Maternity Health Insurance: కాలం మారుతున్న కొద్దీ ఖర్చులు పెరుగుతున్నాయి. కానీ ఆదాయం పెరగడం లేదు. దీంతో చాలామంది చిన్నచిన్న అవసరాలకు అప్పులు చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా మెడికల్ అవసరాలకు ఒక్కోసారి ఆస్తుల అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ముందు జాగ్రత్తగా కొందరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని భారీగా అయ్యే ఖర్చుల నుంచి తప్పించుకుంటున్నారు. అయితే ఈ ఇన్సూరెన్ ఇప్పటివరకు ప్రెగ్నెన్సీకి వర్తించేవి కావు. కానీ ఇప్పుడు కొత్తగా మెటర్నిటీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే వైద్య ఖర్చుల నుంచి కాపాడుకోవచ్చు. మరి ఈ ఇన్సూరెన్స్ ఎలా ఉంటుందంటే..?
పెళ్లయిన తర్వాత ఖర్చులు తడిసి మోపెడవుతాయి. ముఖ్యంగా వైద్య ఖర్చులు భారంగా అనిపిస్తాయి. అయితే పెళ్లయిన తర్వాత ఎక్కువగా ఖర్చు అయ్యేది వైద్యం కోసమే. ప్రెగ్నెన్సీ అయిన తర్వాత నుంచి డెలివరీ వరకు ఎన్నో రకాల ఖర్చులు ఉంటాయి. ఇవి లక్షల వరకు కావచ్చు. కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్తే ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అయితే ఇప్పటివరకు సాధారణ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ప్రెగ్నెన్సీ వర్తించేది కాదు. కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కు అదనంగా మెటర్నిటీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ప్రెగ్నెన్సీకి వర్తిస్తుంది.
ఈ హెల్త్ మెటర్నిటీ ఇన్సూరెన్స్ ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయినప్పటి నుంచి డెలివరీ అయ్యే వరకు వర్తిస్తుంది. ఇందులో చెక్ అప్ నుంచి అత్యవసరానికి అయ్యే ప్రతి ఖర్చు ఇన్సూరెన్స్ లోనే వర్తిస్తుంది. ఈ ఇన్సూరెన్స్ ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది. దీనిని ఈఎంఐ రూపంలో చెల్లించుకోవచ్చు. ఇప్పటికే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే దానికి మాత్రమే వర్తించే అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా మేటర్నిటీ తీసుకోవడం సాధ్యం కాదు. సంతానం కావాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అందువల్ల ఈ ఇన్సూరెన్స్ ప్రతి జంటకు తప్పనిసరిగా అవసరం ఉంటుంది. అంతేకాకుండా నేటి కాలంలో ఎలాంటి అనారోగ్యానికి గురవుతామో ఎవరూ చెప్పలేం. దీంతో ముందుగానే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఎన్నో రకాలుగా డబ్బులు సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
అయితే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. గుర్తింపు పొందిన సంస్థల నుంచి మాత్రమే ఇన్సూరెన్స్ తీసుకోవాలి. కొన్ని రకాల కంపెనీలు అత్యవసర సమయంలో వైద్య సేవలు వర్తించవు అని చెబుతూ ఉంటాయి. అందువల్ల ఇలాంటి పర్టికులర్ విషయాలను ముందే తెలుసుకొని ఆ తర్వాత పాలసీని కొనుగోలు చేయాలి. సాధ్యమైనంతవరకు పాలసీ నిబంధనలను పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే ముందుకు వెళ్లాలి. అంతేకాకుండా ఆన్లైన్లో పాలసీలు కొనుగోలు చేసేటప్పుడు కంపెనీ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఒకవేళ అనుమానాలు ఉంటే పాలసీ నిపుణులను సంప్రదించి సలహాలు తీసుకోవాలి. లేకుంటే భారీగా డబ్బు నష్టపోయే అవకాశం ఉంటుంది.