Jagan Lotus Fund Hyderabad: లోటస్ ఫండ్( Lotus fund) .. 2012 నుంచి 2019 వరకు ప్రముఖంగా వినిపించిన పేరు. ప్రత్యర్థుల మాటలో చెప్పాలంటే రాజు కోట రహస్యం. ఎందుకంటే అంతలా ఆ భవనాన్ని కట్టించారు జగన్మోహన్ రెడ్డి. మొత్తం నాలుగు అంతస్తులు కుటుంబమంతా నివాసం ఉండేలా తీర్చిదిద్దారు. ప్రధాన నివాసం తనది కాగా.. అందులోనే సోదరి షర్మిల, బావ అనిల్ కుమార్, తల్లి విజయమ్మ నివాసం ఉండేలా ఒక ప్లాన్ తో రూపొందించారు. అయితే జగన్మోహన్ రెడ్డితో సోదరి షర్మిల విభేదించిన తర్వాత.. ఆమెకు లోటస్ ఫండ్ భవనాన్ని విడిచి పెట్టారని ప్రచారం జరిగింది. అందుకే జగన్మోహన్ రెడ్డి హైదరాబాదు వెళ్లడం లేదని కూడా టాక్ నడిచింది. అయితే నిన్న నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరైన జగన్మోహన్ రెడ్డి లోటస్ పండ్ కు వెళ్లి గడపడం విశేషం.
Also Read: వైసీపీ ‘రఫ్ఫా రఫ్ఫా’ను హర్షించని ప్రజలు!
అప్పట్లో ప్రధాన వేదికగా..
2012లో వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress )పార్టీ ఆవిర్భావం సమయంలో లోటస్ ఫండ్ అనేది ప్రధాన వేదికగా నిలిచింది. అప్పటినుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలతో.. ఆ పార్టీ కార్యకలాపాలతో బిజీగా ఉండేది. 2014 నుంచి 2019 మధ్య వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. హైదరాబాదు నుంచి రాకపోకలు సాగించేవారు జగన్మోహన్ రెడ్డి. అదే లోటస్ ఫండ్ పార్టీ కార్యాలయం గా కూడా కొనసాగేది. అయితే 2019 ఎన్నికలకు ముందు తాడేపల్లిలో భవనం అందుబాటులోకి రావడంతో అక్కడికి మారారు జగన్మోహన్ రెడ్డి. అలా ఆ ఎన్నికల్లో గెలిచేసరికి తాడేపల్లి నివాసం దాటి వచ్చేవారు కాదు అనే విమర్శను ఎదుర్కొన్నారు. అటు తరువాత షర్మిల తో విభేదాలు రావడంతో ఆమె లోటస్ ఫండ్ కుటుంబ వాటాగా దక్కిందని కూడా ప్రచారం జరిగింది.
ఎక్కువగా బెంగళూరులోనే..
2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత.. గత 17 నెలల కాలంలో ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) బెంగళూరు ప్యాలెస్ లోనే గడిపేవారు. యలహంక ప్యాలెస్ లో నివాసం ఉంటూ వస్తున్నారు. వారంలో నాలుగు రోజులపాటు అక్కడే ఉంటున్నారు. మూడు రోజులపాటు పార్టీ కార్యక్రమాల కోసం తాడేపల్లి వస్తున్నారు. కుటుంబ వ్యవహారాల్లో భాగంగా యలహంక ప్యాలెస్ సైతం షర్మిల కే ఉందని ప్రచారం నడిచింది. అటు లోటస్ ఫండ్ సైతం షర్మిల ఆధీనంలో ఉన్నట్లు కూడా టాక్ నడిచింది. వాటన్నింటికీ తెరదించుతూ జగన్మోహన్ రెడ్డి లోటస్ ఫండ్ లో ప్రవేశించారు. ఇకనుంచి నెలలో ఒకసారి లోటస్ ఫండ్ వచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: పిఠాపురం వైసీపీ నుంచి వంగా గీత ఔట్!
చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు..
చంద్రబాబు( CM Chandrababu) సైతం గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగించేవారు. చంద్రబాబు అరెస్ట్ సమయంలో ఏపీ కంటే హైదరాబాదులోనే ఎక్కువగా రియాక్షన్ వచ్చింది. దానికి కారణం అప్పట్లో వైసీపీ చేతిలో బాధితులుగా మిగిలిన టిడిపి నేతలు, కార్యకర్తలు ఎక్కువగా హైదరాబాదులోనే గడిపేవారు. నిన్న జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సైతం ఎక్కువమంది హాజరు కావడానికి అదే కారణం. ఇప్పటికే కేసులతో భయపడిన నేతలతో పాటు కార్యకర్తలు హైదరాబాదులో ఉంటున్నారు. వారందరి కోసం ఇకనుంచి నెలలో ఒకరోజు పాటు లోటస్ ఫండ్ కు రావాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.