Health Benefits: మారుతున్న జీవనశైలి వల్ల చాలా మంది అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. సోషల్ మీడియా మైకంలో పడి రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోవడం వల్ల రోజంతా నీరసంగా ఉంటున్నారు. కొందరు బాగానే ఉన్నా.. మరికొందరు మాత్రం పగటిపూట అంతా డల్‌గా ఉంటారు. ఉదయం లేచినప్పటి నుంచి వారికి మగతగా అనిపిస్తుంది. దీంతో రోజంతా ఎలాంటి పని కూడా చేయలేరు. నీరసం, అలసటగా అనిపిస్తుంది. అసలు కనీసం లేచిన తర్వాత బ్రష్ చేయడానికి కూడా ఆసక్తి చూపరు. ఏం పని చేయకుండా అలా ఒకే దగ్గర కూర్చోని ఉండాలనిపిస్తోంది. ఇలా రోజులో ఏ పని చేయడానికి కూడా యాక్టివ్ లేకుండా ఏదో చిరాకుగా ఉన్నవాళ్లు మోటారిక్ కాగ్నిటివ్ రిస్క్ సిండ్రోమ్ ముప్పుు ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అన్నింటికి డల్‌గా ఉండటం, నెమ్మదిగా నడవడం, స్లోగా పనులు అయిన చేయడం, ఎవరితో కలవలేకపోవడం, మాట్లాడలేకపోవడం, దేని మీద కూడా ఇంట్రెస్ట్ లేకపోవడం వంటివి జరుగుతాయి. వీటితో పాటు ఏ పని చేసిన కూడా ఏకాగ్రత చూపించ లేకపోవడం, జ్ఞాపకశక్తి పూర్తిగా తగ్గిపోవడం వంటివి కనిపిస్తాయి. ఇలా రోజూ అనిపిస్తే మాత్రం మోటారిక్ కాగ్నిటివ్ రిస్క్ సిండ్రోమ్ ఉందని అనుకోవచ్చు.
పగటిపూట ఇలా బాగా మత్తుగా అనిపించడానికి చాలా కారణాలు ఉన్నాయి. దీర్ఘకాలికంగా ఏదైనా నొప్పితో బాధపడుతున్న వారు, మధుమేహం, ఎక్కువ గంటలు లేదా నైట్ షిఫ్ట్‌ల్లో పని చేసిన వారు, నిద్రలేమి, రక్తంలో సోడియం స్థాయిలలో మార్పులు, పెయిన్ కిల్లర్స్ అధికంగా వాడిన వారు, హైపో థైరాయిడిజంతో బాధపడుతున్న వారికి ఎక్కువగా ఈ సమస్య బారిన పడుతున్నారు. కొందరు స్లీపింగ్ ట్యాబ్‌లెట్స్ వేస్తుంటారు. వారికి కూడా ఈ సమస్య వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు వయస్సు, డిప్రెషన్, ఒత్తిడి కారణంగా 35.5% మందిలో ఉత్సాహం తగ్గిపోతుంది. దీనివల్ల కూడా ఈ సిండ్రోమ్ బారిన పడుతున్నారు.
ఈ మగత సమస్య నుంచి విముక్తి చెందాలంటే ముందుగా డిప్రెషన్, యాంగ్జైటీ, విసుగు, ఒత్తిడి వంటి వాటి నుంచి బయటపడాలి. అందరితో మాట్లాడుతూ యాక్టివ్‌గా ఉండటం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కొంతవరకు సమస్య నుంచి బయటపడతారు. మరీ ఎక్కువగా సమస్య ఉంటే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. బ్లడ్ డిఫరెన్షియల్, బ్లడ్ షుగర్ లెవెల్, ఎలక్ట్రోలైట్స్, కాల్షియం, థైరాయిడ్ హార్మోన్ స్థాయిలు పరీక్ష చేస్తారు. వీటితో పాటు ఎమ్మారై స్కాన్, ఎలక్ట్రోఎన్సెఫలోగ్రామ్, మూత్ర పరీక్షలు చేసి సిండ్రోమ్‌ను గుర్తిస్తారు.
ఈ మగత సమస్య ఉన్నవారు కొన్ని పనులు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా డ్రైవింగ్ చేసేవారికి మగత ఉంటే అసలు చేయవద్దు. మగతగా ఉన్నప్పుడు డ్రైవింగ్ చేయడం వల్ల కొన్నిసార్లు ప్రమాదాలు జరుగుతాయి. దీనివల్ల మీ ప్రాణంతో పాటు ఇతరుల ప్రాణాలు కూడా రిస్క్‌లో పెట్టిన వారు అవుతారు. కాబట్టి ఈ సమస్య ఉంటే వెంటనే వైద్యుని సంప్రదించి చికిత్స తీసుకోండి. అలాగే హాయిగా నిద్రపోవడం, ఒత్తిడి లేకుండా ఉండటం, పోషకాలు ఉండే ఫుడ్ తీసుకోవడం వంటివి చేయండి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.