Karizma XMR 210: మార్కెట్లో మళ్లీ ‘కరిజ్మా’ బైక్.. పాతది, కొత్తదానికి తేడా ఏంటి?

హీరో నుంచి ‘కరిజ్మా’ను 2003లో రిలీజ్ చేసింది. 223 సీసీని కలిగి ఉంది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్సమిషన్ తో లీటర్ కు 40 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చింది. కార్బో వెయిట్ 150 కేజీలు ఉంది.

Written By: Srinivas, Updated On : August 30, 2023 2:55 pm

Karizma XMR 210

Follow us on

Karizma XMR 210: వాహనదారులకు హీరో కంపెనీ శుభవార్త అందించింది. గతంలో విపరీతంగా ఆకట్టుకున్న కరిజ్మా బైక్ కు మరోసారి అప్డేట్ ఫీచర్లతో మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈసారి ‘కరిజ్మా ఎక్ష్ఎంఆర్ 210’ పేరుతో ఆగస్టు 29న మార్కెట్లోకి విడుదల చేసింది. 210 సీసీ లిక్విక్ కూల్ పెట్రోల్ తో పాటు సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్, వెనుక టైరు పెద్దగా ఉండేలా తయారు చేసిన ఈ బైక్ ను రూ.1,72,900ల ధరను నిర్ణయించింది. మార్కెట్లో తన వాటాను పెంచుకునేందుకు ప్రతీ ఏడాది కొత్త మోడళ్లను అందుబాటులోకి తీసుకొస్తామని, ఇందులో భాగంగానే తాజాగా కరిజ్మాను అప్డేట్ చేసి రిలీజ్ చేశామని హీరో మోటార్ కార్ప్ సీఈవో నిరంజన్ గుప్తా తెలిపారు. ఈనేపథ్యంలో పాత కరిజ్మాకు, కొత్త కరిజ్మాకు తేడా ఏంటో చూద్దాం..

హీరో నుంచి ‘కరిజ్మా’ను 2003లో రిలీజ్ చేసింది. 223 సీసీని కలిగి ఉంది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్సమిషన్ తో లీటర్ కు 40 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చింది. కార్బో వెయిట్ 150 కేజీలు ఉంది. ఫ్యూయెట్ ట్యాంక్ 15 లీటర్ల సామర్థ్యం ఉన్న ఇందులో 795 సీట్ హైట్ ను కలిగి ఉండేది. దీనిని అప్పట్లో రూ.79,656 తో విక్రయించారు. అయితే 2004లో దీని అమ్మకాలను నిలిపివేశారు.

లేటేస్టు ‘కరిజ్మా210’ 150 సీసీ లోపు ఇంజన్ సామర్థ్యం కలిగి ఉంది. గరిష్టంగా గంటకు 140 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఎల్ ఈడీ లైట్లు, ఇండికేటర్లు, స్లీక్ ఫ్యూయెల్ ట్యాంక్ తో పాటు ఫుల్లీ డిజిటల్ ఇన్ స్ట్రిమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్లు ఈ బైక్ ను ఆకర్షిస్తున్నాయి. ఇది ఐకానిక్ యెల్లో, టర్బో రెడ్, పాంథమ్ బ్లాక్ కలర్లో అందుబాటులో ఉంది. హీరో కంపెనీ ఇక నుంచి ప్రీమీయం బైక్ లపై దృష్టి పెట్టాలని చూస్తోంది. ఇందులో భాగంగానే కాస్ట్లీ బైక్ ను వినియోగదారుల ముందు ఉంచింది.