Meat: ప్రతి మనిషి జీవితంలో తీసుకునే ఆహారం ముఖ్య పాత్ర పోషిస్తుందనే సంగతి తెలిసిందే. మాంసాహారంతో పోలిస్తే శాఖాహారం తీసుకోవడం వల్ల ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. ఆరోగ్యకరమైన రోగనిరోధకశక్తిని పొందాలని భావించే వాళ్లు ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. అమెరికన్ కాలేజ్ ఆఫ్ న్యూట్రిషన్ జర్నల్ ప్రకారం శాఖాహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు.

శాఖాహారం తీసుకోవడం ద్వారా సుదీర్ఘమైన జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. మాంసాహారం ఎక్కువగా తీసుకుంటే వృద్దాప్య ఛాయలు త్వరగా వచ్చే అవకాశం ఉంది. శాఖాహారులతో పోలిస్తే మాంసాహారులకు వ్యాధుల ప్రమాదం కూడా ఎక్కువ. శాఖాహారం బరువు సమస్యలను నియంత్రించడంలో ఉపయోగపడుతుంది. కొవ్వు నిల్వ చేయకుండా శాఖాహారం తోడ్పడుతుంది. శాఖాహారంలో ఫైబర్ ఎక్కువగా ఉంటుందనే విషయం తెలిసిందే.
శాఖాహారం ద్వారా బరువును సులభంగా నియంత్రించే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. శాఖాహారులు వయస్సుతో వచ్చే వ్యాధులకు దూరంగా ఉండటంతో పాటు గ్యాస్ సమస్యలు, బరువు పెరగడం లాంటి సమస్యలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. శాఖాహారం తినేవాళ్లలో గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుంది. శాఖాహారం వల్ల క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశాలు తగ్గుతాయి.
లివర్ చెడిపోకుండా కాపాడటంలో శాఖాహారం ఎంతగానో ఉపయోగపడుతుంది. మాంసాహారం తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగే అవకాశాలు ఉంటాయి. శాఖాహారం తినడం వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్లు లభించే అవకాశం ఉంటుంది.