Health Benefits: ఈ సమస్యలు ఉన్నవారు గంజి తాగితే.. బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు ఎక్కువగా వైట్ డిశ్చార్జ్‌తో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారికి ఇది ఒక దివ్వ ఔషధంలా పనిచేస్తుంది. గంజి వల్ల చాలానే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో మరి చూద్దాం.

Written By: Kusuma Aggunna, Updated On : October 28, 2024 9:04 pm

Ganji Water

Follow us on

Health Benefits: గంజి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో విటమిన్లు, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ గంజిని తాగడం లేదా గంజి అన్నం తినడం వల్ల తొందరగా బరువు తగ్గడంతో పాటు ఆరోగ్యంగా ఉంటారు. గంజిని డైలీ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి బోలెడన్నీ ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, థయామిన్, ఫోలేట్, పొటాషియం, కార్బోహైడ్రేట్, జింక్, మినరల్స్, విటమిన్లు, ఐరన్ మెండుగా ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఉపయోగపడతాయి. పూర్వ కాలంలో గంజి ఎక్కువగా తాగడం, దీంతో రాగి జావ వంటివి చేయడం వల్ల బలంగా ఉండేవారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఎక్కువ ఏళ్ల పాటు ఆరోగ్యంగా జీవించేవారు. కానీ ఈ రోజుల్లో అంతా ఫ్యాషన్ అయిపోయి.. పిజ్జాలు, బర్గ్‌లు అంటూ శరీరానికి అనారోగ్యాన్నిచ్చే ఫుడ్‌ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. గంజిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు శరీర ఆరోగ్యాన్నే కాకుండా చర్మం, జట్టు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా మహిళలకు గంజి ఇంకా ఆరోగ్యంగా పనిచేస్తుంది. నెలసరిలో నీరసం, అలసటగా ఉన్నప్పుడు తక్షణమే శక్తిని ఇస్తుంది. అలాగే మహిళలు ఎక్కువగా వైట్ డిశ్చార్జ్‌తో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారికి ఇది ఒక దివ్వ ఔషధంలా పనిచేస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే గంజి వల్ల చాలానే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

గుండె ఆరోగ్యంగా..
గంజిలో ఉండే పోషకాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కేవలం గంజిని తీసుకోకుండా ఓట్‌మీల్‌లో కూడా గంజిని యాడ్ చేసుకోవచ్చు. ఈ రెండింటిలో ఉండే ఫైబర్, ప్రోటీన్, యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. గుండె పోటు వచ్చే ప్రమాదాల నుంచి కాపాడుతుంది.

ఈజీగా బరువు తగ్గవచ్చు
బరువు తగ్గాలనుకునేవారికి గంజి బాగా ఉపయోగపడుతుంది. ఈ గంజిని డైలీ డైట్‌లో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. గంజిలో ఫైబర్, కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆకలిని నియంత్రిస్తాయి. దీంతో తొందరగా ఆకలి వేయదు. దీనివల్ల బయట ఫాస్ట్‌ఫుడ్ అంతగా తినరు. కాబట్టి బరువు తగ్గుతారు.

మధుమేహం నియంత్రణలో..
డయాబెటిక్ రోగులకు గంజి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గంజి అన్నం తీసుకోవడం, తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు మెరుగుపడతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. రోజూ గంజితో కలిపి రాగి జావ చేసుకుని తాగితే మధుమేహం ఉన్నవారికి బాగా ఉపయోగపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
జీర్ణక్రియను మెరుగుపరచడంలో గంజి బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మలబద్ధకాన్ని తగ్గించడంలో గంజి బాగా సహాయపడుతుంది. అలాగే గంజిలోని పోషకాలు రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.

కొలెస్ట్రాల్ తగ్గుతుంది
శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను గంజి తగ్గిస్తుంది. ఏదో విధంగా గంజిని తీసుకోవడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ పోతుంది. మూత్రవిసర్జనలో మంట, విరేచనాలు, అధిక రక్తస్రావం, నెలసరి సమస్యలు ఉన్నవారు గంజి తాగడం మంచిది. డైలీ తాగడం వల్ల అరచేతులు, అరికాళ్లలో మంట తగ్గుతుందని వైద్య నిపుణులు అంటున్నారు.

 

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.