Betel Leaf: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ ఆకులు మీ డైట్‌లో ఉండాల్సిందే!

పూజకు ఎక్కువగా ఉపయోగించే తమలపాకులతో గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. డైలీ తమలపాకును డైట్‌లో చేర్చుకోవడం వల్ల గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చు. మరి ఎలా తమలపాకుతో ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Written By: Kusuma Aggunna, Updated On : October 15, 2024 8:29 pm

Betel Leaf

Follow us on

Betel Leaf: ఆరోగ్యంగా ఉండాలని ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా ఆహార విషయంలో అయితే చాలా జాగ్రత్తగా ఉంటారు. ఈ పదార్థం తింటే ఆరోగ్యంగా ఉంటారంటే.. తప్పకుండా వాటిని తింటారు. పోషకాలు ఉండే ఆహారాన్ని తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు. అయితే ఈ రోజుల్లో చాలామంది గుండె సమస్యలతో బాధపడుతున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరూ గుండె ప్రమాదాల బారిన పడుతున్నారు. చిన్న పిల్లలు కూడా హఠాత్తుగా గుండె పోటుతో మరణిస్తున్నారు. దీనికి చెక్ పెట్టాలంటే డైట్‌లో తప్పకుండా పోషకాలు ఉండే వాటిని యాడ్ చేసుకోవాలి. లేకపోతే అనారోగ్య సమస్యలను కోరి తెచ్చుకోవాల్సి ఉంటుంది. పూజకు ఎక్కువగా ఉపయోగించే తమలపాకులతో గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. డైలీ తమలపాకును డైట్‌లో చేర్చుకోవడం వల్ల గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చు. మరి ఎలా తమలపాకుతో ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

తమలపాకులో ఎక్కువగా ఔషధ గుణాలు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంతో పాటు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. రోజూ కనీసం ఒక తమలపాకును అయిన నమిలితే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులోని పోషకాలు వివిధ రకాల ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడుతుంది. డైలీ ఏదో విధంగా తమలపాకును తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. ముఖ్యంగా ఉదయం పూట తింటే అలసట, బలహీనత తొలగిపోతుంది. అలాగే జలుబు, దగ్గు, జ్వరం వంటివాటితో దీర్ఘకాలికంగా ఇబ్బంది పడుతుంటే తప్పకుండా విముక్తి కలుగుతుంది. వీటితో పాటు శ్వాసకోశ వ్యాధుల నుంచి కూడా బయటపడవచ్చు. కేవలం తమలపాకును తినడం మాత్రమే కాకుండా రసాన్ని తాగి కూడా ఆరోగ్యంగా ఉండవచ్చు. తమలపాకు రసం తాగడం వల్ల గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయి. అలాగే పేగు ఆరోగ్యంగా ఉండటంతో పాటు మలబద్దకం, కడుపు నొప్పి, అజీర్ణం వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.

కొందరికి ఎక్కువగా జ్వరం వస్తుంటుంది. ఎన్నిసార్లు డాక్టర్‌కి చూపించుకున్న, మందులు వాడిన తగ్గకుండా నెలల తరబడి ఉంటుంది. ఇలాంటి వారికి తమలపాకు చక్కగా ఉపయోగపడుతుంది. ఈ ఆకు జ్వరం నుంచి తొందరగా ఉపశమనాన్ని ఇస్తుంది. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న వారు 3 మీ.లీల తమలపాకులను నీటిలో వేసి మరిగించి త్రాగాలి. ఇలా చేయడం వల్ల తొందరగా జ్వరం నుంచి విముక్తి చెందుతారు. అలాగే కొందరికి మూర్ఛ వస్తుంది. ఇలాంటి సమస్య ఉన్నవారు తమలపాకులను తినడం చాలా మంచిది. తినలేని వారు ఏదో విధంగా జ్యూస్ లేదా మీరు ఇంకా ఏ విధంగా తినగలుగుతారో అలా డైట్‌లో యాడ్ చేసుకుంటే సర్వరోగాల నుంచి విముక్తి చెందుతారని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి తప్పకుండా రోజూ తమలపాకును తినడం అలవాటు చేసుకోవడం ఉత్తమం.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించేముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.