https://oktelugu.com/

Horoscope Today: ఈరోజు ఈ రెండు రాశుల వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం.. అన్నీ శుభాలే..

ఆర్థికంగా పుంజుకుంటారు. ఈ రాశి వారిపై ఈరోజు లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది. ఉద్యోగులకు అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్తారు. ఆరోగ్యంపై శ్రద్ద వహించాలి. అనుకోని విజయాలు సాధిస్తారు. ఈరోజంతా ఉల్లాసంగా ఉంటారు.

Written By:
  • Srinivas
  • , Updated On : July 26, 2024 / 08:50 AM IST

    Horoscope Today

    Follow us on

    Horoscope Today: ఈరోజు ద్వాదశ రాశులపై ఉత్తరభాద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు మీన రాశిలో సంచారం చేయనున్నాడు. శుక్రవారం సింహం, తుల రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉండనుంది. మరి కొన్ని రాశుల వారు ఖర్చులు తగ్గించుకోవాలి. ఇంకొన్ని రాశుల వారు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. మొత్తం 12 రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం..

    మేష రాశి:
    ఈ రాశి వారికి ఈరోజు ఖర్చులు అధికంగా ఉంటాయి. దీంతో ఒత్తిడిని ఎదుర్కొంటారు. వ్యాపారులకు అనుకోని లాభాలు వస్తాయి. ఇతరుల మద్దతుతో కొత్త పెట్టుబడులు పెడుతారు. మాటలను అదుపులో ఉంచుకోవాలి. లేకుంటే సమస్యలు ఎదుర్కొంటారు. వివాహ ప్రయత్నాలు ప్రారంభమవుతాయి.

    వృషభ రాశి:
    విద్యార్థులు ఉన్నత విద్య కోసం తీవ్రంగా శ్రమిస్తారు. అదనపు ఖర్చులు ఉంటాయి. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అందువల్ల వారితో సంయమనం పాటించాలి.

    మిథున రాశి:
    పిల్లల భవిష్యత్ పై ఆందోళన చెందుతారు. తల్లిదండ్రులకు సేవ చేస్తారు. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు. సోదరుల మధ్య వివాహానికి సంబంధించి చర్చ ఉంటుంది. వ్యాపారులు పెట్టుబడులు పెట్టడానికి అనుకూల సమయం.

    కర్కాటక రాశి:
    వ్యాపారులకు పెట్టుబడులు లాభిస్తాయి. కుటుంబంలో పిల్లల విషయంలో చిన్న గొడవలు ఉంటాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారి ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ఆర్థికంగా పుంజుకుంటారు. సోమరితనంతో ఉండడం వల్ల చిక్కులు ఎదురవుతాయి.

    సింహారాశి:
    స్నేహితులకు సాయం చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటారు. ఖర్చుల విషయంలో ఆందోళన చెందుతారు. వ్యాపారులు కొత్త పెట్టబడులు పెడుతారు. ఉద్యోగులు తోటివారితో సంయమనం పాటించాలి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.

    కన్య రాశి:
    ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం పెంచుకునేందుకు వివిధ మార్గాలన వెతుక్కుంటారు. ఉద్యోగులు కార్యాలయాల్లో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. వాదనలు ఎక్కువగా చేయకుండా ఉండాలి.ఇతరులతో సత్సంబంధాలు నెలకొల్పాలి.

    తుల రాశి:
    ఆర్థికంగా పుంజుకుంటారు. ఈ రాశి వారిపై ఈరోజు లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది. ఉద్యోగులకు అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్తారు. ఆరోగ్యంపై శ్రద్ద వహించాలి. అనుకోని విజయాలు సాధిస్తారు. ఈరోజంతా ఉల్లాసంగా ఉంటారు.

    వృశ్చిక రాశి:
    ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. కొన్ని దీర్ఘ కాలిక వ్యాధులతో సతమతమవుతారు. కుటుంబ సభ్యుల మద్దతుతో వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉంటుంది. సాయంత్రం స్నేహితులతో సరదాగా ఉంటారు.

    ధనస్సు రాశి:
    వ్యాపారులు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. జీవిత భాగస్వామితో ప్రేమగా ఉంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ప్రియమైన వారికి బహుమతిని అందిస్తారు. ఉద్యోగులు ప్రమోషన్ పొందే అవకాశం.

    మకర రాశి:
    ఉద్యోగులు శుభవార్తలు వింటారు. వ్యాపారులు పెట్టుబడుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పెండింగులో ఉన్న పనులు పూర్తి చేస్తారు. బకాయి పడ్డ బాకీలు వసూలవుతాయి. ఆర్థికంగా బలోపేతం అవుతారు. విద్యార్థులు పోటీ పరీక్ష లకోసం తీవ్రంగా శ్రమిస్తారు.

    కుంభరాశి:
    కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. జీవిత భాగస్వామి నుంచి కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. విద్యార్థుల కెరీర్ కు సంబంధించిన తల్లిదండ్రులు శుభవార్తలు వింటారు. ఏదైనా పనిని ప్రారంభిస్తే సక్సెస్ అవుతుంది.

    మీనరాశి:
    ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. వ్యాపారులు కొత్త లాభాలు పొందే అవకాశం. కొత్త వ్యక్తులను కలుస్తారు. ఉద్యోగులు కార్యాలయంలో ఆకస్మిక ఆందోళనలు ఎదుర్కొంటారు. బంధువుల నుంచి కీలక సమాచారం పొందుతారు. జీవిత భాగస్వామితో ప్రేమగా ఉంటారు.