Junior NTR: తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇక ఎప్పుడైతే ఆయన ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడో అప్పటినుంచి ఇప్పటివరకు వరుస సినిమాలను చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ అయితే ఏర్పాటు చేసుకున్నాడు. నందమూరి ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి వచ్చిన మూడోవ తరం హీరోల్లో తను మాత్రమే సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగుతున్నాడు. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా కోసం విపరీతంగా కష్టపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని అందుకొని తనకంటూ ఒక ప్రత్యేకమైన సంపాదించుకోవాలనే టార్గెట్ పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే త్రిబుల్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ అయ్యాడు. అయినప్పటికీ అందులో ఇద్దరు హీరోలు ఉండడం మళ్ళీ అది రాజమౌళి సినిమా కావడం వల్ల ఆ సినిమా సక్సెస్ క్రెడిట్ అంత రాజమౌళికే వెళ్లిపోయింది. కాబట్టి ఇప్పుడు సోలోగా తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం అయితే వచ్చింది. అందుకోసమే ఆయన తీవ్రమైన కసరత్తులు చేసి మరి ఈ సినిమాను సక్సెస్ తీరానికి చేర్చాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక దానికి తగ్గట్టుగానే కొరటాల శివ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఈ సినిమాను ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ అనేది చాలా హెవీగా ఉందట. అందుకోసమే ఎక్కడ కూడా చిన్న పొరపాటు జరగకుండా గ్రాఫిక్స్ వర్క్ మొత్తాన్ని దగ్గరుండి మరి కొరటాల చూసుకుంటూనే ఈ సినిమా మీద అంచనాలను పెంచడానికి మరొక టీజర్ ని కూడా తొందరలో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ సినిమా యూనిట్ నుంచి ఒక సమాచారం అయితే అందుతుంది.
ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ప్రేక్షకుల్లో జోష్ పెంచడానికి అలాగే పాన్ ఇండియా సబ్జెక్టు కావడం వల్ల ఎక్కువ కలెక్షన్లు రాబట్టాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమాలో హృతిక్ రోషన్ ఒక క్యామియో రోల్ పోషిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక రీసెంట్ గా ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి సినిమాలో చాలామంది క్యామియో రోల్స్ పోషించారు. దాని వల్ల కూడా ఈ సినిమా కలెక్షన్లు కొంతవరకు పెరిగాయనే చెప్పాలి. ఎందుకంటే ఆయా వ్యక్తులకు సంబంధించిన ఫ్యాన్స్ కూడా ఖుషి అయి ఈ సినిమాను ఒకటికి రెండుసార్లు చూశారు.
దానివల్ల సినిమా కలెక్షన్స్ కొంతవరకైతే పెరిగాయనే చెప్పాలి. ఇక ఇప్పుడు బాలీవుడ్ లో హృతిక్ రోషన్ కి చాలా మంచి క్రేజ్ ఉంది. ఖాన్ త్రయం తర్వాత అంతటి గొప్ప క్రేజ్ ను సంపాదించుకున్న హీరో హృతిక్ రోషన్ కావడం విశేషం… ధూమ్ సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. అలాంటి హృతిక్ రోషన్ ఇప్పుడు దేవర కోసం రంగంలోకి దిగుతున్నట్టుగా తెలుస్తుంది.
మరి ఆయన రాకతో ఈ సినిమా ఎలాంటి కలెక్షన్లను వసూలు చేస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక వార్ 2 సినిమాలో వీళ్ళిద్దరూ కలిసి నటిస్తున్నారు. కాబట్టి ఇద్దరి మధ్య మంచి సన్నిహిత్యమైతే ఏర్పడిందట. అందుకోసమే ఆయన చేత క్యామియో రోల్ చేయిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది…ఇక మొత్తానికైతే ఎన్టీయార్ ఈ సినిమాతో భారీ సక్సెస్ కొడితే ఇక ఈ సినిమా 1000 కోట్ల వరకు కలెక్షన్స్ ను అయితే రాబడుతోంది. చూడాలి మరి ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది…