ICC ODI Rankings: టీమిండియా మెరుగైన ఫలితాలు సాధిస్తున్నా ర్యాంకింగ్స్ లో మాత్రం నెంబర్ వన్ స్థానం దక్కడం లేదు. దీంతో టీమిండియా ఇంకా శ్రమించాల్సి ఉంటుంది. మూడు దేశాలపై సిరీస్ లు నెగ్గినా ఫలితం మాత్రం ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. ఇంగ్లండ్, వెస్టిండీస్, జింబాబ్వేల్లో మూడు సిరీస్ లు నెగ్గినా ఇండియా ఐసీసీ ర్యాంకింగ్ లో మూడో స్థానంలో నిలవడం గమనార్హం. పాకిస్తాన్ నాలుగో స్థానంలో నిలిచింది. దీంతో టీమిండియా ఇంకా విజయాలు కొనసాగించాల్సిన అవసరం ఏర్పడింది.

జింబాబ్వేలో మూడు వన్డేల సిరీస్ లో ఆతిథ్య దేశాన్ని క్లీన్ స్వీప్ చేసింది టీమిండియా. సిరీస్ సొంతం చేసుకుంది. కానీ ఐసీసీ ర్యాంకింగులో 111 పాయింట్లు సాధించి మూడో స్థానంతోనే సరిపెట్టుకుంది. పాకిస్తాన్ నెదర్లాండ్ పై గెలిచి 107 పాయింట్లు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. భారత్ చేతిలో ఓటమి పాలైన జింబాబ్వే 40 పాయింట్లతో 13వ స్థానం దక్కించుకుంది. పాకిస్తాన్ చేతిలో ఓడిన నెదర్లాండ్ 14వ స్థానంలో నిలిచింది. వెస్టిండీస్ పై గెలిచిన న్యూజీలాండ్ నెంబర్ వన్ స్థానం పొందడం విశేషం.
Also Read: Vijay Devarakonda: లైగర్’ ఫ్లాప్ అయితే పరిస్థితేంటన్న ప్రశ్నకు విజయ్ దేవరకొండ అదిరిపోయే సమాధానం
119 పాయింట్లతో ఇంగ్లండ్ రెండో స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా ఐదో స్థానం, దక్షిణాఫ్రికా ఆరోస్థానం, బంగ్లాదేశ్ ఏడు, శ్రీలంక ఎనిమిది, వెస్టిండీస్ తొమ్మిది, అఫ్గనిస్తాన్ పది స్థానాల్లో కొనసాగుతున్నాయి. దీంతో టీమిండియా నెంబర్ వన్ స్థానం దక్కించుకోవాలంటే ఇంకా విజయాలు సాధించాల్సి ఉంది. ఐసీసీ ర్యాంకింగ్ లో నెంబర్ వన్ స్థానం దక్కించుకోవడానికి విజయయాత్ర కొనసాగించాల్సి ఉంది. ఆసియా కప్ లో తన సత్తా చాటితే నెంబర్ వన్ పొజిషన్ దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆటగాళ్లు ఆ దిశగా కసరత్తులు చేసి దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తున్నారు.

ఇంగ్లండ్, వెస్టిండీస్, జింబాబ్వే దేశాల్లో మెరుగైన ప్రదర్శన చేసినా వన్డే ర్యాంకింగ్స్ లో ఇంకా నెంబర్ వన్ స్థానంలోకి రాకపోవడంతో ఇంకా మెరుగైన ప్రదర్శన చేయాల్సిన అవసరం ఏర్పడుతోంది. టీ20, వన్డే సిరీస్ లలో అన్నింటిని దక్కించుకున్నా మెరుగైన స్థానం మాత్రం దక్కలేదు. దీంతో టీమిండియా ఇక అపజయాలు లేకుండా చూసుకుని విజయాలే లక్ష్యంగా దూసుకుపోవాల్సిన అవసరం వచ్చింది. దీనిపై ప్రేక్షకులు కూడా అదే ఆశిస్తున్నారు. ఐసీసీ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ పొజిషన్ కు చేరుకోవాలని కోరుకుంటున్నారు.
Also Read:Anna Mani: ఆ పుస్తకం కోసం.. వజ్రాల చెవిపోగలు వద్దనుకుంది.. దటీజ్ వెదర్ విమెన్ ఆఫ్ ఇండియా
[…] Also Read: ICC ODI Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్: జింబ… […]
[…] Also Read: ICC ODI Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్: జింబ… […]