How to stop the spam calls: మొబైల్ వల్ల ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయో అన్ని రకాల నష్టాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు మొబైల్ కు ఎన్నో రకాల కాల్స్ వస్తుంటాయి. వీటిలో కొన్ని ఉపయోగకరమైనవి ఉండగా.. మరికొన్ని వేధించే కాల్చి ఉంటాయి. కొన్ని కంపెనీలు తమ ప్రమోషన్ కోసం కాల్ చేస్తుంటే.. మరికొన్ని కంపెనీలు క్రెడిట్ కార్డ్ వంటి వాటికోసం ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇదే సమయంలో కొందరు సైబర్ నేరగాళ్లు కాల్ చేసి బ్యాంకు అకౌంట్ నుంచి డబ్బులు తీసుకునే మోసాలు కూడా చేస్తున్నారు. ఈ సందర్భంలో ఏది నిజమైన కాల్.. ఏది అబద్ధమైన కాల్.. అని తెలుసుకోలేకపోతున్నారు. అయితే ఎక్కువగా ఇబ్బంది పెట్టే ప్రమోషన్స్ కాల్స్ కు చెక్ పెట్టడానికి అందుబాటులో కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి. అంతేకాకుండా కొన్ని రకాల మెసేజ్ చేస్తే ఈ కాల్స్ రాకుండా ఆగిపోతాయి. మరి ఆ వివరాలు లోకి వెళ్తే..
సైబర్ మోసాలు ఒక్కొక్కటి వెలుగులోకి రావడంతో మొబైల్ కు వచ్చే ఏ ఫోన్ లిఫ్ట్ చేయాలన్న భయమే వేస్తుంది. కానీ ఇదే సమయంలో కొన్ని ముఖ్యమైన కాల్స్ కూడా వస్తుంటాయి. అవి రిసీవ్ చేసుకో లేకపోతే నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటి సందర్భంలో స్పామ్ కాల్స్ ను అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. అయితే మొబైల్ ద్వారా ఈ కాల్స్ కు అడ్డుకట్ట వేయడానికి ఒక మెసేజ్ చేయాల్సి ఉంటుంది. START 0 అని టైప్ చేసి 1909 అనే నెంబర్ కు ఎస్ఎంఎస్ పంపించాలి. దీంతో ప్రమోషన్స్ కాల్స్ ఆగిపోతాయి. ఇది సాధ్యం కాకపోతే www.dndcheck.co.in అనే వెబ్సైట్లోకి వెళ్లి నేషనల్ డు నాట్ కాల్ రిజిస్ట్రీ లో ప్రమోషన్స్ కాల్స్ రాకుండా చేయవచ్చు. అయితే ఇదే కాకుండా మై జియో యాప్, ఎయిర్టెల్ థాంక్యూ వంటి యాప్స్ కూడా DND ఆప్షన్ను కలిగి ఉన్నాయి. వీటిలోకి వెళ్లి స్పామ్ కాల్స్ కు అడ్డుకట్ట వేయవచ్చు.
అయితే ఏదైనా ఒకే నెంబర్ నుంచి పదేపదే కాల్ వస్తుంటే ఆ నెంబర్ ను బ్లాక్ చేయడం లేదా ఆ నెంబర్ పై మార్క్ కాల్స్ యూస్ పామ్ అనే ఆప్షన్ను ఎంచుకుంటే మరోసారి ఆ నెంబర్ల నుంచి కాల్స్ రాకుండా ఉంటాయి. అలాగే ఒక బ్యాంకు నుంచి పదేపదే కాల్స్ వస్తుంటే ఆ బ్యాంకుకు వెళ్లి సంప్రదించి కేవైసీ ని అప్డేట్ చేసుకోవడం లేదా ఇంకా ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించుకోవాలి. అయితే కొత్తగా కనిపించే నెంబర్లు.. విదేశాల నుంచి వచ్చే నెంబర్లను ఎట్టి పరిస్థితుల్లో లిఫ్ట్ చేయకుండా ఉండాలి. అలా చేయడంవల్ల ఫోన్ కు సంబంధించిన సమాచారం లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత బ్యాంకు సమాచారం తెలుసుకొని డబ్బులు మాయం చేసే ప్రమాదం ఉందని నిపుణులు తెలుపుతున్నారు. అందువల్ల ఇలా స్టాంప్ కాల్స్ ను రాకుండా అడ్డుకోవచ్చు.