How to Choose a Life Partner: అందమైన జీవితం కావాలని ఎవరైనా కోరుకుంటూ ఉంటారు.. అయితే ఒక వ్యక్తి తల్లిదండ్రులపై జీవించినంత కాలం కంటే వివాహం అయిన తర్వాతనే అసలైన జీవితం ప్రారంభమవుతుంది. అయితే వివాహం చేసుకోవాలని అనుకున్న అమ్మాయి లేదా అబ్బాయి తమకు సరైన భాగస్వామిని ఎంచుకోవడంలో ప్రస్తుత కాలంలో చాలామంది పొరపాట్లు చేస్తున్నారు. ఎన్నో ప్రణాళికలు వేసి.. ఎన్నో రకాలుగా ఆలోచించి చివరికి తప్పక అడుగులు వేస్తున్నారు. కొంతమంది మానసిక నిపుణులు ప్రకారం ఒక వ్యక్తిని తన జీవిత భాగస్వామిగా ఎంచుకునే సమయంలో మిగతా విషయాలకంటే ఈ యొక్క విషయంపై ప్రత్యేక దృష్టి పెడితే చాలు అని అంటున్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే?
Also Read: పెళ్లి చేసుకుంటున్నారా? పన్ను కట్టమంటారు..
కాలం మారుతున్న కొద్దీ మనుషుల్లో మార్పులు వస్తున్నాయి. గతంలో కంటే ఇప్పుడు చాలామంది డబ్బు సంపాదనలపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. దీంతో మానవ సంబంధాలు, బంధుత్వాలను పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇదే సమయంలో వివాహ విషయంపై కూడా ఆసక్తి చూపడం లేదు. అయితే కొంతమంది వివాహం చేసుకోవాలని అనుకున్నప్పుడు సరైన జీవిత భాగస్వామిని ఎంచుకోవాలని అనుకుంటారు. ఇదే సమయంలో వారు ఎదుటి వ్యక్తిలో భవిష్యత్తు బాగుండాలని అతని వద్ద ఎంత ఆస్తి ఉంది? ఎలాంటి ఉద్యోగం చేస్తున్నాడు? అతని ప్రతిభ ఎంత ఉంది అన్న విషయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. కానీ ఇక్కడే పొరపాటు చేస్తున్నారు. ఎందుకంటే ఎదుటి వ్యక్తి వద్ద డబ్బు, ప్రతిభా కంటే ఆపద సమయంలో ఆప్తుడై ఉండే వ్యక్తి ఉండాలని అంటున్నారు.
ప్రతి వ్యక్తిలో కష్టసుఖాలు కచ్చితంగా ఉంటాయి. సుఖాలు ఉన్నప్పుడు అందరూ హ్యాపీగా ఉంటారు. కానీ కష్టాలు వచ్చినప్పుడు మాత్రం కొందరే తట్టుకుంటారు. ఈ కష్టాల బాధ పడలేక ప్రాణాలు కూడా తీసుకునేవారు ఉన్నారు. ఇలా కష్టాలకు భయపడే వ్యక్తిని జీవిత భాగస్వామిగా ఎంచుకోవడం వల్ల తమ జీవితం ఎప్పటికీ భయంగానే ఉంటుందని అంటున్నారు. కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా ఉండి.. వాటి బయట పడడానికి ఎంతో నేర్పు, ఓర్పు కచ్చితంగా ఉండాలని అంటున్నారు. ముఖ్యంగా ఒక వ్యక్తికి సహనం లేకపోతే ఎన్నో రకాల కష్టాలను అతడు మాత్రమే కాకుండా తన పార్టనర్ కూడా పడాల్సి వస్తుంది. ఇలాంటి వ్యక్తి పక్కన ఉంటే ఆ ప్రాంతమంతా నెగిటివ్ ఎనర్జీ ఏర్పాటుతుంది..
Also Read: ఒక మనిషికి కెరీర్ సక్సెస్.. లవ్.. ఏది కావాలి? ఈ రెండు ఎప్పుడు వస్తాయి?
అందువల్ల జీవిత భాగస్వామిని ఎంచుకునే సమయంలో ఈ లక్షణం ఉంటే దూరంగా ఉండటమే మంచిదని అంటున్నారు. దాంపత్య జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు ఒకరికి ఒకరు ధైర్యం చెప్పుకుంటూ ముందుకు వెళ్లాలి. ఒకరి కష్టాన్ని చూసి మరొకరు హేళన చేస్తూ.. లేదా ఆ కష్టానికి కారణం నిందిస్తూ ఎదుటివారిపై విమర్శలు చేయడం వల్ల ఇద్దరి జీవితాలు నాశనం అవుతాయి. ఫలితంగా ఆ కుటుంబం చిన్నాభిన్నం అవుతుంది. అందువల్ల ఒక వ్యక్తిని ఎంచుకునేటప్పుడు ఆ వ్యక్తి కష్టాల సమయంలో ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు? అనే విషయాన్ని బాగా గమనించాలని మానసిక నిపుణులు తెలుపుతున్నారు. ఇలాంటి సమయంలో అతడు ధైర్యంగా ఉండడం లేదా.. వాటి నుంచి బయటపడే మార్గం ఎంచుకుంటే చాలు అని చెబుతున్నారు.