Bad Cholesterol: ఆధునిక కాలంలో మన జీవన శైలి మారుతోంది. ఫలితంగా రోగాలు చుట్టుముడుతున్నాయి. వ్యాధులతో సతమతమవుతున్నారు. నోటికి ఏది రుచిగా ఉంటే దాన్ని తింటూ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. తినే ఆహారం విషయంలో కనీస నిబంధనలు పాటించకపోవడంతో శరీరంలో కొవ్వు శాతం పెరుగుతోంది. ఇందులో మంచి, చెడు కొవ్వులు ఉంటాయి. ఇందులో చెడు కొవ్వు మనకు చేటు చేస్తుంది. మంచి కొవ్వు మనకు రక్షణగా ఉన్నా చెడు కొవ్వుతో గుండెజబ్బులు పొంచి ఉండే ప్రమాదం ఏర్పడుతోంది.

చెడు కొలెస్ట్రాల్ తో గుండెజబ్బుల ముప్పు పొంచి ఉంది. అందుకే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. చెడు కొవ్వుతో అనర్థాలు ఎక్కువగా ఉంటాయి. రక్తప్రసరణపై ప్రభావం చూపుతుంది. గుండెకు అందించే మంచి రక్తం సరఫరా నిలిచిపోతోంది. ఫలితంగా గుండెజబ్బు వచ్చే అవకాశం ఎక్కువ. దీంతో వైద్యులు కూడా చెబుతున్నారు చెడు కొలెస్ట్రాల్ తో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. మన ఆహార అలవాట్లను కూడా క్రమబద్ధీకరించుకుంటే మంచిది.
Also Read: Anchor Lasya: ఇంకోసారి గర్భం తెచ్చుకో అంటే చెంప చెళ్లుమనిపిస్తా.. యాంకర్ లాస్య ఫైర్!
ఈ నేపథ్యంలో గుండె జబ్బును రాకుండా నిరోధించే క్రమంలో మనం గ్రీన్ టీని తీసుకుంటే మంచిది. దీంతో మనలో చెడు కొలెస్ట్రాల్ ప ెరగకుండా చేస్తుంది. ప్రతి రోజు గ్రీన్ టీ తాగితే చెడు కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుతుంది. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. వైద్యుల సూచన మేరకే గ్రీన్ టీ తీసుకోవడం ఉత్తమం. గ్రీన్ టీలో కొవ్వును తగ్గించే లక్షణాలు ఉన్నట్లు చెబుతున్నారు. అందుకే గ్రీన్ టీ తీసుకోవాలని అందరికి సూచిస్తున్నారు.

టమాటా రసం కూడా గుండె జబ్బులు రాకుండా చేస్తుంది. రోజుకో గ్లాస్ టమాటా జ్యూస్ తాగితే గుండె జబ్బులకు దూరంగా ఉండవచ్చు. కానీ ఇతర వ్యాధులతో బాధపడే వారు మాత్రం వైద్యుల సలహాతోనే టమాటా రసం తాగాలి. లేదంటే ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఏర్పడుతుంది. గుండె జబ్బును తగ్గించేందుకు మరో ఆహారం ఓట్స్ మిల్క్. ఇది కూడా తీసుకుంటే గుండె జబ్బుల నివారణ సాధ్యమవుతుందని తెలుస్తోంది. బీటా గ్లూకాన్ అనే పదార్థం ఇందులో ఉండటంతో గుండె జబ్బును నియంత్రణలో ఉంచుతుందని వైద్యులు చెబుతున్నారు. మన శరీరం బాగా ఉండేందుకు ఉపయోగపడే ఆహారాలపై జాగ్రత్తగా ఉంటూ వాటిని తీసుకుంటూ రోగాలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది.
Also Read:Ram Charan-Kamal Haasan: రామ్ చరణ్ – కమల్ హాసన్ కాంబినేషన్ లో మూవీ.. డైరెక్టర్ ఎవరో తెలుసా?