Tollywood: ప్రస్తుతం తెలుగులో చాలామంది దర్శకులు కంటెంట్ బేస్డ్ సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. హంగులు ఆర్భాటాలు లేకుండా మంచి కాన్సెప్ట్ తో ప్రేక్షకుడిని మెప్పించగలిగితే సినిమాలు సూపర్ సక్సెస్ ని సాధిస్తాయి అనేది రీసెంట్ గా కొన్ని చిన్న సినిమాలు ప్రూవ్ చేశాయి. ఇక ఈ సంవత్సరం రిలీజ్ అయిన సినిమాల్లో చిన్న సినిమాలు మంచి విజయాలను సాధించాయి. అందులో లిటిల్ హార్ట్స్ సినిమా భారీ విజయాన్ని దక్కించుకోగా రీసెంట్ గా తిరువీర్ హీరోగా వచ్చిన ‘ప్రీ వెడ్డింగ్ షో’ సినిమా సైతం గొప్ప విజయాన్ని అందుకుంది.
ఈ రెండు సినిమాల్లో కంటెంట్ మాత్రమే ప్రేక్షకుడికి బాగా నచ్చింది. ఈ సంవత్సరం వచ్చిన సినిమాలన్నింటిలో ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి. కామెడీతో పాటు ప్రేక్షకుడికి కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఇందులో ఉండటం వల్ల ఈ సినిమాలు తక్కువ బడ్జెట్ లో వచ్చి భారీ కలెక్షన్స్ ని కొల్లగొడుతూ ముందుకు దూసుకెళ్లాయి.
ఇక ప్రీ వెడ్డింగ్ షో సినిమా అయితే ఇప్పటికి థియేటర్లో సందడి చేస్తోంది.
ఇక ఇలాంటి క్రమంలోనే స్టార్ హీరోలతో సంబంధం లేకుండా మంచి సినిమాలు వస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు అని ఈ మూవీస్ ప్రూవ్ చేశాయి. ఇక ఈ క్రమంలోనే ఈవారం మరో చిన్న సినిమా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఈనెల 21 వ తేదీన ‘రాజు వెడ్స్ రాంబాయి’ అంటూ విలేజ్ ప్రేమ కథతో వస్తున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి. ఇక రీసెంట్ గా రిలీజైన ఈ మూవీ ట్రైలర్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది…
ఇక ఈ సినిమా సైతం ఈ సంవత్సరం చిన్న సినిమాల్లో పెద్ద విజయాన్ని సాధించి చిన్న సినిమాలకు ప్రాణం పోస్తోందా లేదా అనేది తెలియాల్సి ఉంది. వేణు ఉడుగుల లాంటి ఒక మంచి డైరెక్టర్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయడం విశేషం…ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో వాళ్ళు ఎలాంటి సక్సెస్ ను సాధిస్తారు. చిన్న సినిమాలకు గొప్ప గౌరవాన్ని తీసుకొచ్చే సినిమాగా ఈ సినిమా నిలుస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరో రెండు రోజుల పాటు వెయిట్ చేయాల్సిందే…