Credit Card: నేటి కాలంలో చాలా మంది వద్ద క్రెడిట్ కార్డులు ఉన్నాయి. వివిధ అవసరాల నిమిత్తం క్రెడిట్ కార్డులు ఎంతో ఉపయోగపడుతాయి. చేతిలో డబ్బులు ఉన్నా అససరమైన వస్తువులు కొనుగోలు చేయడంతో పాటు కావాల్సినంత లోన్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే బ్యాంకు ఇచ్చే క్రెడిట్ కార్డుల గురించి పూర్తిగా తెలుసుకునే అవసరం ఉంది. నేటి కాలంలో సైబర్ నేరగాళ్ల బెడద ఎక్కువవుతోంది. ఈ నేపథ్యంలో కార్డును జాగ్రతత్తగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే సమయంలో క్రెడిట్ కార్డు గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ముఖ్యంగా ప్రతీ క్రెడిట్ కార్డుపై 16 అంకెలు కనిపిస్తాయి. ఇవి ఎందుకు ఉంటాయో తెలుసా?
చిన్న చిన్న ట్రాన్జాక్షన్ చేసేవారికి కూడా ప్రస్తుత కాలంలో బ్యాంకులు క్రెడిట్ కార్డులు జారీ చేస్తున్నాయి. ఉద్యోగులు, వ్యాపారులు ఎవరికైనా ఒకటికి మించి క్రెడిట్ కార్డులు ఉన్నాయి. క్రెడిట్ కార్డులు సక్రమంగా ఉపయోగిస్తే అనేక లాభాలు ఉంటాయి. సమయానికి బిల్లులు చెల్లించలేకపోతే అధిక వడ్డీలు చెల్లించాల్సి వస్తుంది. అందువల్ల క్రెడిట్ కార్డుకు సంబంధించి అవగాహన తెచ్చుకొని సక్రమంగా వినియోగించాలి.
అయితే క్రెడిట్ కార్డుపై వెనుక వైపు సీవీ నెంబర్ ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైనది. ఈ నెంబర్ తో కార్డు వివరాలు మొత్తం తెలిసిపోతాయి. ఆన్ లైన్ లో కొన్ని వస్తువులు కొనుగోలు చేయాలంటే ఈ నెంబర్ ను కచ్చితంగా ఎంట్రీ చేయాలి. ఇక కార్డు ముందరి భాగంలో 16 అంకెలు ఉంటాయి. ఇవి ఎప్పుడైనా గమనించారు. ఈ అంకెలు ఏవో కావు.. క్రెడిట్ కార్డుకు సంబంధించిన అకౌంట్ నెంబర్. ఈ నెంబర్ ఆధారంగా ఆ కార్డు కూడా ఎలాంటి అకౌంటో తెలుసుకోవచ్చు.
ఈ అకౌంట్ నెంబర్ మొదటి అంకె 4 ఉంటే అది వీసా అకౌంట్ అని గుర్తించాలి. 5 అయితే మాస్టర్ కార్డు అని తెలుసుకోవాలి. ఇక 6 ఉంటే అది రూపే కార్డు అని తెలుసుకోవాలి. ఈ కార్డు అంకెల ద్వారా అకౌంట్ టైప్ తెలుసుకొని ఆయా అవసరాల నిమిత్తం వాడుకోవాలి. ఇక ఈ అకౌంట్ నెంబర్లోకి చివరి 6 అంకెలను బట్టి అది ఏ బ్యాంకు జారీ చేసిందో తెలుసుకోవచ్చు. ఈ నెంబర్లను బట్టి అది నకిలీ కార్డో లేదా ఫేక్ కార్డో కూడా తెలుసుకోవచ్చు.