Lost Luggage in Train: ప్రయాణ హడావుడిలో కొందరు తమ లగేజీని మర్చిపోతుంటారు. ఒక్కోసారి అందులో విలులైన వుస్తువులు ఉంటాయి. వాటిని పొందడం తెలియకపోతే అంతే సంగతులు. ఇక తిరిగి వాటిని మనం చూడలేము. కొందరు ఆటో, క్యాబ్ సర్వీసెస్, బస్సులో ప్రయాణించేటప్పుడు బ్యాగులను మర్చిపోతుంటారు. తమ డెస్టిటేషన్ వచ్చిందనే కంగారులో కావచ్చు. తోటి ప్రయాణికులు చేస్తున్న హడావుడి వలన కూడా అప్పుడప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి బస్టాండు లేదా రైల్వే స్టేషన్లలో కూడా బ్యాగ్ ఒక దగ్గర పెట్టి బస్సు లేదా రైలు వచ్చిందనే కంగారులో బ్యాగులు మర్చిపోయే ఎక్కేస్తుంటారు. మళ్లీ వచ్చి చూస్తే అక్కడ సామాను ఉండదు. అప్పుడు బాధపడటం ప్రయాణికుల వంతవుతుంది.

సాధారణంగా ఆటోలో బ్యాగేజీని మర్చిపోతే దానిని వెంబడించి పట్టుకోవడం లేదా ఆటో నెంబర్ గుర్తుంచుకుని పోలీసులకు ఫిర్యాదు చేస్తాం.. ఆర్టీసీ బస్సు విషయంలో అయితే టికెట్ ఆధారంగా దగ్గరలోని బస్సు డిపోకు వెళ్లి ఎంక్వైరీ చేయవచ్చు. ఆ బస్సు ఏ డిపోకు చెందినదో కనుక్కుని డ్రైవర్, కండక్టర్ స్టాఫ్ నంబర్ ఆధారంగా వారి నెంబర్స్ సంపాదించి కాల్ చేసి లగేజీని బస్సులో ఉందో లేదో తెలుసుకోవచ్చు. ఒకవేళ ఉంటే అందులోని విలువైన వస్తువులను తిరిగి పొందవచ్చును. ఇక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అయినా కూడా దగ్గరలోకి సేమ్ ట్రావెల్స్ బుకింగ్ కౌంటర్‌లో బస్సు,టికెట్ వివరాలు చూపించి బ్యాగు ఉందో లేదా ఆరా తీయవచ్చు. ఎవరైనా తీసుకు వెళితే మాత్రం ఎవరూ ఏమీ చేయలేరు.
Also Read: ఇల్లాలు ఈ పనులు చేస్తే ఇంటికి దరిద్రం.. ఇలాంటి మాటలు కూడా మాట్లాడొద్దట..
రైల్వే స్టేషన్లు లేదా రైలులో బ్యాగేజీని మర్చిపోతే వాటిని కనుక్కునేందుకు రైల్వేశాఖ కొన్ని సూచనలు చేసింది. బ్యాగు పోగొట్టుగున్న బాధితుడు వెంటేనే ఆ స్టేషన్‌లోని రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. మీ కోచ్ లేదా బెర్త్ నెంబర్ చెప్పాలి. రైళ్లు సాధారణంగా రాష్ట్రాలు దాటుతుంటాయి. దీంతో పోలీసులు రైలు ఎక్కడుందో స్టేటస్ చూసి తదుపరి రైల్వే స్టేషన్ లేదా జంక్షన్ ఆర్పీఎఫ్ పోలీసులకు సమాచారం ఇచ్చి వివరాలు చెప్తారు. రైలు స్టేషన్‌కు చేరుకోగానే పోలీసులు వెళ్లి బ్యాగు ఉంటే కలెక్ట్ చేసుకుని మళ్లీ ఇక్కడి పోలీసులకు సమాచారం ఇస్తారు.
దీంతో బ్యాగు పొగొట్టుకున్న వ్యక్తులు అక్కడుకు వెళ్లి వివరాలు చెప్పి, ఆధారాలు చూపి బ్యాగు తెచ్చుకోవచ్చు. రైల్వే స్టేషన్‌లో మర్చిపోతే స్టేషన్ మాస్టర్ కంటపడితే తీసుకుని 24 గంటల వరకు భద్రపరుస్తారు. ఆ తర్వాత మండల రైల్వేకార్యాలయానికి తరలించి 3నెలలు భద్రపరుస్తారు. అప్పటివరకు ఎవరూ బ్యాగు కలెక్ట్ చేసుకోకపోతే అందులోని విలువైన వస్తువులను నిబంధనల ప్రకారం అమ్ముతారు. వెస్టేజీని పడవేస్తారు.,
Also Read: తక్కువ ఖర్చుతో ఆరోగ్యం పొందాలా ? ఐతే ఈ పండు తినండి !