
Husband And Wife Relationship: శృంగారమంటే అందరికి ఇష్టమే. సృష్టి మొత్తం శృంగారంలోనే దాగి ఉంది. శృంగారంలో పరాకాష్టకు చేరితే అందులోని సుఖమే వేరు. అందుకే శృంగారం పట్ల మక్కువ చూపుతారు. భార్యాభర్తల మధ్య బంధాన్ని పెంచేది ఇదే. దీంతో పడకగది సుఖం ఇద్దరికి ఎంతో ప్రీతిపాత్రమే. జీవిత భాగస్వామిని సంతోషపెట్టే క్రమంలో మగాళ్లు తెగ ఆరాటపడుతుంటారు. చాలా మందికి కొన్ని సందేహాలు వస్తుంటాయి. తన వల్ల భార్య సుఖపడుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం చేస్తుంటారు. భాగస్వామిని సంతృప్తి పరచామా? లేదా? అనే సందేహాలు పడుతుంటారు. ఇందులో భాగంగా పదేపదే సతిని అడుగుతుంటారు.
భావప్రాప్తి కలగాలంటే..
ఆడవారిని సంతృప్తి పరచడం అంత తేలిక కాదు. వారికి భావప్రాప్తి కలగాలంటే మన తరం కాదు. శృంగారం ఆడ, మగ మధ్య అనురాగాలు పెంచే ఓ ప్రక్రియ. దీంతో ఇద్దరి మధ్య ప్రేమానుబంధాలు బలపడతాయి. పడక గదిలో భాగస్వామిని అడగరాని ప్రశ్నలు అడుగుతుంటారు. ఎలా అనిపించింది అని పదేపదే ప్రశ్నిస్తుంటారు. నీకు సంతృప్తి కలిగిందా అని అడుగుతారు. వాస్తవానికి ఇవి అడగని ప్రశ్నలైనా వారికి ఎందుకో ఉత్సాహంతో అలా చేస్తుంటారు. ఇది కరెక్టు కాదు. ఆడవారిని సంతృప్తి పరచాలంటే మన వశం కాదు.

మగవాడికి ఆత్రమెక్కువ
ఏదో మన తృప్తి కోసం ఊ అని అంటారు. కానీ వాస్తవానికి వారికి భావప్రాప్తి కలగాలంటే చాలా సమయం పడుతుంది. మగవాడికి ఆత్రమెక్కువ. స్త్రీలకు సహనమెక్కువ. అందుకే మహిళను భూదేవితో పోలుస్తారు. పురుషుడు అలా కాదు. సంతోషమొచ్చినా బాధ వచ్చినా ఆపుకోవడం కష్టమే. అదే ఉత్సాహంతో భార్యను పదేపదే అలా అడుగుతుంటారు. అలా అడుగుతూ తమ మగతనాన్ని నిరూపించుకోవాలని భావిస్తుంటారు. నిజానికి ఆడవారిని ఆనందపరచడం మనకు సాధ్యం కాదు. కానీ వారు ఏదో మన సంతోషం కోసం అలా చెబుతుంటారు.
ఉన్నది ఉన్నట్లు..
ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే మగవారికి నిద్ర కూడా పట్టదు. మన కోసం వారు మనసు చంపుకుని అలా చెబుతారు. ఉన్నది ఉన్నట్లుగా చెబితే తట్టుకోవడం మన వల్ల కాదు. లేనిపోని ప్రశ్నలు లేవనెత్తడం మానేసి ప్రేమగా మాట్లాడితే ప్రయోజనం. ఇద్దరి మధ్య మంచి సంబంధం ఉండాలంటే శృంగారంతోనే సాధ్యం. మగాడి మనసు తెలుసుకుని మసలుకునే మగువలకు భర్తల క్షేమమే కోరుకుంటారు. అనవసర ప్రశ్నలు మానుకుని అవసరమయ్యే మాటలు మాట్లాడితేనే మంచిది. కానీ అలా చేయరు.
ప్రేమతోనే..
అవసరం కాని వాటినే ఎక్కువగా పట్టించుకుంటారు. దీంతోనే భాగస్వామిని ఇలా అడుగుతుంటారు. ఈ నేపథ్యంలో భార్యలపై ప్రేమ పెంచుకుని వారికి అండగా నిలవాలి. అప్పుడే ఇద్దరి మధ్య మంచి సంబంధం ఉంటుంది. జీవితకాలం కలిసి నడిచే భార్య విషయంలో భర్తలు ఇతర పట్టింపులకు పోకుండా వారిని ప్రేమతో చూసుకోవడానికే ఇష్టపడాలి.