Homeలైఫ్ స్టైల్How To Control Your Environment: మీ చుట్టూ ఉన్న వాతావరణం ఎలా ఉండాలో డిసైడ్...

How To Control Your Environment: మీ చుట్టూ ఉన్న వాతావరణం ఎలా ఉండాలో డిసైడ్ చేయండిలా..

How To Control Your Environment:  మంచి జీవితాన్ని కోరుకొని వారు ఉండరు. అయితే బెస్ట్ లైఫ్ అంటే ఎలా ఉంటుంది? అందుకోసం ఏం చేయాలి? అని చాలామంది అయోమయానికి గురవుతూ ఉంటారు. ఒక వ్యక్తి మంచివాడిగా మారడానికి తన చుట్టూ ఉన్న సమాజమే కారణమని కొందరు చెబుతూ ఉంటారు. ఆ వ్యక్తి మంచి వాతావరణం లో పెరిగితే సరైన వ్యక్తిగా మారుతాడు. చెడు వాతావరణం లో ఉంటే చెడ్డవారిగా మారిపోతారు అని చెబుతారు. ఈ నేపథ్యంలో చుట్టూ ఉన్న వాతావరణాన్ని సెట్ చేసుకునే బాధ్యత ఎవరికి వారే ఉంటుంది. ఊహ తెలిసిన వరకు ఎలాంటి వాతావరణం ఉన్నా.. లోకజ్ఞానం తెలిసిన తర్వాత బంధువులు, స్నేహితులు వంటి వారు మంచివారా? కాదా? తాము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? అనే విషయాలను తెలుసుకోవాలి. అది ఎలాగంటే?

ఒక వ్యక్తికి ఒక సమస్య వచ్చినప్పుడు కొందరు నేలనే చేస్తూ ఉంటారు. మరికొందరు మాత్రం బాధలో ఉన్న వ్యక్తికి సాయం చేయడానికి ముందుకు వస్తూ ఉంటారు. కష్టాలు రానివారు ఈ భూమి మీద ఉండరు. కష్టాలు వచ్చినప్పుడు వారిని హేళన చేయకుండా.. వారికి అండగా నిలుచున్నవారే నిజమైన ఆప్తమిత్రులుగా ఉంటారు. అలాంటి ఆప్త మిత్రుల మధ్య ఉన్నవారు అదృష్టవంతులు అని కొందరు చెబుతారు. ఇలా ఒకరికొకరు సాయం చేసేవారు.. ఒకరికోసం ఒకరు తపన పడేవారి మధ్య ఉండడం వల్ల జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది.

ఒక వ్యక్తి ఒక ఉద్యోగం చేస్తున్నప్పుడు తనకు తోటి వారు గానీ.. పై అధికారులు గానీ.. అండగా ఉండడంతో పాటు.. తను ప్రోత్సహించేవారు ఉండడం వల్ల ఆ వ్యక్తి తన ఉద్యోగాన్ని సమర్థవంతంగా నిర్వర్తించగలరు. అయితే అలాంటి పరిస్థితి అందరికీ ఉండకపోవచ్చు. కానీ ఆ పరిస్థితిని సృష్టించుకునే బాధ్యత ఎవరికి వారిదే అని మానసిక ని పనులు అంటున్నారు. ఒక వ్యక్తి ఉద్యోగం చేసే వాతారణం సరిగ్గా లేనప్పుడు.. తాను ఆ వాతావరణాన్ని సరిగ్గా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. లేకుంటే ఆ వ్యక్తి అక్కడ పనిచేయలేక పోతుంటారు.

Also Read:  Environment: ప్రమాద ఘంటికలు మోగిస్తున్న పర్యావరణం

మరో విషయంలో కొందరు కుటుంబ సభ్యుల మధ్య తీవ్రంగా నలిగిపోతూ ఉంటారు. దుఃఖాలు, కష్టాలు అనుభవిస్తూ ఉంటారు. ఇలాంటివారు తమకు అనుకూలంగా మార్చుకొని అవసరం ఉంటుంది. అంటే చెడ్డవారి మధ్య ఉండే బదులు మంచి వారితో కలిసి మెలిసి ఉండడం వల్ల తమ జీవితం బాగుంటుంది అనుకోవాలి.

ఇలా చుట్టూ అన్న వాతావరణం సరిగ్గా ఏర్పాటు చేసుకుని బాధ్యత ఎవరికి వారిదే ఉంటుంది. అలా సృష్టించుకోకపోతే తాను కష్టాలను ఎదుర్కొంటూ ఉంటాడు. అంతేకాకుండా చుట్టూ ఉన్న వాతావరణం సరిగ్గా లేకపోవడం వల్ల జీవితం వల్ల కలవలంగా మారుతుంది. అంతేకాకుండా భవిష్యత్తులోని తమ పిల్లలపై ఈ ప్రభావం పడే అవకాశం ఉంది. పిల్లలు సైతం ఎటువంటి వాతావరణం లో ఉంటున్నారు అని విషయాన్ని గ్రహించాలి. సరైన వాతావరణం లేకపోవడం వల్ల వారి జీవితం కూడా ఆందోళనగా మారే అవకాశం ఉంటుందని మానసిక నిపుణులు తెలుపుతున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Exit mobile version