Cholesterol Control Tips: కొవ్వును ఇట్టే కరిగించి మిమ్మల్ని స్లిమ్ గా తయారు చేసే ఈ వంటింటి చిట్కా ఇదీ

ప్రతి ఇంట్లో రోజూ వండే కూరల్లో రుచి కోసం రకరకాల పదార్థాలు వేస్తుంటారు. కాస్త ఘాటు రావడానికి మసాలాలు చల్లుతూ ఉంటారు. ఇదే సమయంలో మెంతులు కూడా వాడుతారు.

Written By: Chai Muchhata, Updated On : October 4, 2023 3:40 pm

Cholesterol Control Tips

Follow us on

Cholesterol Control Tips: నేటి కాలంలో చాలా మంది బరువు సమస్యతో బాధపడుతున్నారు. వాతావరణ మార్పులతో పాటు వివిధ రకాల ఆయిల్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉన్న వారిలో సైతం అధిక కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీంతో అనేక అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఎలాంటి అనారోగ్య సమస్యకైనా బరువే ప్రధానమని వైద్యులు చెబుతున్నారు. దీంతో చాలా మంది బరువు తగ్గడానికి వర్కౌట్లు చేస్తున్నారు. మరికొందరు వాకింగ్ చేస్తూ కష్టపడుతున్నారు. కానీ ఇంట్లోనే లభించే ఈ పదార్థంతో సులభంగా బరువును తగ్గించుకోవచ్చు. ప్రతిరోజూ ఇలా చేస్తే బరువులో మార్పు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కొందరు వైద్యులు చెబుతున్నారు. ఇంతకీ ఆ పదార్థమేదో తెలుసా?

ప్రతి ఇంట్లో రోజూ వండే కూరల్లో రుచి కోసం రకరకాల పదార్థాలు వేస్తుంటారు. కాస్త ఘాటు రావడానికి మసాలాలు చల్లుతూ ఉంటారు. ఇదే సమయంలో మెంతులు కూడా వాడుతారు. అయితే మెంతులు నేరుగా వేయడం ద్వారా చేదును కలిగిస్తాయి. దీంతో వీటిని పొడి చేసి మసాలాలు వేసే క్రమంలో చల్లుతారు. దీంతో కర్రీ చాలా రుచిగా ఉంటుంది. మాంసాహార కూరల్లో మెంతులు చల్లుకోవడం ద్వారా రుచి రావడమే కాకుండా జీర్ణక్రియ సక్రమంగా ఉంటుంది.

మెంతులను నేరుగా తీసుకోవడం వల్ల బరువు సమస్య నుంచి బయటపడొచ్చని కొందరు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మెంతులు నేరుగా నోట్లో వేసుకున్నా.. ఈ ప్రయోజం ఉంటుంది. అయితే నేరుగా తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటే.. రాత్రంతా వీటిని నీటిలో నానబెట్టి ఉంచి.. ఉదయం లేవగానే మెంతులు నానబెట్టిన నీటిని తాగాలి. అలాగే ఆ మెంతులను కూడా తినాలి. ఇలా కొన్ని రోజుల పాటు తీసుకుంటే బరువు సమస్య తగ్గిపోతూ ఉంటుంది.

బరువు తగ్గడానికి కొన్ని మెడిసిసిన్స్ తీసుకుంటూ ఉంటారు. అయితే వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్ష్ ఉండే అవకాశం ఉంది. కానీ ఇలా మెంతులు తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్యానికి గురికాకుండా ఉంటారని చెబుతున్నారు. అయితే విపరీతమైన బరువును కలిగి ఉండి, ఇతర అనారోగ్య సమస్యలు ఉంటే మాత్రం వైద్యుల సలహాతో మెంతులను తీసుకోవాలి. లేకుండా తీవ్రంగా నష్టపోతారు.