husbands : భర్తలు ఈ తప్పులు చేస్తే భార్యలు విడాకుల వరకు కూడా వెళ్లే ఛాన్స్ ఉంది..

మన దేశ సాంప్రదాయంలో వివాహ బంధానికి చాలా ప్రాముఖ్యత, విలువు, గౌరవం ఉన్నాయి. ఒక వయస్సు వచ్చాక.. ఒక మనిషికి కుటుంబ బాధ్యత అప్పగించడం ఈ వివాహ ముఖ్య ఉద్దేశం. అంతేకాదు మీరిద్దరు ఒకరికి ఒకరు తోడు ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఈ బంధాన్ని సృష్టించారు. అందుకు తగ్గట్టుగానే చాలామంది తమ బంధానికి విలువ ఇస్తున్నారు. కానీ ఈ మధ్య కాలంలో చాలా మంది పెళ్లి చేసుకున్న తర్వాత విడాకులు తీసుకోవడం కామన్ గా చూస్తున్నాం. ఇందులో ఆడవారు చేసే పనులకంటే, మగవారు చేసే పనుల వల్లే విడాకులు ఎక్కువగా తీసుకుంటున్నారని పలు అధ్యయనాల్లో తేలింది. అయితే మగవారు ఎలాంటి తప్పులు చేస్తున్నారు, వారు ఎలాంటి లక్షణాలను సరిదిద్దుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Written By: Swathi Chilukuri, Updated On : October 26, 2024 4:08 pm

If husbands do these mistakes, there is a chance that wives will go to divorce.

Follow us on

husbands : తల్లిదండ్రులను వదిలేసి వచ్చేసిన భార్యకు గౌరవం ఇవ్వాలి. బాధ్యతగా చూసుకోవాలి. అయితే కొందమంది మాత్రం దీనికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. భాగస్వామిని అస్సలు పట్టించుకోరు. వారి మాటలకు విలువ ఇవ్వరు. అలాగే సొంత నిర్ణయాలు తీసుకొని, వారిని బాధపెడుతూ ఉంటారు. భాగస్వామిపై శ్రద్ధ తీసుకోకుండా వారికి ఇష్టమొచ్చినట్లు జీవిస్తూ ఉంటారు. ఈ సమస్యలు ముందు చిన్నవిగా కనిపించినా.. కాలం గడుస్తున్న కొద్దీ, రోజులు మారుతున్న తరుణంలో అవే చాలా పెద్ద సమస్యలుగా మారుతుంటాయి.  వీటి వల్లనే విడాకులు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది.

ఎక్కువ సార్లు భార్యలు భర్త తమకు విలువ ఇవ్వరని, మాట వినరనే ఫిర్యాదులు చేస్తుంటారు. అలా భర్త మాట వినకపోవడం వల్లే ఈ సమస్యలు ప్రారంభం అవుతుంటాయి. అది క్రమంగా పెద్ద గొడవగా మారుతుంది. దీంతో విడాకుల వరకు వెళ్లడం కామన్ గా మారుతుంది. అందుకే ముందుగా భర్తలు తమ భార్య ఏం చెప్తుందో వినడం అలవాటు చేసుకోవాలి. వారి సమస్యలు ఏంటి, వారి భయాందోళనలు ఏంటి అనేది తెలుసుకోవాలి. వాటికి పరిష్కారం చూపేందుకు ప్రయత్నించాలి. వాటిని పరిష్కరించేందుకు కొంత సమయం తీసుకున్నా, కనీసం పరిష్కరించకపోయినా పర్వాలేదు.. కానీ ఆమె మాటను ఆమె పక్కన కూర్చొని వింటే సగం సమస్యలు తీరిపోతాయి.

గతంలో ఇంటి పని మొత్తం ఆడవారు చేస్తే, మగవారు బయటికి వెళ్లి సంపాదించుకొని వచ్చేవారు. అయితే ప్రస్తుతం పరిస్థితులన్నీ మారిపోయాయి. మగవారితో పాటు ఆడవారు కూడా సంపాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ పనిలో కూడా మగవారు భాగం అవ్వాలని అనుకుంటున్నారు. అందుకే కాస్త మీ భార్య చేసే పనుల్లో పాలు పంచుకుంటే ఆమెకు కొండంత అండ అనిపిస్తుంది. అలాగే మీ సతీమణికి కొంత భారం తగ్గినట్లు అనిపిస్తుంది. మనతో పాటు సమానంగా సంపాదిస్తున్నప్పుడు వారి పనిలో కూడా భాగం అయితే.. ఆమెకు భర్తపై గౌరవం పెరగడంతో పాటు ఇష్టం కూడా పెరుగుతుంది. అంతేకాదు సరదాగా భార్యాభర్తలు  కలిసి పని చేసుకుంటుంటే ఇద్దరి మధ్య ఐక్యత రెట్టింపు అవుతుంది అంటున్నారు నిపుణులు.  బంధువుల ముందు విలువ ఇవ్వడం చాలా అవసరం. సాధారణంగా ఎవరైనా బంధువులు ఇంటికి వస్తే భార్యను లేదా భార్య తరఫున వాళ్ళను తక్కువ చేసి మాట్లాడుతుంటారు. ఇలా చేయడం వివాహ బంధానికి చాలా ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు. బంధువులు ఇంటికి వచ్చినప్పుడు భార్యకు తగిన గౌరవం ఇవ్వాలని, వారి ముందు తక్కువ చేసి మాట్లాడొద్దని సూచిస్తున్నారు.