Colour Voter ID card: మన దేశంలో నివశించే వాళ్లకు అవసరమైన అతి ముఖ్యమైన కార్డులలో ఓటర్ కార్డు కూడా ఒకటి. 18 సంవత్సరాల వయస్సు దాటి మన దేశ పౌరులై ఉన్నవాళ్లు ఓటర్ కార్డ్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఓటర్ కార్డును జారీ చేస్తుంది. ఈ ఓటర్ కార్డును చాలామంది ఎలక్టోరల్ ఓటర్ కార్డ్ అని పిలుస్తారు. భారత ఓటరు కమిషన్ కొత్త ఓటర్లకు, ఓటర్ కార్డ్ లో తప్పులను సరిదిద్దుకున్న వాళ్లకు కలర్ ఓటర్ కార్డును మంజూరు చేస్తోంది.

బ్లాక్ అండ్ వైట్ ఓటర్ కార్డ్ ఉన్నవాళ్లు సైతం సులభంగా కలర్ ఓటర్ కార్డును పొందే అవకాశం అయితే ఉంటుంది. ఇందుకోసం ఫోటో, అడ్రస్ ప్రూఫ్, వయస్సు రుజువు డాక్యుమెంట్ ను కలిగి ఉండాలి. ఎవరైతే కలర్ ఓటర్ కార్డ్ ను పొందాలని భావిస్తారో వాళ్లు జాతీయ ఓటరు సేవా పోర్టల్ వెబ్ సైట్ ను మొదట ఓపెన్ చేయాలి. ఆ తర్వాత హోమ్ పేజ్ లో https://voterportal.eci.gov.in వెబ్ సైట్ లింక్ పై క్లిక్ చేయాలి.
ఓపెన్ అయిన కొత్త వెబ్ పేజీలో క్రియేట్ న్యూ అకౌంట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి స్క్రీన్ పై తదుపరి స్టెప్స్ ను అనుసరించాలి. లేదా గూగుల్ అకౌంట్, ఫేస్ బుక్ అకౌంట్, ట్విట్టర్, లింక్ డిన్ ఖాతాల ద్వారా కూడా లాగిన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఆ తరువాత ఫారం6ను పూరించాలి. ఫారం6లో ఫోటోతో పాటు ఇతర వివరాలను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా సులువుగా ఓటర్ కార్డ్ ను పొందవచ్చు.
కొత్త ఓటర్ కార్డ్ ను పొందాలని భావించే వాళ్లకు ఈ ప్రక్రియ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు. ఆన్ లైన్ ద్వారా ఓటర్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవాలని అనుకునే వాళ్లు ఈ విధంగా సులభంగా ఓటర్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవచ్చు.