ప్రముఖ సంస్థలలో ఒకటైన బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా అకాడమీ లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 103 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. becil.com వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన వివరాలను ఆన్ లైన్ లో తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాలి.

2021 సంవత్సరం అక్టోబర్ 7వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు చివరితేదీగా ఉంది. అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. మొత్తం 103 ఉద్యోగ ఖాళీలలో అప్రెంటీస్ లేదా లోడర్ ఉద్యోగ ఖాళీలు 57 ఉన్నాయి. మిగిలిన ఉద్యోగ ఖాళీలలో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగ ఖాళీలతో పాటు సూపర్ వైజర్, సీనియర్ సూపర్ వైజర్ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. అధికారిక నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
30 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు డేటా ఎంట్రీ ఆపరేటర్, సూపర్ వైజర్ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు సీనియర్ సూపర్ వైజర్ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుంచి గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్లు డేటా ఎంట్రీ ఆపరేటర్, సూపర్ వైజర్ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
అప్రెంటీస్, లోడర్ ఉద్యోగ ఖాళీలకు 8వ తరగతి పాస్ అయిన వాళ్లు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత ఉన్నవాళ్లకు అర్హతకు తగిన వేతనం లభించే అవకాశం అయితే ఉంటుందని సమాచారం.