Break Bad Habits: మనిషి తన జీవితాన్ని సాఫీగా గడపాలనుకుంటాడు. కానీ కొన్ని చెడు అలవాట్లను వదులుకోలేకపోతాడు. దీంతో అప్రదిష్ట మూటగట్టుకుంటాడు. మంచిని పెంచుకునే క్రమంలో చెడుకే ప్రాధాన్యం ఇస్తున్నాడు. ఫలితంగా జీవితంలో వ్యయప్రయాసలకు గురవుతున్నాడు. ప్రతి ఒక్కరికి జీవితంలో ఎన్నో సాధించాలని ఊహిస్తుంటాడు. అందుకనుణంగా మాత్రం నడుచుకోడు. చెడు అలవాట్లను దూరం చేసుకునేందుకు మాత్రం ఎంత మాత్రం కృషి చేయడు దీంతోనే ఉన్నత శిఖరాలు చేరుకోవడం లేదని తెలుస్తోంది.

మనలో చాలా మంది గోళ్లు కొరుక్కుంటుంటారు. ఇది చాలా చెడ్డ అలవాటు. దీంతో దారిద్ర్యం పెరుగుతుంది. దాంతో పాటే ఆరోగ్యం దెబ్బతింటుంది. గోళ్లలో ఉండే మురికి వల్ల అనేక బ్యాక్టీరియాలు మన శరీరంలోకి ప్రవేశించి రోగాల బారిన పడే ప్రమాదముంది. కానీ చాలా మంది ఈ అలవాటును మానుకోలేకపోతుంటారు. గోళ్లు కొరకడంతో మన ఆరోగ్యం మీద పెను ప్రభావం చూపుతుంది. దీంతో దీనికి దూరంగా ఉండటం మంచిది.
అవసరం లేకపోయినా కొంతమంది మన శరీర భాగాలను అటూ ఇటు కదిలిస్తుంటారు. చేతులు అటు ఠిటు చాపడం చేస్తుంటారు. మన శరీరం మీద ఏదైనా ప్రమాదం జరుగుతుందని తెలిస్తే మెదడు ఇచ్చే సంకేతాలతోనే మన శరీర భాగాలు కదలాలి. అంతే కానీ ఊరికే ఏం చేయాలో తోచక వాటిని కదిలించడం కూడా మంచిది కాదు. అందుకే మన శరీర భాగాలను అనవసరంగా కదిలించడం కూడా అంత సమంజసం కాదని తెలుసుకోవాలి.

ఇక శబ్దాలు చేయడం కూడా బాగుండదు. ఏదైనా పని ఉంటే తప్ప శబ్ధం రాకూడదు. అందరు పనిలో ఉండగా శబ్దం చేస్తే వారి పని ముందుకు సాగదు. దీంతో వారి శ్రద్ధ తప్పుతుంది. అందుకే అనవసరంగా శబ్దాలు చేయడం మంచిది కాదు. అది కూడా మనకు అరిష్టమే అని పెద్దలు చెబుతుంటారు. అందుకే ఇంట్లో కానీ ఎక్కడైనా ఏ అవసరం లేనప్పుడు శబ్దాలు చేయడం మంచి అలవాటు కాదని తెలుస్తోంది.

కొందరికి నిద్ర సరిగా లేకపోతే సహజంగా వచ్చేది ఆవలింత. కానీ ఇది కూడా ఓ చెడ్డ అలవాటే మనం ఆవలింత తీస్తున్నామంటే ఎదుటివారిని అగౌరపరచడమే. ఆవలింత తీయడం కూడా దరిద్రమే. అందుకే ఆవలింత రాకూడదు. ఇంకా నలుగురిలో ఉన్నప్పుడు ఆవలింత తీస్తే కూడా అందరు వింతగా చూస్తారు. ఆవలింత తీయడం కూడా మనకు అనర్థమే. ఇవన్నీ మనకు దారిద్ర్యం వచ్చే వాటిగా గుర్తుంచుకుని వీటికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి.
Also Read: YSR Congress Alliance: పొత్తులపై మాట మార్చిన వైసీపీ
[…] […]