IPL 2022 Sunrisers Hyderabad: హైదరాబాద్ సన్ రైజర్స్ కు చావో రేవో అన్నట్లుగా మారింది పరిస్థితి. వరుసగా ఐదు మ్యాచుల్లో నెగ్గి మళ్లీ వరుసగా ఐదు మ్యాచుల్లో ఓడి అప్రదిష్ట మూటగట్టుకుంది. ప్లే ఆప్ ఆశలను ప్రశ్నార్థకంలో పెట్టుకుంది. దీంతో నేడు ముంబై ఇండియన్స్ తో జరిగే మ్యాచులో విజయం సాధిస్తే తప్ప ప్లే ఆప్ ఆశలు సజీవంగా ఉండవనే సంగతి తెలియడంతో ఆటగాళ్లలో ఆందోళన నెలకొంది. మొదట ఉన్న ఉత్సాహం ఇప్పుడు జట్టులో కనిపించడం లేదు. ఫలితంగా జట్టు విజయావకాశాలపై అభిమానుల్లో కూడా టెన్షన్ పట్టుకుంది. తమ జట్టు విజయం సాధిస్తుందా లేక వెన్ను చూపిస్తుందా అనే ఆలోచనలో పడిపోయారు.

మొదట్లో ఆడిన ఐదు మ్యాచుల్లో అదరగొట్టే విజయాలు సొంతం చేసుకుంది. తరువాత ఏమైందో కానీ మళ్లీ అదే విధంగా ఐదు మ్యాచుల్లో పరాజయం చవిచూసింది. దీంతో పతకాల పట్టికలో వెనుకబడి పోయింది. దీంతోఇవ్వాళ ముంబై ఇండియన్స్ తో జరిగే మ్యాచులో తప్పక గెలవాల్సిన పరిస్థితి. ఇప్పటికే ప్లే ఆప్ ఆశలు వదిలేసుకున్న ముంబై ఇండియన్స్ ఓడితేనే మన ఆశలు సజీవం. లేకపోతే కష్టమే. మళ్లీ ఇక్కడ విజయం సాధించినా పంజాబ్ కింగ్స్ పై కూడా విజయం సాధించాల్సిన అవసరం ఏర్పడింది. ఒక వేళ ఇవ్వాళ గెలిచినా పంజాబ్ చేతిలో పరాజయం పాలైతే ప్లే ఆప్ ఆశలు గల్లంతే.
Also Read: Star Hero: డెడ్ చీప్ అయిపోయిన హీరో.. గుర్తుపట్టగలరా ?
మొదట జరిగిన ఐదు మ్యాచుల్లో గెలిచిన సన్ రైజర్స్ కు తరువాత ఏమైందో కానీ అన్ని అపజయాలే. దీంతో పతకాల పట్టికలో వెనుకబడిపోయింది. సునాయాసంగా నెగ్గే మ్యాచులను వదులుకుని ఇప్పుడు కచ్చితంగా నెగ్గాల్సిన పరిస్థితి తెచ్చుకుంది. కానీ ఈ పరిస్థితుల్లో విజయం అంత తేలిక కాదని తెలుస్తోంది. ఏ జట్టు అయినా తన పరువు కాపాడుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో వరుసగా రెండు మ్యాచుల్లో నెగ్గాల్సి రావడంతో జట్టు ఏం చేస్తుందోననే అనుమానాలు అందరిలో నెలకొన్నాయి. ధాటిగా ఆడి గెలుస్తుందో పేలవంగా ఆడి ఓడిపోతుందో ఏమో అనే ఆందోళన అభిమానుల్లో ఏర్పడింది.

దీంతో సన్ రైజర్స్ జట్టులో మార్పులు చేయనుంది. కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితుల్లో మెరుగ్గా ఆడే వారికి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మిడిల్ ఆర్డర్ లో వచ్చే వారి కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు సమాచారం. సన్ రైజర్స్ జట్టులో ఇంతవరకు ఏ మార్పు లేకుండా ఆడి అపజయాలే మూటగట్టుకుంది. అందుకే ఇవాళ ప్రయోగాలు చేసి మంచి విజయం దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. మొత్తానికి సన్ రైజర్స్ ఆశలు సీజవంగా ఉంచుతుందో లేక నిరాశ కలిగేలా చేస్తుందో తెలియడం లేదు.
Also Read:Nalgonda Husband And Wife: మాజీ ప్రియుడితో వెళ్లిపోయిన భార్య.. చివరకు భర్త ఏం చేశాడు?