగ్గట్టుగా ముందుకు వెళ్ళచ్చు.