Husbands And Wife Relationship: ఈ సృష్టిలో అందమైన బంధం భార్యాభర్తలది. ఇద్దరు తెలియని వ్యక్తులు కలిసి జీవితాంతం ప్రయాణించే క్రమంలో ఎన్నో ఆటుపోట్లు.. ఎన్నో సంతోషాలు.. ఎన్నో దుఃఖాలు.. అయినా వీటిని అధిగమించుతూ ఒకరికొకరు సాయం చేసుకుంటూ.. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ.. వందేళ్ళ జీవితాన్ని పూర్తిచేసే ఈ బంధం ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. అయితే ఒకప్పుడు భార్యాభర్తల బంధం ఏర్పడిన తర్వాత ఎన్ని సమస్యలు వచ్చినా జీవితాంతం కలిసి ఉండేవారు. కానీ నేటి కాలంలో స్వేచ్ఛ, స్వాతంత్రం పేరిట చాలామంది దంపతులు చిన్నచిన్న సమస్యలకే దూరమవుతున్నారు. అయితే భార్యాభర్తల మధ్య స్వచ్ఛమైన ప్రేమ ఉంటుంది. కానీ ఒక్కొకసారి అది మాయమవుతుంది. ఇలా మాయమైన క్రమంలో ఒకరి దృష్టిలో మరొకరు విలన్లుగా కనిపిస్తారు. అది ఎలా ఉంటుందంటే?
మనిషి చేసే ప్రతి పని మనసుతోనే ఉంటుంది. అంటే మంచి మనసుతో ఒక పనిని మొదలు పెడితే అది కచ్చితంగా విజయవంతంగా పూర్తవుతుంది. అలా కాకుండా దుర్బుద్ధితో ఏ పనిని మొదలుపెట్టిన అది మధ్యలోనే ఆగిపోతుంది. అలాగే మంచి దృష్టితో ఎదుటి వ్యక్తిని చూడడం వల్ల ఆ వ్యక్తి దేవుడిలా కనిపిస్తాడు. అలాగే వక్ర దృష్టితో చూడడం వల్ల ఎదుటి వ్యక్తి రాక్షసుడిలా కనిపిస్తాడు. ఇదే సందర్భంలో భార్యాభర్తల మధ్య ప్రేమ ఉన్నప్పుడు ఒకరి కొకరు దేవుళ్ళుగా భావించుకుంటారు. కానీ చిన్నపాటి మనస్పర్ధలు ఏర్పడితే ఎదుటివారు రాక్షసులు అయిపోతారు. అయితే ఇక్కడ మారిపోయేది మనషులు కాదు.. మనసులు మాత్రమే అని గ్రహించాలి. అంటే మనసులో వ్యతిరేక భావం ఏర్పడితే ప్రతి విషయం చెడుగానే కనిపిస్తుంది. అలాగే భార్యాభర్తల మధ్య చెడు వాతావరణం ఏర్పడితే ప్రతి విషయం పెద్దదిగానే మారుతుంది.
Also Read: Husband and Wife : భార్యాభర్తల మధ్య గొడవలా? ఈ సింపుల్ టిప్స్ తో సమస్యలు పరిష్కరించుకోండి..
ఇలాంటి అప్పుడు ఒక భర్త భార్యను.. ఒక భార్యాభర్తను మంచి దృష్టితో చూసి ప్రయత్నం చేయాలి. భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతే ఇతరులు జోక్యం చేసుకోవడానికి ముందుకు రారు. ఎందుకంటే వీరి మధ్య ఉండే గొడవ తాత్కాలికంగానే ఉంటుంది. అయితే అది వారి మనసులో ద్వేషం ఏర్పడినప్పుడు మాత్రమే. ఆ దేశం తొలిగిపోయిన సందర్భంలో ఒకరిపై ఒకరు అమితమైన ప్రేమను పంచుకుంటారు. ఇలాంటి అప్పుడు ఎదుటివారిపై ఒక్కోసారి ద్వేషం ఏర్పడిన కాస్త ఆలోచించి వారి మీద ప్రేమ చూపే ప్రయత్నం చేయాలి. అలా చేస్తే ఎప్పటికీ కలిసి ఉండే ప్రయత్నం చేస్తారు. దంపతులు ఎవరైనా శాశ్వతంగా కలిసి ఉండాలని కోరుకుంటారు. కానీ నేటి కాలంలో కొందరు చిన్న చిన్న విషయాలకే గొడవలు ఏర్పడి విడాకుల వరకు వెళ్తున్నారు. అలాకాకుండా ఒక్క క్షణం ఆలోచించి దేశాన్ని పక్కన పెడితే ఇద్దరి జీవితాలు బాగుంటాయి.
ఇదంతా మనసుతో చేసే పని మాత్రమే. మనసులో ద్వేషం కంటే ప్రేమను ఎక్కువగా ఉంచితే ఇలాంటి సమస్యలు ఎప్పటికీ రాకుండా ఉంటాయి. అంతేకాకుండా ప్రతి విషయాన్ని ప్రేమతో.. ప్రతి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇది ప్రతి ఒక్కరి పాటిస్తే వారి జీవితాల్లో ఎలాంటి మనస్పర్ధలు కూడా రాకుండా ఉంటాయి.