Traffic Rights: మనం బైక్ లేదా కార్ వేసుకుని రోడ్డు పైకి వెళ్తుంటే ఎదురుగా పోలీస్ ఉన్నాడంటే వెంటనే వేరే రూట్ నుంచి వెళ్లాలని ప్రయత్నిస్తాం. ఎందుకంటే మన దగ్గర సరైన పత్రాలు ఉండవు. ఒకవేళ అన్నీ ఉన్నా ట్రాఫిక్ పోలీసు ఏదైనా కావాలని ఫైన్ వస్తాడేమో లేదంటే మన వాహనాన్ని లాగేసుకుంటాడేమో అని భయపడిపోతాం. అయితే పోలీసులకు మనం దొరికినప్పుడు చేయాల్సిన చేయకూడని పనులు కొన్ని ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మనం ట్రాఫిక్ పోలీసులకు అనుకోకుండా దొరికితే మన లైసెన్సు దూరంగా తీసుకెళ్తున్నప్పుడు దానికి బదులుగా ఏదైనా పత్రాలు ఇవ్వాలని కోరాలి. అలాగే మీరు కారులో ప్రయాణిస్తున్నప్పుడు మీ వెంట స్త్రీ ఉండి, సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత మీ వెహికల్ ను మగ పోలీసులు చెక్ చేయరాదు. కచ్చితంగా మహిళా పోలీసు మాత్రమే మీ వెహికల్ చెక్ చేయాలి.
ఒకవేళ రెడ్ సిగ్నల్ దాటినా, డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికినా, ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్నా, ఓవర్ లోడుతో వెళ్తున్నా మీ డ్రైవింగ్ లైసెన్స్ ను రద్దు చేసే అధికారం పోలీసులకు ఉంటుంది. కాబట్టి ఇలా దొరికినప్పుడు వారి దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దురుసుగా మాట్లాడకుండా కొంచెం రిక్వెస్ట్ చేసినట్టు చెప్పుకోదగ్గ కారణాలను వారి దగ్గర ఉంచాలి.
Also Read: పుట్టిన నెలను బట్టి ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటారో తెలుసుకోవచ్చు..!
పోలీసులు మీకు ఫైన్ వేసే సమయంలో.. వారిదగ్గర చలానా మిషన్, ఈ చలానా బుక్ ఉంటేనే డబ్బులు కట్టండి. లేదంటే అస్సలు కట్టవద్దు. అలాగే సెక్షన్ 130 ప్రకారం మీరు నిజంగా ట్రాఫిక్ రూల్స్ అధిగమించినప్పుడు.. మీ దగ్గర ఉన్న లైసెన్స్, ఆర్సీ లాంటి వాటిని పోలీసులకు కేవలం చూపించాలి. అంతేగాని వాటిని ఎట్టి పరిస్థితుల్లో పోలీసులకు ఇవ్వకూడదు. మీ దగ్గరనుంచి బలవంతంగా లాక్కొనే అధికారం వారికి లేదు.
ఎవరైనా సివిల్ డ్రెస్ లో నేను పోలీస్ ను అంటూ వచ్చి బెదిరించి, సంబంధిత పత్రాలు అడిగినప్పుడు.. కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి. ముందుగా అతను ఎవరో ఏ బ్యాచ్ కు చెందిన పోలీస్ అనే వివరాలను నెమ్మదిగా తెలుసుకోండి. అతను నిజంగా పోలీస్ అని నిర్ధారణ అయిన తర్వాతనే మీ పత్రాలను అతనికి చూపించండి. అలాగే ఎవరైనా పోలీసులు మీ వెహికల్ కీ లను బలవంతంగా లాక్కుంటే కచ్చితంగా నిలదీయండి. ఎందుకంటే చట్టం ప్రకారం వారికి అలా దౌర్జన్యం చేసే అధికారం లేదు.
Also Read: హోలీ నాడు కామదహనం ఎందుకు? హోలీ విశిష్టత ఏంటో తెలుసా?