Homeలైఫ్ స్టైల్Home Budget Planning: నిర్మల బడ్జెట్ అయిపోయింది.. మీ ఇంటి బడ్జెట్ సంగతి ఏంటి?

Home Budget Planning: నిర్మల బడ్జెట్ అయిపోయింది.. మీ ఇంటి బడ్జెట్ సంగతి ఏంటి?

Home Budget Planning: ప్రతి ఏడాది ఫిబ్రవరి ఒకటో తారీఖున కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ ప్రవేశపెడతారు. ఆ సంవత్సరానికి సంబంధించి దేశ ఆర్థిక పరిస్థితిని వెల్లడిస్తూ లెక్కా పద్దులు వివరిస్తారు. రూపాయి రాక, రూపాయి పోక, వేటికోసం ఎంత ఖర్చు పెడుతున్నది, వేటి ద్వారా ఆదాయం పొందుతున్నది? ఇలా అన్ని అంశాలను వెల్లడిస్తారు. మనదేశంలో బడ్జెట్ కార్పొరేట్ నుంచి రోజువారి కూలి వరకు ప్రతి ఒక్కరి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. అందుకే దేశ బడ్జెట్ తెలుసుకోవాలి.. దాని ఆధారంగా మన ఇంటి బడ్జెట్ రూపొందించుకోవాలి..ఇక కేంద్రం మన నుంచి కాకుండా, అనేక మార్గాల నుంచి కూడా ఆదాయాలను పొందుతుంది. ఫలితంగా ఏడాదికి సంబంధించి అంచనాలు మొత్తం రూపొందిస్తుంది. స్థూలంగా బడ్జెట్ అంటే లెక్కలు మాత్రమే కాదు.. ఆదాయ, వ్యయాలు.. ఒక లక్ష్యానికి సంబంధించిన కేటాయింపులు. ఆదాయాన్ని పెంచుకుంటూ.. అభివృద్ధి సాధించే ప్రయత్నాలు.. ఒక దేశం గురించి ఇలా చెప్తున్నప్పుడు.. ఆ దేశానికి కీలకమైన కుటుంబం గురించి కూడా ఖచ్చితంగా చెప్పాలి. మనకు దేశంలో ఎలా అయితే వార్షిక బడ్జెట్ కు సంబంధించి చిట్టా పద్దులు ఉంటాయో.. కుటుంబానికి సంబంధించి కూడా ఉండాలి.. అలా ఉంటేనే ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది.

మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువ

సాధారణంగా మన దేశంలో మధ్య తరగతి కుటుంబాలు ఎక్కువ. ఈ మధ్య తరగతి కుటుంబాలకు చాలా వరకు నెలవారీగా వచ్చే వేతనమే ప్రధాన ఆదాయం. కొంతమందికి షేర్లు లేదా బోనస్ ల రూపంలో జీతాలు వస్తాయి. ఇలా వచ్చే ఆదాయానికి సంబంధించి కొన్నిసార్లు అంతరాయం కలగవచ్చు. లేదా వస్తున్న ఆదాయం తగ్గిపోవచ్చు. అలాంటి ఆకస్మిక సందర్భాల్లో అప్పటికప్పుడు అంచనాలు రూపొందించుకుంటే ఉపయోగం ఉండదు. దానికోసం ముందే ప్రణాళిక రూపొందించుకోవాలి. కోవిడ్ సమయంలో చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. ముందు చూపు లేకపోవడంతో ఖర్చులకు డబ్బులు వెతుక్కోవాలిసిన పరిస్థితి.. మరో ఉద్యోగం దొరికేంతవరకు వారు పడిన ఇబ్బంది అంత ఇంతా కాదు. ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో కచ్చితంగా ఆర్థిక ప్రణాళిక అంటూ ఉండాలి. వచ్చే ఆదాయం, అయ్యే ఖర్చు మధ్య కచ్చితంగా అంతరం ఉండాలి.. లేకుంటే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

లెక్కలు కచ్చితంగా ఉండాలి

చాలామంది నెలవారీగా వస్తున్న ఆదాయాన్ని మొత్తం ఉపయోగించుకోలేరు ముఖ్యంగా ప్రత్యక్ష పనులు, మూలధన లాభాలపై పన్ను, ఇంటి నుంచి వచ్చే ఆదాయం, ఇతర ఆదాలపై పన్నులు ఉంటాయి. వీటికి వివిధ పన్ను రేట్లు కూడా ఉంటాయి. ఉపయోగించే వస్తువులు, వాటి సేవలపై కూడా జీఎస్టీ లాంటివి చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఏడాదికి ఎంత పన్ను లు మనం చెల్లిస్తున్నాం?, ఎలాంటి సేవలు పొందుతున్నాం? అనే అంశాలపై కచ్చితంగా అవగాహన కలిగి ఉండాలి. ఇక చాలామంది వాయిదాల పద్ధతిలో ఇళ్ళు, వాహనాలు, ఇతర వస్తువులు కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే వీటికి సంబంధించి ప్రతినెల డబ్బు చెల్లింపు తో పాటు వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో మనం తీసుకున్న అప్పుకు ఎంత చెల్లిస్తున్నాం? వడ్డీ ఎంత పడుతుంది? అది మన ఆర్థిక పరిస్థితికి సరిపోతుందా? అనే అంచనాలు తప్పకుండా ఉండాలి. లేకుంటే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలి

ఇక చాలామంది భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇంట్లో ఎంతో కొంత నగదు దాచుకుంటారు. లేదా ఖాతాలో పెట్టుకుంటారు దీనినే ఆర్థిక పరిభాషలో మూలధనం అంటారు. అయితే కొన్నిసార్లు వచ్చే అవసరాల ఆధారంగా మూలధనాన్ని చెల్లిస్తూ ఉంటారు. ఇలా చెల్లించే విధానం ఒక స్థాయి వరకయితే బాగానే ఉంటుంది. కానీ అదేపనిగా చెల్లించుకుంటూ పోతే మూలధనం కాస్త కరిగిపోతుంది. మనకు తెలియకుండా అయ్యే ఖర్చుతో మూలధనంలో రూపాయి కూడా మిగలదు. ఇలాంటప్పుడు కచ్చితంగా మూలధన రక్షణ కోసం పొదుపు చర్యలు పాటించాలి. అప్పుడే ఆర్థికపరమైన ఒడిదుడుకులు ఏర్పడినప్పటికీ పెద్దగా ఇబ్బంది ఉండదు.. మనదేశంలో ప్రవేశపెట్టే బడ్జెట్ కు సంబంధించి ఏటా లక్షల కోట్లలో రాబడి వస్తున్నప్పటికీ ప్రభుత్వం మొత్తంగా కేటాయింపులు జరపకుండా అన్ని రంగాలను ఎందుకు దృష్టిలో పెట్టుకుంటుందంటే అది ఇందుకే. ఇక మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం భారీగా ఎందుకు ఖర్చు చేస్తుందంటే.. ఈ రంగంలో ప్రభుత్వం పెట్టిన రూపాయికి రెట్టింపు లాభం వచ్చే అవకాశం ఉంటుంది గనుక. మౌలిక వసతులు మెరుగుపడితే స్థిరాస్తి వ్యాపారం ఉపందుకుంటుంది గనుక.. చివరిగా మనకు వచ్చే ఆదాయానికి.. పెట్టే ఖర్చుకు మధ్య హస్తిమ శకాంతరం తేడా ఉండాలి. అప్పుడే కుటుంబాలు ఆర్థికపరంగా బలంగా ఉంటాయి. లేకుంటే తదుపరి పర్యావసనాలను అనుభవించాల్సి ఉంటుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular