Health Benefits: రాగి సంగటి, నాటు కోడి కలిపి తింటే.. కలిగే ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు

రాగి సంగటి, నాటుకోడి ఆరోగ్యానికి మంచిదని కొందరు తింటున్నారు. మరి ఈ రెండింటిని కలిపి తినడం వల్ల ఆరోగ్యానికి కలిగే ఆ ప్రయోజనాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Written By: Kusuma Aggunna, Updated On : October 30, 2024 5:12 pm

Ragi sangati

Follow us on

Health Benefits: రాగి సంగటి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీనిని తినడం వల్ల ఆరోగ్యానికి బోలెడన్నీ ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులోని పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో బాగా ఉపయోగపడతాయి. అయితే చాలా మంది రాగి సంగటి, నాటు కోడి కలిపి తింటారు. ఇది ఎక్కువగా గ్రామాల్లో వండుతారు. పూర్వకాలంలో ఈ వంటకాన్ని ఎక్కువగా వండేవారు. ఈ రోజుల్లో అయితే ఎవరో ఒకరు దీన్ని వండుతున్నారు. అయితే రాగి సంగటి, నాటు కోడి కలిపి తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. అందుకే పూర్వకాలం మనుషులు బలంగా ఉండేవారు. రెండింట్లో కూడా ఫైబర్, ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ప్రస్తుతం కొన్ని హోటల్స్‌లో రాగి సంగటి, నాటుకోడి దొరుకుతుంది. ఇది ఆరోగ్యానికి మంచిదని కొందరు ఇంట్లోనే తయారు చేసి కూడా తింటున్నారు. మరి ఈ రెండింటిని కలిపి తినడం వల్ల ఆరోగ్యానికి కలిగే ఆ ప్రయోజనాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఎముకల ఆరోగ్యం
రాగి పిండిలో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే నాటు కోడిలో కూడా కాల్షియం, ఐరన్ వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి కండరాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బాగా ఉపయోగపడతాయి.

మధుమేహం నియంత్రణ
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో రాగి బాగా ఉపయోగపడుతుంది. ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. మధుమేహం ఉన్నవారికి రాగి సంగటి, నాటు కోడి మంచిదని చెప్పవచ్చు.

రోగనిరోధక శక్తి పెరుగుదల
రాగిలోని పోషకాలు, నాటు కోడిలోని పోషకాల వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నాటు కోడిలో యాంటీ బయోటిక్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో బాగా ఉపయోగపడతాయి. రాగి పిండిలో కూడా విటమిన్లు, ఖనిజాలు అనారోగ్య సమస్యల బారిన పడకుండా కాపాడతాయి.

జీర్ణక్రియ ఆరోగ్యం
కొందరు జీర్ణక్రియ సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారికి రాగి సంగటి బాగా ఉపయోగపడుతుంది. రాగిలో ఉండే ఫైబర్ అజీర్ణం, మలబద్ధకం సమస్యలను తగ్గిస్తుంది. అలాగే జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది.

చర్మం, జుట్టు ఆరోగ్యంగా..
రాగి పిండిలో విటమిన్లు, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో బాగా సాయపడుతుంది. దీనివల్ల చర్మం కాంతివంతంగా కావడంతో పాటు జట్టు కూడా బలంగా తయారవుతుంది.

ఒత్తిడి నుంచి విముక్తి
రాగిలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఒత్తిడిని తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ రెండింటిని కలిపి తినడం వల్ల ఒత్తిడి నుంచి విముక్తి కలుగుతుంది. అలాగే ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా రాగి సంగటి, నాటు కోడి బాగా ఉపయోగపడుతుంది.

 

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.