Ibomma Ravi: వాస్తవానికి ఐ బొమ్మ రవి చేసింది చాలా వరకు తప్పు. దీనిని ఎవరూ సమర్ధించరు. ఎందుకంటే అతడు చేసిన పని అటువంటిది కాబట్టి.. పైగా సినిమా అనేది వందల మంది కష్టం.. సృజనాత్మకత నిండి ఉండే సినిమాను చూసేవారు కోట్ల మంది ఉంటారు.. అందువల్లే రవి ఈ దందాను ఎంచుకున్నాడు.. సినిమాలను పైరసీ చేసి.. తన సైట్ లో అప్లోడ్ చేసుకుని.. బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్ చేసేవాడు. దీనికోసం కోట్లల్లో ఫీజు వసూలు చేసేవాళ్ళు.
తెలుగు సినిమా చాంబర్ కామర్స్ పిర్యాదు మేరకు రంగంలోకి దిగిన సైబర్ సెక్యూరిటీ పోలీసులు రవి అడుగులను నిత్యం గమనించడం మొదలుపెట్టారు. గత సెప్టెంబర్ లో కీలకమైన అడుగు వేసిన సైబర్ పోలీసులు ఆ తర్వాత అత్యంత వేగంగా దర్యాప్తు మొదలుపెట్టారు. ఆ తర్వాత రవిని కూకట్పల్లి ప్రాంతంలో అరెస్ట్ చేశారు. అతడు నిర్వహిస్తున్న వెబ్సైట్లను నిలుపుదల చేశారు. అతని ఖాతాలో ఉన్న నగదును ఫ్రీజ్ చేశారు. ఇవన్నీ కూడా ఒక రోజులో పూర్తి కాలేదు. రవి కార్యకలాపాల మీద.. అతడి వ్యవహారాల మీద పోలీసులు నిత్యం నిఘా వేశారు. పోలీసులను ఏ మార్చడానికి రవి కొద్దిరోజులు ఫ్రాన్స్ వెళ్ళాడు. ఆ తర్వాత అమస్టర్ డ్యాం వెళ్ళాడు. ఆ తర్వాత అక్కడ నుంచి మళ్లీ ఫ్రాన్స్ వచ్చాడు.. పోలీసులను మాయ చేశాడు. ఐతే పోలీసులు కూకట్పల్లి ప్రాంతంలో తన నివాసం వద్ద కాపు కాస్తున్న విషయాన్ని అతను పూర్తిగా మర్చిపోయాడు.
సైబర్ సెక్యూరిటీలో, హ్యాకింగ్ లో విపరీతమైన పట్టు ఉన్న రవిని భారత సైన్యం వాడుకుంటే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే చైనా, అమెరికా, పాకిస్తాన్ నుంచి హ్యాకర్లు నిత్యం మన దేశానికి సంబంధించిన వెబ్సైట్లను హ్యాక్ చేస్తుంటారు. కీలకమైన సమాచారాన్ని తస్కరించడానికి ప్రయత్నాలు చేస్తుంటారు.. అయితే హ్యాకింగ్ మీద విపరీతమైన పట్టు ఉన్న రవి.. దేశ సైన్యానికి.. ఇతర విభాగాలకు తన సేవలు అందిస్తే బాగుంటుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం ముష్కరుల హ్యాకింగ్ వల్ల మన దేశం తీవ్రంగా నష్టపోతోంది..
నెటిజన్లు ఈ రకంగా చెబుతున్నప్పటికీ మన సైన్యం ఎట్టి పరిస్థితుల్లో అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారి సేవలను ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించుకోదు . అటువంటివారిని మన దేశ అధికారులు గుడ్డిగా నమ్మరు.. ఎందుకంటే అటువంటి వారిని నమ్మడం అంటే దొంగకు తాళం చెవులు ఇచ్చినట్టే.