Symptoms By Birth Month: మనం ఎవరి గురించి అయినా చెప్పాలంటే వారి రాశిని బట్టి ఇలా ఉంటాడు లేదంటే అలా ఉంటాడు అని చెప్పేస్తుంటాం. అయితే ఇప్పుడు నెలలను బట్టి కూడా మనిషి ఎలాంటి వారో చెప్పేయొచ్చట. మరి ఏ నెలలో పుట్టిన వారు ఎలా ఉంటారో తెలుసుకుందాం.

జనవరిలో ఉండే వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. అందంగా ఉంటారు. అనుకున్నది సాధించే వరకు విడిచిపెట్టారు. ఇక ఫిబ్రవరిలో పుట్టే వారికి కొంచెం కోపం ఎక్కువ. అయితే అది ఎక్కువ సేపు ఉండదు. త్వరగా కోపం చూపించినా.. త్వరగానే నవ్వేస్తుంటారు. ఇక మార్చిలో పుట్టిన వారు కొంచెం కలా హృదయులు. భావోద్వేగాలను ఎక్కువగా చూపిస్తుంటారు.
ఏప్రిల్ లో పుట్టే వారికి సున్నిత మనస్కులు కలిగి ఉంటారు. అందరితో కలిసి పనిచేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. మే నెలలో పుట్టిన వారు ప్రేమ విషయంలో కొంత వీక్ గా ఉంటారు. ఎవరినైనా త్వరగా నమ్మేస్తుంటారు. జూన్ లోపుట్టిన వారు చుట్టు నలుగురు ఉండాలని కోరుకుంటారు. ఎక్కువ మందితో స్నేహం చేయాలని అనుకుంటారు.
Also Read: పుట్టిన నెలను బట్టి ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటారో తెలుసుకోవచ్చు..!
జూలైలో పుట్టే వారికి అహంకారం ఎక్కువ. ఈ అహంకారమే వారికి అందరినీ దూరం చేస్తుంది. కోపం కూడా చాలా ఎక్కువ. ఆగస్టులో పుట్టే వారికి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. అనుమానం కూడా ఎక్కువే. జీవితంలో ఎదగాలని కలలు కంటారు. చివరకు సాధించకపోయే సరికి బాధపడుతారు. సెప్టెంబర్ లో ఉండే వారు చాలా తెలివైన వారు. మన అనుకునే వారిని జాగ్రత్తగా చూసుకుంటారు.
అక్బోబర్ లో పుట్టే వారు ఎవరినైనా బాధపెట్టినా త్వరగా కలుపుకుని పోతారు. చాలా సెక్సీగా ఉంటారు. చలాకీగా ఉంటారు. చాలా తెలివైన వారు కూడా. అయితే నవంబర్ లో పుట్టిన వారు నమ్మకం పొందుతారు. ఏదైనా చేయాలనుకుంటే దాన్ని సాధించే దాకా వొదిలిపెట్టరు. అదే సమయంలో చాలా ప్రమాదకరం కూడా. ఇక డిసెంబర్ లో పుట్టే వారు పైన చెప్పిన వారందరికంటే చాలా మంచివారు. అన్ని విషయాల్లో ఉన్నతంగా ఉంటారు. చాలా అందంగా ఉంటారు. అర్థం చేసుకోవడంలో వీరికి వీరే సాటి. ఇలా ఒక్కో నెలలో పుట్టే వారు ఒక్కో లక్షణం కలిగి ఉంటారు.
Also Read: వాషింగ్ మెషిన్‌లో బట్టలు ఉతికేటప్పుడు ఈ టిప్స్ పాటించండి
[…] Also Read: పుట్టిన నెలను బట్టి ఎలాంటి లక్షణ… […]