Winter Care For Kids: చలికాలంలో వ్యాధులు సంక్రమిస్తాయి. శీతాకాలంలో రోగాలు చుట్టుముట్టడం కామనే. కొద్ది రోజులుగా చలితీవ్రత పెరిగింది. దీంతో చలి బారి నుంచి రక్షించుకునేందుకు పలు రకాల చర్యలు తీసుకుంటున్నారు. దీంతో చిన్నారుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సిన అవసరం ఏర్పడింది. చిన్నారులు పలు రకాల జబ్బుల బారిన పడే అవకాశం ఉంటుంది. వారి ఆరోగ్యంపై జాగ్రత్తలు వహించాలి. చలికాలంలో జలుబు, దగ్గు పిల్లలను ఇబ్బందులు పెడతాయి. దీంతో వారి సంరక్షణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.

శీతాకాలంలో చిన్నారులకు ఊపిరితిత్తుల సమస్య (ఆస్తమా) వ్యాపించే ప్రమాదం ఉంటుంది. అందుకే తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. చలి నుంచి రక్షించుకునేందుకు స్వెటర్లు వాడాలి. చెవులకు కూడా ఇబ్బందులు కలగకుండా మంకీ క్యాప్ ధరించి వారిని కాపాడుకోవాలి. ఈ కాలంలో వైరల్ జ్వరాలు కూడా వ్యాపించే ముప్పు ఉంటుంది. దీంతో ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించాలి. జ్వరం ఉన్నట్లయితే వైద్యుడిని సంప్రదించి మందులు వాడాలి. వారిని కంటికి రెప్పలా చూసుకోవాలి.
చెవుల్లో వారికి ఇన్ఫెక్షన్ సోకే అవకాశాలుంటాయి. చెవుల్లో కురుపులతో నొప్పి వస్తుంది. దీంతో కొందరికి చీము పట్టడం జరుగుతుంది. ఇలాంటివి సోకకుండా అప్రమత్తంగా ఉండాలి. చలితో ముక్కులో భాగం పొడిబారటం వల్ల రక్తం కారుతుంది. తక్షణమే వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవాలి. చర్మంపై దురదలు రావడం వల్ల గోకినప్పుడు పుండ్లు పడే వీలుంది. ఒకవేళ అలా పుండ్లు పడితే వైద్యులను సంప్రదించాలి. తగిన వైద్యం చేయించుకోవాలి. పిల్లలకు హాని జరగకుండా వ్యవహరించాలి.

చర్మ సంబంధమైన సమస్యలు రాకుండా శరీరానికి మాయిశ్చరైజ్ క్రీములు రాసుకోవాలి. రాత్రి, పగలు పిల్లలకు ఉన్ని దుస్తులు వేయాలి. చేతులకు గ్లౌజులు కూడా వేయాలి. అప్పుడే చలి తీవ్రత చిన్నారులకు తగలదు. రోగనిరోధక వ్యవస్థ దెబ్బతినకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటే సరి. జ్వరం బారిన పడకుండా వైద్యుల సూచనల మేరకు మందులు వాడుకోవాలి. చల్లని పదార్థాలు కాకుండా వేడిగా ఉన్నవే తినాలి. ఆహారం కలుషితం అయితే రోగాలు అంటుకుంటాయి. చల్లని పానీయాలు అసలే తాగొద్దు.
చలికాలంలో పోషకాలు ఉండే ఆహారాలను తీసుకుంటే ఉత్తమం. జబ్బులను తట్టుకునే శక్తి వస్తుంది. ఈ కాలంలో వచ్చే దుమ్ముతో గొంతునొప్పి వస్తుంది. పిల్లలను చలిలో తిరగనీయొద్దు. ఇలా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని పిల్లలను వ్యాధుల బారి నుంచి రక్షించుకోవాల్సిన అవసరం తల్లిదండ్రులపై ఉంది.