Alia Bhatt- Ranbir Daughter Name: బాలీవుడ్ కపుల్ రణ్ బీర్ కపూర్-ఆలియా భట్ లకు ఇటీవలే పండంటి ఆడబిడ్డ జన్మించింది. వారిద్దరి కూతురు క్యూట్ ఫొటోలు కూడా రిలీజ్ చేసి సంతోషం పంచుకున్నారు. అయితే తాజాగా వారి కూతురు పేరు రివీల్ చేశారు. ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ పేరేంటి? దానివెనుక కథ ఏంటి అన్నది ఆలియా వివరించింది. అదే ఇప్పుడు వైరల్ అయ్యింది.

కూతురిని ఎత్తుకున్న ఫొటోను షేర్ చేసిన ఆలియా.. తన బుజ్జి పాపాయి పేరు ‘రాహా’ అని తెలిపింది. ఈ కొత్త పేరు, దానర్థం కూడా ఆసక్తికరంగా వివరించింది. ఈ పేరును రణ్ బీర్ కపూర్ తల్లి, నీతూకపూర్ సూచించిందట.. ‘రాహా’ అంటే దైవ మార్గమని చెప్పుకొచ్చింది. స్వాహిలీ భాషలో ఆనందమని.. సంస్కృతంలో వంశమని.. బెంగాలీలో విశ్రాంతి, అరబిక్ లో శాంతి, సంతోషం అని అర్థాలని ఆలియా వివరించింది.
రాహా రాకతో తన జీవితం కొత్తగా ప్రారంభమైందని ఆలియా తెలిపింది. ప్రస్తుతం ఆలియా షేర్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన పలువురు సెలబ్రెటీలు, నెటిజన్లు ఆలియా-రణ్ బీర్ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

ఆలియా-రణ్ బీర్ లు ఈ ఏడాది ఏప్రిల్ 14న వివాహం చేసుకున్నారు. సడెన్ గా వీరిద్దరూ పెళ్లిపీటలెక్కి ఒక్కటయ్యారు. ఏడాది తిరగకముందే వీరిద్దరికీ పండంటి పాప జన్మించడం విశేషం.