https://oktelugu.com/

Milk: పాలల్లో నీళ్లు కలిసాయో లేదో ఇలా తెలుసుకోండి..

పాలను ఆహారంలో భాగం చేసుకోవడం చాలా ప్రయోజనాలు ఉంటాయి అంటున్నారు నిపుణులు. కానీ ప్రస్తుతం ప్రతి ఒక్క ఆహారం కూడా కల్తీ అవుతుంది. పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పదార్థాలు కల్తీ అవుతున్నాయి.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : September 18, 2024 2:18 pm
    How to find out if water has been added to milk

    How to find out if water has been added to milk

    Follow us on

    Milk: ఉదయం లేవగానే కచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంట్లో పాలు ఉంటాయి. టీ తాగేవారి కోసం, పాలు తాగే వారి కోసం కచ్చితంగా పాలు కావాల్సిందే. ఉదయం లేవగానే కచ్చితంగా అవసరమయ్యే ఈ పాలు మొదటి వరుసలో ఉంటాయి. నిద్రలేవగానే పాల ప్యాకెట్‌తోనే రోజు ప్రతి ఇంట్లోనూ మొదలవుతుంది కదా. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతీ ఒక్కరికి పాల అవసరం ఎంతైనా ఉంటుంది. టీ, కాఫీ మొదలు పెరుగు వరకు అన్నింటిలో పాలు కావాల్సిందే. ఇక స్పెషల్స్ చేస్తే మరింత ఎక్కువ కావాలి. ఈ పాలలో పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి.

    పాలను ఆహారంలో భాగం చేసుకోవడం చాలా ప్రయోజనాలు ఉంటాయి అంటున్నారు నిపుణులు. కానీ ప్రస్తుతం ప్రతి ఒక్క ఆహారం కూడా కల్తీ అవుతుంది. పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పదార్థాలు కల్తీ అవుతున్నాయి. ఇలాంటి ఆహారాన్ని తీసుకుంటున్న ప్రజలు అనారోగ్య పాలు అవుతున్నారు. అయితే ప్రస్తుత ఈ కమర్షియల్‌ ప్రపంచంలో అన్ని కల్తీగా తయారవుతున్న సందర్బంలో పాలు కూడా దీనికి అతీతం కాదు అంటూ పాలను కూడా కల్తీ చేస్తున్నారు కొందరు వ్యాపారస్థులు. అంటే కల్తీలో పాలకు మిహాయింపు ఏం లేదన్నమాట.

    ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ కొందరు కేటుగాళ్లు పాలను కల్తీ చేస్తూనే వ్యాపారం చేసుకుంటున్నారు. కొందరు ఏకంగా కృత్రిమ పాలను తయారు చేస్తున్నారు. మరికొందరు పాలలో ఎక్కువ నీళ్లు కలిపి అమ్ముతున్నారు. కలుషితమైన నీరును పాలలో కలపడం వల్ల ఎన్నో రకాల వ్యాధులు కూడా వస్తున్నాయి. పాల క్వాంటిటీ ఎక్కువ కావడానికి ఈ నీటిని కలపడం వల్ల పాల క్వాంటిటీ తగ్గి నీటి క్వాంటిటీ పెరుగుతుంది. దీంతో పాల వల్ల కలిగే ప్రయోజనాలు చాలా మందికి అందడం లేదు. ఇలాంటి పాలను తాగినా సరే నో యూజ్ అంటున్నారు నిపుణులు.

    మరి మీరు వాడుతున్న పాలలో నీళ్లు కలిపారా.? లేదా అన్న అనుమానం మీకు చాలా సార్లే వచ్చి ఉంటుంది కదా.ఈ విషయం మీద ఓ క్లారిటీ ఉండాలంటే ఒక సింపుల్ టెస్ట్‌ను సూచిస్తోంది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ సెక్యూరిటీ పాల నాణ్యతను తెలుసుకునేందుకు ఉపయోగపడే ఒక పరీక్షను ప్రజలతో పంచుకుంది. ఇంతకీ ఏంటా పరీక్ష పాలలో నీళ్లు కలిపారో లేదో ఎలా తెలుసుకోవాలో అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.

    ఒక పొడవాటి గ్లాస్‌ పలకను తీసుకొని దాన్ని ఏటవాలుగా ఉంచి ఒకటి రెండు టీస్పూన్‌ల పాలను దానిపై దారగా పోయాలి. ఒకవేళ పాలు కిందికి నెమ్మదిగా వెళ్లూ పాల దారకు సంబంధించి మరక ఉంటే ఆ పాలు స్వచ్ఛమైనవిగా అంటున్నారు నిపుణులు. దీనికి భిన్నంగా నీరు నేరుగా వేగంగా కిందికి జారినా.. ఎలాంటి పాల మరక ఏర్పడకపోయినా అందులో నీళ్లు కలిపారు అని అర్థం చేసుకోవచ్చట. చాలా సింపుల్ టెస్ట్ కదా. మరెందుకు ఆలస్యం మీరు ఉపయోగిస్తున్న పాలలో నీళ్లు కలిపారో లేదో తెలుసుకోండి.