Babu Gogineni vs CPI Narayana: బిగ్ బాస్ లొల్లి: సీపీఐ నారాయణ Vs బాబు గోగినేని.. ఎవరిది తప్పు?

Babu Gogineni vs CPI Narayana: బిగ్ బాస్ లొల్లి ముదిరి పాకాన పడుతోంది. బిగ్ బాస్ పై హైకోర్టు విచారణ జరపడం.. ఇంతటి విశృంఖలత్వంపై హాట్ కామెంట్స్ చేయడంతో దాన్ని వ్యతిరేకించే శక్తులు ఒక్కసారిగా బరెస్ట్ అయ్యాయి. అందులో ముఖ్యులు మన కమ్యూనిస్టు నేత సీపీఐ నారాయణ.. బిగ్ బాస్ ను ఇప్పటికే బ్రోతల్ హౌస్ అని తిట్టిపోసి నాగార్జునపై వ్యక్తిగత విమర్శలు చేసిన ఈ సీనియర్ నేత తాజాగా హైకోర్టు వ్యాఖ్యలతో మళ్లీ కామెంట్స్ […]

Written By: NARESH, Updated On : May 10, 2022 11:50 am
Follow us on

Babu Gogineni vs CPI Narayana: బిగ్ బాస్ లొల్లి ముదిరి పాకాన పడుతోంది. బిగ్ బాస్ పై హైకోర్టు విచారణ జరపడం.. ఇంతటి విశృంఖలత్వంపై హాట్ కామెంట్స్ చేయడంతో దాన్ని వ్యతిరేకించే శక్తులు ఒక్కసారిగా బరెస్ట్ అయ్యాయి. అందులో ముఖ్యులు మన కమ్యూనిస్టు నేత సీపీఐ నారాయణ.. బిగ్ బాస్ ను ఇప్పటికే బ్రోతల్ హౌస్ అని తిట్టిపోసి నాగార్జునపై వ్యక్తిగత విమర్శలు చేసిన ఈ సీనియర్ నేత తాజాగా హైకోర్టు వ్యాఖ్యలతో మళ్లీ కామెంట్స్ వాడి పెంచారు. బిగ్ బాస్ షోను పూర్తిగా నిషేధించే బాధ్యతను హైకోర్టు తీసుకోవాలంటూ కోరారు. దీంతో బిగ్ బాస్ ప్రేమికులు హర్ట్ అయ్యారు. బయటకు వచ్చి సీపీఐ నారాయణపై విరుచుకుపడ్డారు.

Babu Gogineni, CPI Narayana

ప్రముఖ హేతువాదిగా పేరుగాంచిన బాబు గోగినేని ఇదివరకూ బిగ్ బాస్ లో పాల్గొని పాపులర్ అయ్యారు. తనదైన మొండి సిద్ధాంతాలను వెల్లడించే బాబు తాజాగా సీపీఐ నారాయణకు గట్టి కౌంటర్లు ఇచ్చారు. తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తన ఫేస్ బుక్ పేజ్ లో సీపీఐ నారాయణను ఏకిపారేస్తూ పోస్ట్ పెట్టారు. ఆర్ఆర్ఆర్ లో మనుషులను పొడవడం చూపించారు.. కళ్లలోనుండి రక్తం కారడం చూపించారు. హింస అంటే అది. బిగ్ బాస్ లో అటువంటి సన్నివేశాలు ఉన్నాయా? కనీసం బాహా బాహీ కొట్టుకోవడం అన్నా? రక్తం కారిందా? అని ప్రశ్నించారు. అది అంతా గాజు గోడల వెనుక, 90 కెమెరాల సాక్షిగా, వందల మంది ఉద్యోగులు చూస్తూ ఉండగా జరిగే ఆట అని తెలుసుకునే ఇంగితం కూడా లేదా? అంటూ నిలదీశారు. నైతిక విలువలు అడుగంటి పోతున్నాయి అంటూ ఊరికే కోర్టుకు పరుగెత్తుకుంటూ వెళ్ళే ముందు ఏ చట్టం ఉల్లఘించబడింది? ఇంతకీ కోర్టుల పని చట్టపరమైన రాజ్యాంగబద్ధమైన తీర్పులు ఇవ్వడమా? నైతిక అంశాలమీద జడ్జీల వ్యక్తిగత అభిప్రాయాలు ఆధారంగా తీర్పులు ఇవ్వడమా? అంటూ సంచలన వ్యాఖ్యలతో ప్రశ్నించేవారినే బాబు గోగినేని ప్రశ్నించారు.

