https://oktelugu.com/

Health Benefits: మొలకెత్తిన దుంపలు తింటున్నారా.. ఎంత ప్రమాదమో మీకు తెలుసా?

బంగాళదుంపలు కొని ఎక్కువ రోజులు అయి ఉంటే.. వాటికి మొలకలు వస్తాయి. కొందరు తెలియక వాటిని వండి తినేస్తారు. అయితే వీటిని తినడం ఆరోగ్యానికి మంచిదేనా? తింటే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి? అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుందా? అనే విషయాలు పూర్తిగా తెలుసుకుందాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 5, 2024 / 07:00 AM IST

    Sprouting Potato

    Follow us on

    Health Benefits:ఇంట్లో ఏ కూర వండిన అందులో బంగాళదుంప లేకపోతే అసలు వండిన ఫీలింగ్ కూడా కొందరికి ఉండదు. ఏ కూరలు ఇంట్లో స్టాక్ ఉన్నా లేకపోయిన బంగాళదుంపలు తప్పకుండా ఉంటాయి. ప్రతీ ఒక్కరూ ఎక్కువగా వినియోగించే కూరల్లో బంగాళాదుంపలు ఒకటి. ఇందులోని పోషకాలు శరీర ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అయితే ఈ బంగాళదుంపలను కీళ్ల నొప్పులు ఉన్నవారు తినరు. ఎందుకంటే వీటిని తినడం వల్ల వాపు, నొప్పులు అధికమవుతాయి. సాధారణంగా అయితే వీటిని ఫ్రై, కర్రీ, చిప్స్ ఇలా అన్ని రకాలు చేసుకుని తింటారు. చిప్స్ అయితే పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ కూడా ఇష్టంగా తింటారు. ఇందులో ఉండే కార్బోహైడ్రేట్లు, విటమిన్లు శరీర ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే బంగాళదుంపలు కొని ఎక్కువ రోజులు అయి ఉంటే.. వాటికి మొలకలు వస్తాయి. కొందరు తెలియక వాటిని వండి తినేస్తారు. అయితే వీటిని తినడం ఆరోగ్యానికి మంచిదేనా? తింటే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి? అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుందా? అనే విషయాలు పూర్తిగా తెలుసుకుందాం.

     

    కొందరు తెలియక మొలకెత్తిన బంగాళాదుంపలను వండుతుంటారు. వీటిని వండి తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే మొలకెత్తిన బంగాళదుంపల్లో విషపూరిత సమ్మేళనాలు ఉంటాయి. ఇవి శరీర అనారోగ్యాన్ని దెబ్బతీస్తాయి. దుంపలు మొలకెత్తిన తర్వాత అందులోని పోషకాలలో కొన్ని మార్పుల వల్ల అవి విషపూరితం అవుతాయి. మొలకెత్తిన బంగాళదుంపల్లో పొటాషియం, ఫైబర్, విటమిన్ సి, బీ6 వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల వాంతులు, వికారం, కడుపు నొప్పి, విరేచనాలతో పాటు దీర్ఘకాలిక వ్యాధులు బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటితో పాటు తలనొప్పి, తల తిరగడం, గందరగోళం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయట. అయితే దుంపలు వండేటప్పుడు ఆకుపచ్చగా కనిపించే ప్రాంతాన్ని వండకూడదు.

     

    బంగాళదుంపలు వండేటప్పుడు కొందరు తెలియక తొక్క తీయరు. దీనివల్ల ఆరోగ్యం హానికర వ్యాధుల బారిన పడుతుంది. ఎందుకంటే బంగాళదుంపల తొక్కల్లో గ్లైకోఆల్కలాయిడ్స్ ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి అంత మంచివి కావు. కొందరు బంగాళదుంపలను ఎక్కువ సమయం అధిక ఉష్ణోగ్రత వద్ద ఉడికిస్తారు. ఇలా చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు. తక్కువ మంటలో మాత్రమే వీటిని ఉడికించాలి. కొందరు వీటిని కాల్చడం వంటివి చేస్తుంటారు. ఇలా చేసి బంగాళదుంపలను తినకూడదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొలకెత్తిన బంగాళాదుంపల్లో సోలనిన్ అనే సహజ టాక్సిన్ అధికంగా ఉంటుంది. ఇవి కూరని చేదుగా చేస్తాయి. వీటిని తినడం వల్ల కూర టేస్ట్ అంతా వ్యర్థం కావడంతో పాటు అనారోగ్య బారిన పడేలా కూడా చేస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మొలకెత్తిన బంగాళదుంపలను వండవద్దు. ఎక్కువ రోజులు కూడా బంగాళదుంపలను నిల్వ చేసుకోవద్దు. ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా బంగాళదుంపలను కొనుక్కోవడం మంచిది.

     

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.