SIM cards: స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత సైబర్ మోసాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. కొందరు నేరగాళ్లు వ్యక్తుల డేటాను సేకరించి వారి పేరు మీద ఫేక్ సిమ్స్ తీసుకుంటున్నారు. ఈ ఫేక్ సిమ్స్ ద్వారా అనేక నేరాలకు పాల్పడుతున్నారు. అయితే ఇటీవల పోలీసులు హెచ్చరిస్తున్న ప్రకారం వ్యక్తులు తమ ఆధార్ కార్డు పై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఒక్కోసారి మనకు తెలియకుండానే ఇతరులు సిమ్ కార్డు తీసుకునే వీలుంది. ఇలా మనం గమనించని పక్షంలో అది అక్రమానికి వినియోగించే అవకాశం ఉంది. అయితే ఒకటికంటే ఎక్కువగా సిమ్స్ ఉన్నట్లు ఎలా గుర్తించాలి? ఇలా ఉంటే వాటిని ఎలా రియాక్టివేట్ చేయాలి?
ముందుగా మన ఆధార్ కార్డు పై ఎన్ని సిమ్స్ ఉన్నాయో తెలుసుకోవాలి. ఇందుకోసం గూగుల్ లోకి వెళ్లి Sanchar Sathi అనే వెబ్సైట్ ఓపెన్ చేయాలి. ఇది ఓపెన్ చేసిన తర్వాత పోర్టల్ లో మొబైల్ కనెక్షన్ల గురించి సంబంధిత వివరాలు అందించి తెలుసుకోవచ్చు. ఇక్కడ ఆధార్ తో ఎన్ని సిమ్స్ ఉన్నాయో చూపిస్తుంది. ఇక్కడ మీకు సంబంధం లేని నెంబర్ ఉంటే పక్కనే డి ఆక్టివేట్ అని ఆప్షన్ ఉంటుంది. అలా వెంటనే డిఆక్టివేట్ చేసి సిమ్మును తీసేసుకుని అవకాశం ఉంటుంది. ఇందులో భాగంగా మీరు ఎంట్రీ చేసిన మొబైల్ కు ఒక ఓటిపి వస్తుంది. ఆ ఓటిపి ఎంట్రీ చేస్తే అవసరంలేని సిమ్ డిలీట్ అయ్యే అవకాశం ఉంటుంది.
అలాగే అవసరం లేని సిమ్ ను డిఆక్టివేట్ చేయడానికి Tafcop అనే వెబ్సైట్ ద్వారా కూడా డి ఆక్టివేట్ చేసుకోవచ్చు. గూగుల్లో ఈ పేరు కొట్టగానే ముందుగా ఒక వెబ్సైట్ వస్తుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్లి మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయాలి. ఇప్పుడు ఒక ఓటిపి వస్తుంది. ఆ ఓటీపీని ఎంట్రీ చేసిన తర్వాత ఆధార్ కార్డుకు సంబంధించిన సిమ్స్ డిస్ప్లే అవుతాయి. ఇందులో అవసరం లేని సిమ్ ను ఎంచుకొని this is not my number అనే ఆప్షన్ను ఎంచుకోవాలి. ఆ తర్వాత సబ్మిట్ పై క్లిక్ చేయాలి. ప్రాసెస్ పూర్తిగా జరిగిన తర్వాత ఒక ఐడి వస్తుంది. ఆ ఐడిని సేవ్ చేసుకోవాలి. ఈ ప్రక్రియ ప్రారంభించిన తర్వాత దశల వారీగా సిమ్ కార్డు సేవలను నిలిపివేస్తారు.
ఇలా రెండు విధాలుగా సిమ్ కార్డును డైరెక్ట్ చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు తమ ఆధార్ కార్డు పై ఎన్ని సిమ్స్ ఉన్నాయో చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలామంది మనకు తెలియకుండానే ఎన్నో రకాల సిమ్స్ తీసుకొని అక్రమాలకు వాడుతూ ఉంటారు. అంతేకాకుండా కొందరు బ్యాంకు కార్యకలాపాలకు వాడి రుణాలు తీసుకుంటారు. అప్పుడు ఈ సిమ్ ఎవరి పేరు మీదనైతే ఉందో వారి నీ బాధ్యులు చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల సాధ్యమైనంత తొందరగా ఆధార్ కార్డుపై ఉన్న సిమ్స్ ను గుర్తుంచుకోవాలి.