Also Read: Mahesh Babu Sarkaru Vaari Paata: ‘సర్కారు’ పై మహేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

బాబు గోగినేని వాదనలో అర్థం పరమార్థం ఉంది. బిగ్ బాస్ పై ఎంత వ్యతిరేకత ఉందో.. అంతే స్థాయిలో అనుకూలత ఉంది. ఈరోజుల్లో శ్రీరామకీర్తనలు, భజనలు చేస్తూ ఎవ్వరూ టీవీ ముందు కూర్చోరు. వెంటనే చానెల్ మార్చేస్తారు. అదే వివాదాలు రాజేస్తే.. ఆ మంటల్లో చలికాచుకునే ప్రోగ్రాంలు అయితే ఇట్టే చూస్తారు. తెలుగులో నంబర్ 1 సీరియల్ గా కొనసాగిన ‘కార్తీకదీపం’లో అసలు మెయిన్ స్టోరీ ఏంటో తెలుసా? ‘పెళ్లయిన పురుషుడిపై ఓ పెళ్లి కాని అమ్మాయి పిచ్చిప్రేమ’..ఇది అనైతికం.. ఇక మరో సీరియల్ ‘గృహలక్ష్మీ’లో ఇంకో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తపై సీరియల్ హీరోయిన్ పోరాటం.. వీటి వల్ల సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు.. అయినా కూడా జనాలు తెగ చూసేస్తున్నారు ఎందుకు.? ఇలాంటి దిక్కుమాలిన సీరియల్స్ అన్నీ అక్రమ సంబంధాలు, అనైతిక చర్యల మీదనే సాగుతున్నాయనే ఆరోపణలున్నాయి. మరి వాటన్నింటిని జనాలు ఎందుకు ఆదరిస్తున్నారంటే.. జనాల మైండ్ సెట్ అలా మారిపోయింది. దాన్ని ఎవ్వరూ చేంజ్ చేయలేరు.దీన్ని సీపీఐ నారాయణ లాంటి సంప్రదాయ వాదులు తెలుసుకోవాలి. మారిపోవాలి.

Babu Gogineni

ఈ కాలంలో ఎంటర్ టైన్ మెంట్ కావాలి. పక్కింట్లో ఏదో గడబిడ సాగుతుంటే మనం వెంటనే చెవులు నిక్కరించి మరీ వింటాం.. వివాదాలతో వచ్చే మజాను ఆస్వాదిస్తాం.. మనిషి సైకాలజియే అంత.. అలాంటి రియల్ గొడవలనే బిగ్ బాస్ లో చూపిస్తుంటారు. ఇక ప్రేమలు, హగ్గులు, ముద్దులు ఉంటాయి. ఇప్పటివరకూ తెలుగు బిగ్ బాస్ లో ‘శృంగారం’ వరకూ ఎవరూ వెళ్లలేదు. కానీ ఆ ఒంటరితనంలో ప్రేమను వెతుక్కున్నారు. కాస్త క్లోజ్ గా మూవ్ అయ్యారు. సినిమాల్లో చూపించిన దానికంటే ఇది చాలా తక్కువ. మన రాంగోపాల్ వర్మ బూతు చిత్రాల కంటే మన బిగ్ బాస్ షో అంత తీసిపారేసేది కాదు..

అందుకే బాబు గోగినేని లాంటి వారు ఇప్పుడు బిగ్ బాస్ లో హింస జరుగుతోందా? శృంగారం జరిగిందా? అంటూ వీడియోలు చూపించాలని సవాల్ చేస్తున్నారు. కాస్త శృతిమించిన భావోద్వేగాలను చూపించారు తప్పితే అందులో ప్రేరేపించేస్థాయిలో ఏమీ లేవనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఓటీటీ బాట పట్టాక బిగ్ బాస్ లో కాస్త రోమాన్స్ పెరిగింది. శృంగారపు టాస్క్ లు పెరిగాయి. అది టీవీలో ప్రసారం కాకపోవడం.. స్మార్ట్ టీవీలు, ఫోన్లలోనే చూసే అవకాశం ఉండడంతో సెన్సార్ షిప్ లేక కొంచెం అతిగా చూపించిన మాట వాస్తవం. కానీ ఆ అతియే ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. వారిని 24 గంటలు చూసేలా చేస్తోంది. దానికే ప్రేక్షకులు అతుక్కుపోతున్నారు.

bigg boss

సీపీఐ నారాయణ వంటి సంప్రదాయవాదులు.. ఇక హైకోర్టు కూడా బిగ్ బాస్ పై ఎంత వ్యతిరేకత చూపినా కూడా జనాల ఇంట్రెస్ట్ అయితే మారడం లేదన్నది వాస్తవం. ప్రజల ఆలోచనాధోరణి మారింది. దానికి తగ్గట్టుగానే మన మైండ్ సెట్ కూడా మారాలి. పాతచింతకాయ పచ్చడి బుర్రకథలను.. ఏడుపుగొట్టు సీరియళ్లను ఎవరూ చూడరు. రియల్ ఎమోషన్స్ తో సాగే బిగ్ బాస్ షోను ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా చూసేది అందుకే. కొంతమంది అన్న కారణంగా ఒక షోపై అంచనావేయడం.. దాన్ని నిషేధించడం అన్నది సరికాదు.

Also Read:Mahesh Babu- Rajasekhar: రాజశేఖర్ మహేష్ సినిమాలో కన్ఫర్మ్.. దశ తిరుగుతుందా !

Tags