Homeలైఫ్ స్టైల్Iron Deficiency : ఐరన్ లోపం లక్షణాలేంటో తెలుసా?

Iron Deficiency : ఐరన్ లోపం లక్షణాలేంటో తెలుసా?

Iron Deficiency : ఇటీవల కాలంలో అనారోగ్య లక్షణాలు అందరిని బాధిస్తున్నాయి. చిన్న వయసులోనే రోగాలు దరిచేరుతున్నాయి. మనం తీసుకునే ఆహారాలతోనే మనకు నష్టం కలుగుతుంది. అందరు జంక్ ఫుడ్స్, బేకరీ ఉత్పత్తులకు అలవాటు పడుతున్నారు. ఫలితంగా అనారోగ్యాలను కొని తెచ్చుకుంటున్నారు. అయినా వాటికే ఆకర్షితులు అవుతున్నారు. అందులో వాడే ఉప్పు, నూనె, కారం వంటి వాటితో మనకు ఎన్నో సమస్యలు వస్తున్నాయి. ప్రస్తుతం మన అలవాట్లే మనకు చిక్కులు తెస్తున్నాయి. జంక్ ఫుడ్స్ వద్దంటే వాటినే ఆశ్రయిస్తున్నారు. దీంతో మన శారీరక వ్యవస్థ దెబ్బతింటోంది. రోగాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో మన శరీరంలో ఐరన్ లోపిస్తే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో తెలుసుకుందాం.

అలసట

చిన్న చిన్న పనులకే తొందరగా అలసిపోతారు. శరీరం సహకరించదు. ఎంతో పని చేసిన ఫీలింగ్ కలుగుతుంది. దీంతో మనకు ఏ పని చేయడానికి ఇష్టముండదు. ఇంకా చికాకు, ఏకాగ్రత లేకపోవడం, శరీరం బలహీనంగా మారడం వంటివి కనిపిస్తాయి. మనకు ఏది నిలకడగా అనిపించదు. అంతా గందరగోళంగా ఉంటుంది. పనిమీద పట్టుండదు. చేసే పనిలో ఏకాగ్రత కుదరదు. ఇలా పలు లక్షణాలు ఐరన్ లోపం వల్ల కనబడతాయి. ఇవి కనిపిస్తే వైద్యుడిని సంప్రదించి సరైన చికిత్స తీసుకోవాలి.

గుండె వేగంగా..

ఐరన్ లోపం వల్ల గుండె వేగంలో మార్పు వస్తుంది. ఆరోగ్యవంతుడి గుండె నిమిషానికి 70-80 సార్లు కొట్టుకుంటుంది. కానీ ఐరన్ లోపం తలెత్తితే గుండె వేగంలో మార్పు కనిపిస్తుంది. దీంతో ఆందోళన పెరుగుతుంది. పని చేయడంలో ఎలాంటి శ్రద్ధ కనిపించదు. ఏదో పోగొట్టుకున్న వారిలో ఉండే ఫీలింగ్ ఉంటుంది. నిద్రలో కాళ్లు కదిలించడం చేస్తుంటాం. దురదలు కూడా వస్తుంటాయి. ఇలా ఐరన్ పనితీరు మందగిస్తే మనకు ఎన్నో లక్షణాలు కనిపించడం సాధారణమే.

థైరాయిడ్

ఐరన్ లోపం వల్ల థైరాయిడ్ సమస్య ఏర్పడే అవకాశం ఉంది. చిన్న చిన్న విషయాలకే ఆందోళన చెందుతుంటాం. థైరాయిడ్ గ్రంథి పనితీరు మందగించడం వల్ల హైపో థైరాయిడిజం అనే సమస్య తలెత్తుతుంది. దీని వల్ల బరువు పెరుగుతుంటారు. శరీరం చల్లగా మారుతుంది. జుట్టు ఊడిపోతుంది. చర్మం పాలిపోతుంది. నాలుక మంట పుట్టడం వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయొద్దు. తక్షణమే వైద్యుడిని సంప్రదించి సరైన చికిత్స తీసుకుని ఐరన్ లోపాన్ని సవరించుకోవాలి. లేకపోతే సమస్య జఠిలమైతే ఇబ్బందులు ఏర్పడటం ఖాయం.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version