Health Benefits OF Rice: మనం తీసుకునే ఆహారంలో అన్నమే ప్రధానం. అసలు అన్నమంటేనే ఆహారమనే స్థాయికి వెళ్లడం జరిగింది. ఇండియా, చైనా దేశాల్లో ప్రధానమైన ఆహారమంటే అన్నమే. ఎక్కువ మంది తీసుకునే అన్నంతోనే జీవనం కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయుర్వేదంలో కూడా అన్నానికి ప్రత్యేక స్థానమే ఉంది. కానీ పూర్వ కాలంలో బియ్యాన్ని దంచి వండుకోవడంతో ప్రొటీన్లు లభించేవి. ప్రస్తుత కాలంలో బియ్యం పాలిష్ పట్టడంతో ప్రొటీన్లు దూరమై దుష్ఫలితాలు వస్తున్నట్లు చెబుతున్నారు.

అన్నంలో కార్పొహైడ్రేడ్లు ఎక్కువగా ఉండటంతోనే ఇది ఆరోగ్యానికి హానికరమే అని నిపుణులు సూచిస్తున్నారు. కానీ పూర్వం రోజుల పరిస్థితుల నేపథ్యంలో ఆయుర్వేదం అన్నమే శ్రేష్టమని చెబుతున్నా అది దంపుడు బియ్యం అయితేనే సురక్షితమని తెలుస్తోంది. ప్రస్తుతం దంపుడు బియ్యం ఎవరు కూడా వినియోగించడం లేదు. అందరు పాలిష్ పట్టిన బియ్యం వాడకంతోనే మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. మధుమేహ రోగుల్లో ఎక్కువ శాతం మంది కూడా ఇండియా చైనాల్లోనే ఉండటం గమనార్హం.
Also Read: Pawan Janasena:బీజేపీలాగే జనసేన మారుతుంది..: పవన్
అన్నం వండుకునే పద్ధతుల్లో కూడా ప్రయోజనాలు ఉంటాయని తెలుస్తోంది. అన్నం వండుకునే తీరును కూడా మన పూర్వీకులు మనకు చూపించారు. వారు చూపించిన మార్గాల్లో అన్నం వండుకుంటే ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. కొందరు బియ్యం, నీటిని ఒకేసారి పోసి వండుతారు. దీంతో అంతగా లాభం ఉండదని తెలుస్తోంది. ఇక రెండో విధానంలో ముందుగా నీళ్లు వేసి అవి మరిగిన తరువాత బియ్యం వేసి మిగిలిన నీరును గంజిగా వారుస్తారు. దీంతో కొన్ని ప్రయోజనాలు దక్కుతాయని చెబుతున్నారు.

పాలిష్ పట్టిన బియ్యం కంటే ముడిబియ్యం ఎంతో విశిష్టమైనవని. దీంతో పాలిష్ పట్టిన బియ్యం వాడకుండా ముడిబియ్యం వాడుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచిస్తున్నారు. ముడిబియ్యంలో ప్రొటీన్లు ఉండే అవకాశాలున్నందున వాటిని వాడుకుంటేనే మన దేహానికి మంచిది. దంపుడు బియ్యం మధుమేహం రాకుండా నిరోధిస్తాయి. అధిక రక్తపోటు రాకుండా చేస్తాయి. అందుకే మనం దంపుడు బియ్యం వండుకుని మన ఆహారంలో చేర్చుకుంటేనే ప్రయోజనాలు మెండుగా ఉంటాయని తెలుస్తోంది.
Also Read:Telangana Bjp:బీజేపీ ఆపరేషన్ తెలంగాణ విజయవంతం అవుతుందా?