Periods : సాధారణంగా పీరియడ్స్ అనేవి అమ్మాయిలకు ప్రతీ నెల వస్తుంటాయి. కేవలం గర్భం దాల్చినప్పుడు మాత్రమే నెలసరి ఆగుతుంది. లేదా వయస్సు పెరిగిన తర్వాత మోనోపాజ్ దశ వచ్చినప్పుడు పూర్తిగా ఆగిపోతాయి. కొందరికి అనారోగ్య సమస్యల వల్ల కొన్నిసార్లు ఆగుతుంది. ఒక్కోరి బాడీ, తీసుకునే ఆహారం, శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాల వల్ల కొందరికి నెలసరి ఆగుతుంది. నెలసరి అనేది సరైన సమయానికి రాకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొవలసి వస్తుంది. ప్రతీ నెల రాకుండా ఒక్క నెల దాటిన కూడా సమస్యలు తప్పవు. అయితే కొందరు తెలియక కొన్ని ఆహారాలను తీసుకోవడం వల్ల నెలసరి ఆలస్యం అవుతుంది. డైలీ తీసుకునే ఆహారం మీదనే నెలసరి వస్తుందా? రాదా? అనేది ఆధారపడి ఉంటుంది. కొందరికి తెలియక జింక్ ఉండే పదార్థాలను అధికంగా తీసుకుంటారు. శరీరానికి జింక్ ఎక్కువగా అయిన కూడా పీరియడ్స్ సరైన సమయానికి రావు. ఆరోగ్యానికి జింక్ మంచిదే. కానీ రోజుకి 14 మిల్లీ గ్రాముల కంటే ఎక్కువగా జింక్ తీసుకుంటే అండం విడుదల కావడం కష్టం అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి జింక్ ఉండే పదార్థాలను అధికంగా తీసుకోవద్దు.
మద్యం ఎక్కువగా సేవించడం, శారీరక వ్యాయామం చేయకపోవడం వల్ల కూడా నెలసరి సమస్యలు వస్తాయి. వీటివల్లే కొందరు నెలసరి సమయంలో పొత్తి కడుపు నొప్పితో బాధపడుతున్నారు. ఈ నొప్పిని తట్టుకోవడానికి సహజంగా చిట్కాలు పాటిస్తే పర్లేదు. కానీ మందులు వాడటం ఆరోగ్యానికి అంతమంచిది కాదు. నెలసరి సమస్యల నుంచి విముక్తి చెందాలంటే యోగా, మెడిటేషన్‌తో పాటు వాకింగ్ చేయాలి. అలాగే విటమిన్-బి6, విటమిన్-సి, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం ఫైబర్ ఉండే వాటిని తీసుకోవాలి. వీటివల్ల నెలసరి నొప్పి తగ్గడంతోపాటు సరైన సమయానికి పీరియడ్స్ వస్తాయి. సరైన టైంకి పీరియడ్స్ కావాలంటే.. ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, 10నిమిషాల పాటు మరగబెట్టి, చల్లార్చి వడపోసుకోవాలి. ఇలా చేసిన తర్వాత అవసరమైతే ఇందులో బెల్లం కలపాలి. దీన్ని మూడు వారాలకి ఒకసారి తయారు చేసుకుని తాగితే నెలసరి సరైన సమయానికి వస్తుంది. అలాగే నెలరోజుల పాటు మెంతి ఆకును కూరగా చేసి తింటే పీరియడ్స్ సరైన టైంకు వస్తుంది. దాల్చిన చెక్కను పొడి చేసి, గోరువెచ్చని పాలలో కలిపి తాగితే రెగ్యులర్ పీరియడ్స్ అవుతారు. ఈ చిట్కాలు పాటించిన కూడా సరైన సమయానికి తప్పకుండా పీరియడ్స్ అవుతారు. మద్యం, ధూమపానం ఈ రోజుల్లో చాలా మంది అమ్మాయిలు చేస్తున్నారు. వీటి వల్ల కూడా నెలసరి సరైన సమయానికి రాదు. ఈ సమస్య ఉంటే పిల్లలు పుట్టే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి చెడు అలవాట్లకు కాస్త దూరంగా ఉండటం మంచిది. దీనివల్ల నెలసరి సమస్యలతో పాటు అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.